విజయవాడ

త్యాగం కాదది., స్వార్థం ( చిన్న కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాపింగ్ మాల్‌లోంచి బయటికొచ్చిన శృతి అతడిని చూసి షాక్ తింది. యశ్వంత్! కాలేజీ రోజుల్లో ఇలాగే.. ఇంత పోలిక ఎలా? ఇతనికి పాతికేళ్లు వుంటాయి. ఏదో అనుమానం. ‘మీ నాన్నగారి పేరేమిటి బాబూ?’ దగ్గరగా వెళ్లి అడిగింది. ‘తెలియదు’! సమాధానం విని తెల్లబోయింది. ‘మీ అమ్మ చెప్పలేదా?’ తల అడ్డంగా ఊపాడు. ‘మీ అమ్మ పేరు?’ అడిగింది. ‘్ధన్య’ అని చెప్పాడు. విషయం పూర్తిగా అర్థమైంది శృతికి. ‘నేను మీ అమ్మ ఫ్రెండ్‌ని. నన్ను మీ ఇంటికి తీసుకెళ్లు’ అంది అతని స్కూటర్ వెనుక కూర్కొని.
‘అమ్మా! ఎవరొచ్చారో చూడు’ అన్నాడు. శృతిని చూసి తెల్లబోయింది ధన్య.
‘ప్రాణానికి ప్రాణం, స్నేహానికి ప్రతిరూపమని అందరూ అనేవారు. నా పెళ్ళి టైముకి చెప్పకుండా మాయమైపోయావు. ఎందుకు మాయమైపోయావో ఇప్పుడర్థమైంది’! అంది నిష్టూరంగా. ‘నీ ఉసురు తగిలే నాకు పిల్లలు కలగలేదు. నువ్వు నన్ను మోసం చేశావు’ అంది.
అతనికి జరిగిందేమిటో తెలిసింది. ఫ్రెండ్ కోసం దూరంగా వచ్చేసిన తల్లి త్యాగం అతన్ని కదిలించింది.
యశ్వంత్‌కి ఫోన్ చేసింది శృతి. అరగంటలో అతనక్కడికి వచ్చాడు. ఈలోగా ఫ్రెండ్స్ కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు.
‘ఇక నుంచి బాబు నా కొడుకు, యశ్వంత్ నీవాడు. మన కంపెనీల వ్యవహారాలు ఇక నుంచి నీ బిడ్డ చూసుకుంటాడు. నా వెంట వస్తావా బాబూ!’ కన్నీళ్ళతో అడిగింది శృతి. తల్లి వంక చూశాడు. అనుమతి ఇచ్చింది ధన్య! వెళ్ళిపోతున్న శృతి, రవిలను చూసి ‘ఎంత త్యాగం!’ అన్నాడు యశ్వంత్.
‘దీనిది త్యాగం కాదు స్వార్థం. అప్పుడు నిన్ను, ఇప్పుడు నా బిడ్డని అడిగింది. ఈ వయసులో బిడ్డకావాలి’ వెక్కివెక్కి ఏడుస్తున్న ధన్యని ఓదార్పుగా చూశాడు యశ్వంత్.

***
ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, ప్లాట్ నంబర్ సి- 3, 4, ఇండస్ట్రియల్ ఎస్టేట్, విజయవాడ - 520 007. email: merupuvj@andhrabhoomi.net

- చిట్టా లోకపావని, విజయవాడ.