విజయవాడ

కృష్ణాతీరంలో నవ్యాంధ్ర ఘనత (పుస్తక పరిచయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుటలు: 24, వెల: రూ.15
ప్రతులకు:
ఘంటా విజయకుమార్,
కాకతీయనగర్, రైతుపేట,
నందిగామ, కృష్ణా జిల్లా.
చరవాణి : 9948460199
**
ఘంటా విజయకుమార్ గారు కవిగా, జర్నలిస్ట్‌గా కృష్ణా జిల్లా సాహితీవేత్తలకు పరిచయస్తులే. కొంతకాలంగా కవిత్వానికి దూరంగా వున్నా ఇటీవల ఆయన మళ్లీ కవిత్వ రచనలో ఊపందుకున్నారు. కవి సందర్భానుసారంగా స్పందించి కవిత్వం రాస్తాడు. ఇప్పుడు కృష్ణానదికి పుష్కరాలొచ్చాయి. కృష్ణానది తీరప్రాంతంలో నివసిస్తున్న ఈ కవి ఆ నీళ్లు తాగి ఎదిగినదానికి కృతజ్ఞతగా ఇప్పుడు ఈ పుష్కరాల పండుగకు స్పందించి ఈ దీర్ఘ కవితను వెలువరించారు. సాధారణంగా కృష్ణా పుష్కరాలపై దీర్ఘ కవిత అనగానే కృష్ణానది నీటిపై కవికున్న మమకారాన్ని కవిత్వ రూపంలో వ్యక్తం చేస్తారనుకోవడం పరిపాటి. కానీ ఈ కవి అందరూ కడిగేసిన నీటిపై కవిత్వం కాకుండా నూతనత్వం పొంగు అద్ది, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణానది తీరప్రాంతాల్లో జరిగిన అభివృద్ధిని, వివిధ రంగాల్లో ఆయా ప్రాంతాలకు ప్రపంచస్థాయి గుర్తింపును తీసుకొచ్చిన మహామహులను, ప్రఖ్యాత దర్శనీయ దేవాలయాలు, తీర్థాలు, యాత్రా స్థలాలను సంక్షిప్తంగా తనకున్న కవితా పరిజ్ఞానంతో పరిచయం చేశారు. ఈ కవిత్వం చదివితే మనం ఆ విశేషాలన్నీ తెలుసుకుంటాం. అప్పటికే తెలిసినవారం పుష్కరాల సందర్భంగా మరోసారి గుర్తు చేసుకుని దర్శించుకుంటాం.
‘్భరత స్వాతంత్య్రోద్యమంలో
సువర్ణ్ధ్యాయానికి నాంది
త్రివర్ణ పతాక రూపశిల్పి
పింగళి వెంకయ్యకు
అమ్మ పట్టిన ఉగ్గుపాలలో
కలిసిన అమృతం కృష్ణాజలం
జాతిపిత మహాత్ముని
పాదస్పర్శతో పులకించిన
నదీతీరం త్యాగాలమయం’.. అంటూ జాతీయస్థాయిలో ఆంధ్రావనికున్న విశిష్టతను తెలియజెప్పారు.
‘కవులు, కళాకారులు
ఉద్యమవీరులు, సామాజికవాదులు
ఎందరెందరికో అభిమాన నిచ్చెలి
తరగని ముచ్చట్ల ఝరీ
కవిసామ్రాట్లు, కళరత్నాలు
నటసార్వభౌములు, విశ్వవిఖ్యాతులు
ఆంధ్ర పౌరుషాగ్నులు
అరుణ పతాకాల రెపరెపలు
హేతువాదులు, కమ్యూనిస్టులు
ఎన్నో మూర్తుల వ్యక్తిత్వాల
వికాస తరంగిణి, జ్ఞానవాహిని
ఈ ‘కృష్ణా’ తరంగిణి’.. అని ఎలుగెత్తి చాటుతారు విజయకుమార్. ఈనాటి తరానికి సంక్షిప్త రూపంలో కృష్ణానదీ తీరప్రాంత ఘనతను చాటిచెప్పాలనుకునే వారికి ఈ దీర్ఘకవిత ఓ చిన బాలశిక్ష. కృష్ణానదిపై రాయాలంటే ఎంతైనా రాయొచ్చు.. నదిపై తేలియాడే నౌకల నుండి, నదుల్లో ఈదే చేపల వరకు, నది నీళ్లు తాగి బతికే అనేక జీవరాశుల నుండి, నది నీళ్లపై తగువులాడుకొంటూ మనుషుల మధ్య ప్రాంతీయతల చిచ్చుపెట్టే రాజకీయ ప్రబుద్ధుల వరకు.. ఎన్నో, ఎనె్నన్నో రూపాల్లో కవిత్వం చిలికించవచ్చు. కానీ ఈ కవి లక్ష్యం- కృష్ణా పుష్కరాల సందర్భంగా ఈ తీరప్రాంత ఘనతని ప్రపంచానికి చాటి చెప్పటం వరకే పరిమితం. అంతవరకు ఈ కవి సఫలీకృతులయ్యారు. కవిత్వంపై మరింత అధ్యయనం ద్వారా మరింత చిక్కనైన, పదునైన పదాల ఘాటుతో మరింత మంచి కవిత్వం ఈ కవి నుండి ఆశించనూవచ్చు. ఎంత సీనియర్ కవి అయినా ‘సీ’-‘నియర్’ కాకూడదు కదా!

- చలపాక ప్రకాష్, విజయవాడ. చరవాణి : 9247475975