మీకు మీరే డాక్టర్

పూలకూరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఛింత చిగురు
చింత చిగురుతో కానీ లేదా ఏదైనా ఆకు కూరతో గానీ కలిపి మామిడిపూల పప్పు వండుతుంటారు. విడిగా పచ్చడి కూడా చేసుకోవచ్చు. నేల మీద రాలిపడే మామిడి పూలను చెట్లకింద దుప్పట్లు పరిచి సేకరించుకోవచ్చు. శుభ్రం చేసుకుని వాడుకోవచ్చు. వగరు రుచి కలిగిన ద్రవ్యాలలో మామిడి పూలు ముఖ్యమైనవి. చారు పొడినీ, మామిడిపూలనూ కలిపి నీళ్లలో వేసి ఉడికించి చారు కాచుకుని తాగుతుంటే జీర్ణకోశ సమస్యలు తగ్గుతాయి. పెరుగులో కలుపుకుని తింటే అమీబియాసిస్ వ్యాధి తగ్గుతుంది.
ములగ
ములక్కాడలు మాత్రమే తినటానికి పనికొస్తాయని మన నమ్మకం. కొందరు లేత ములగాకులు కూరగా వండుకొంటూంటారు. కానీ ములగ పూలు కూడా ఆహార పదార్థంగా వండుకోదగినవే!
‘శిగ్రోపుష్పం తు కటుకం తీక్షోష్ణం స్నాయుశోధనుత్/ కృమి హృత్క్ఫ వాతఘ్నం ప్లీహ గుల్మ జిత్’ అని ఆయుర్వేద సూత్రం. కొద్దిపాటి కారపు రుచి కలిగి వేడిని పెంచే స్వభావం కలిగిన ఈ ములగ పూలను రోజువారీ ఆహార పదార్థాలలో దేనితోనైనా కలుపుకుని వండుకోవచ్చు. కండరాలు పట్టేసి, కొంకర్లు పోతూ ఉండే వ్యాధిలో ఈ పూలు వాతాన్ని తగ్గించి కండరాలకు బలాన్నిస్తాయి. కాళ్లలో వాపు, పాదాలలో నీరు పట్టినప్పుడు నీటిని, వాపును తగ్గిస్తాయి. కడుపులో గడ్డలు కరిగిస్తాయి. వీటిని తినటం వలన కడుపులో నులిపురుగులు పోతాయి. కఫం తగ్గుతుంది. లివరు, స్ప్లీను మొదలైన అవయవాలలో వాపును తగ్గిస్తాయి. కంటి వ్యాధులను కూడా తగ్గిస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. ఈ పూలను నేతితో వేయించి పాక్పట్టి హల్వా చేసుకుని తింటూ ఉంటే లైంగిక సమర్థత పెరుగుతుంది.
మెట్టతామర
చాలా ఆరోగ్యవంతమైన పుష్ప శాకాలలో మెట్ట తామర పూలు ఒకటి. వీటిని ఆహార పదార్థంగా వండుకుని కమ్మగా తినవచ్చు. ఎటువంటి ఆహార పదార్థంగా వండుకుంటే ఇష్టంగా తినగలమో ఎవరికి వాళ్లు నిర్ణయించుకోవాలి. ఇవి ఔషధ ప్రయోజనం కలిగిన ఆహార ద్రవ్యం అనే విషయాన్ని మొదట గమనించండి.
నేతితో దోరగా వేయించి కారప్పొడిగా గానీ, రోటి పచ్చడిగా గానీ చేసుకోవచ్చు. వగరుగా ఉంటాయి. టీ కాచుకుని కూడా తాగవచ్చు. మూత్రపిండాలలో రాళ్లను కరిగించే గుణం వీటికుంది. పైత్యాన్ని, కడుపులో మంటను, మల మూత్రాల్లో మంటను కూడా తగ్గిస్తాయి. బాగా చలవ చేస్తాయి. వాత వ్యాధులున్న వారికి మంచివి. షుగరు రోగులకు తప్పనిసరిగా పెట్టదగిన ఆహార ద్రవ్యం ఇది. ఆస్తమా, దగ్గు జలుబు, ఆయాసం తగ్గుతాయి. తరచూ ఫిట్స్ వచ్చేవారికి కూడా దీన్ని ఇస్తూ ఉంటే ఫలితం కనిపిస్తుంది. ఈ జబ్బులున్న వారందరూ మెట్టతామర పూలను ఆహార పదార్థంగా తయారుచేసుకోవటం గురించి ఆలోచించండి. తేలికగా దొరికేదే! నీటి పారుదల ఎక్కువగా ఉండే చోట పెరుగుతుంటాయి.
వేప పూల
వేపపూలు వేసవి కాలానికన్నా ముందే పూయటం ప్రారంభించి వేసవి కాలం అంతా దొరుకుతూనే ఉంటాయి. రోడ్డు పక్కన పెరిగే మొక్క. కిరాణా కొట్లలో కూడా ఎండించిన వేప పూలు అమ్ముతుంటారు. మనం అడగటం మొదలు పెడితే వ్యాపారులు తెప్పించటం మొదలుపెడతారు. లేకపోతే కొనేవాళ్లు లేరని తెప్పించటం మానేస్తారు.
పల్లెల్లో వేప పూలను వేప చేదు అని పిలుస్తుంటారు. ఉగాది పచ్చడి రోజున చేదు కోసం వేప పూలని, వగరు కోసం మామిడి పూలనీ, పులుపు కోసం మామిడి ముక్కల్ని, తీపి కోసం చెరుకు రసాన్నీ, కారం కోసం మిరియాల పొడిని, తగినంత ఉప్పునీ కలిపి ఆరు రుచుల పచ్చడి తయారుచేస్తారు. ఆ ఒక్కరోజు తిని ఏకంగా బొందితో కైలాసానికి వెళ్లిపోవచ్చని అనుకోవటం అత్యాశ. ఉగాది రోజున దీన్ని తినటం ద్వారా ప్రతీరోజూ ఆరు రుచులతో కూడుకున్న ఆహారానే్న తీసుకుంటామని దేవుడికి మనం వాగ్దానం చేస్తూ ఉగాది పచ్చడి తింటాం. శక్తిదాయకమైన ఆహారం ఇలా షడ్రసోపేతమైనదిగా ఉండాలనేది ఇందులో సందేశం.
తాజా వేప పూలను గానీ, ఎండించిన వేప పూలను గానీ కొద్దిగా నెయ్యి వేసి దోరగా వేయించి రోటి పచ్చడిగా లేదా కారప్పొడిగా నూరి తినే అలవాటు మన పూర్వులకుండేది. ఈనాటికి కొందరు పితృదేవతల కార్యక్రమాలలో తప్పనిసరిగా వేపపూల పచ్చడి తయారుచేస్తారు.
వేప పూల పచ్చడి షుగరు రోగులకూ, షుగరు వ్యాధి వచ్చే అవకాశం ఉన్నవారికి, స్థూలకాయంతో బాధపడేవారికీ తప్పనిసరిగా రోజూ పెట్టడం అవసరం. ఇన్సులిన్ డిమాండ్‌ని శరీరంలో తగ్గిస్తుంది. వాత వ్యాధులు, ఎలర్జీ వ్యాధులు, జీర్ణకోశ వ్యాధులతో బాధపడే వారందరికీ సౌమ్యంగా పనిచేసే ఔషధం వేప పూత. దీన్ని తరచూ తినే వారికి కడుపులో నులిపురుగులు చచ్చి పడిపోతాయి.

- డా. జి.వి.పూర్ణచందు 9440172642 purnachandgv@gmail.com