జాతీయ వార్తలు

వీధి కుక్కలను చంపడమే పరిష్కారం కాదు : మేనకాగాంధీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: వీధి కుక్కలను చంపాలనే కేరళ ప్రభుత్వ నిర్ణయాన్ని కేంద్రమంత్రి మేనకాగాంధీ తప్పుబట్టారు. కుక్కల వ్యాక్సినైజేషన్‌కు ఎంతమేరకు ఖర్చు పెడుతున్నారని కేరళ ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నించారు. ‘కుక్కలు కరుస్తాయని, వాటిని చంపుతూ పోతుంటారా? ’ అని ఆమె ప్రశ్నించారు. పట్టణీకరణ నేపథ్యంలో ఇలాంటి సమస్యలు వస్తుంటాయని, అందుకోసం కుక్కలను చంపడమే పరిష్కారం కాదని అన్నారు. కుక్కలను చంపడం వల్ల సమస్య తీరదని, ఇతర ప్రాంతాలనుంచి కుక్కలు రావడం, ఉన్నవాటిలోనే సంతానం అధికం కావడం లాంటివి జరుగుతాయని, అదే స్టెరిలైజ్‌ చేస్తే త్వరగా ఫలితం కన్పిస్తుందని ఆమె అన్నారు.