దక్షిన తెలంగాణ

సంకల్పం (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వజ్రమ్మా! నువు దేవకన్యోలున్నావే!’ అంటూ నాగలింగం గోడకొరిగి బీడీలు చేస్తున్న వజ్రవ్వ చెంపగిల్లాడు. అతడు ఆ ఊరి ఇంగ్లీషుమీడియం పాఠశాలలో అటెండర్.
నిండు గర్భవతి వజ్రవ్వ చెంపలు సిగ్గుతో కెంపులైనాయి. ‘అబ్బా! లోపల మా అమ్మ ఉన్నదని తెలుసుగదా! నీకు డ్యూటీ టైమంది పోరాదూ! కాటుక కళ్లు కమ్మగా తిప్పింది. ఆమె మొదటిసారి గర్భవతైనప్పుడు తల్లిగారి పల్లెటూళ్లో కాన్పయింది. కానీ పుట్టిన పసికూన ప్రాణాలొదిలింది. ఈసారి ఆసుపత్రిలో కాన్పు చేయించాలని వాళ్లమ్మ సారవ్వ వచ్చింది.
నాగలింగం ‘డ్యూటికెళ్తా’నని వెనక్కు తిరగ్గానే వజ్రవ్వ మొహం మబ్బులు కమ్మిన చందమామ లాగైంది. ‘హమ్మో.. నొప్పే అమ్మా!’ బీడీల చాట పక్కన పెట్టింది. ‘ఏమైంది బిడ్డా!’ అంటూ సారవ్వ అంగలేస్తూ వచ్చి కూతుర్ని ఎగాదిగా చూసింది.
‘అల్లుడా! ఇవి ప్రసూతి నొప్పులు. వెంటనే దవాఖానాకు పోదాం’ అంది. నాగలింగం ఆటోను తీసుకొచ్చాడు. ఇంట్లో ఉన్న ఐదొందల రూపాయలు జేబులో పెట్టుకుని ముగ్గురూ కలిసి ఆటోలో పక్కూరి ప్రైమరీ హెల్త్ సెంటర్‌కెళ్లారు. వజ్రవ్వను ఆసుపత్రి లోపలికి తీసుకెళ్లారు. నర్సు ఆదేశంతో మంచమీద పడుకోబెట్టారు. నర్సు వచ్చి చూసి వెళ్లిపోయింది. వజ్రవ్వకు నొప్పులాగిపోయినై. నర్సును వెతక సాగాడు.
ఆ మ్రైమరీ హెల్త్ సెంటర్లో ఇద్దరే డాక్టర్లు. లేడీ డాక్టరు ట్రాన్సఫరైపోయింది. ఉన్నొక్క డాక్టరుకు పట్నంలో ప్రైవేటు ప్రాక్టీసుంది. ఆ నర్సు ఒక్కతే అన్నీ చూసుకుంటుంది.
నాగలింగం వెళ్లి నా భార్యకు నొప్పులాగిపోయినై అని బతిమాలాడు. నర్సు వచ్చి ఇంజక్షనిచ్చింది. మళ్లీ నొప్పులొచ్చినై వజ్రవ్వ అరుపులు విని నర్సు లేబర్ రూంలోకి తీసుకెళ్లి పరీక్ష చేసింది. బయటికొచ్చి నాగలింగముతో ‘ఈమెకు కడుపుల పిండం తిరిగింది. ఆపరేషన్ చెయ్యాలె. మా దగ్గర డాక్టర్లు లేరు. పట్నం పెద్దాసుపత్రికి పోండ్రి’ అంది. సారవ్వ గుండెలు బాదుకొంది. నాగలింగం వెళ్లి ఆటో తీసుకొచ్చాడు. అంతా కలిసి పట్నంలోని ప్రైవేటు దవాఖానకెళ్లారు. వజ్రవ్వను పరీక్షించిన లేడీ డాక్టర్ ‘ఈమెకు వెంటనే ఆపరేషన్ చెయ్యాలి. లేకపోతే అపాయం. పది వేల రూపాయలు కట్టండి’ కడుపులో చల్ల కదలకుండా చెప్పింది.
నాగలింగం నోరెల్లబెట్డాడు. ‘ఇప్పుడు నా దగ్గర పైసలు లేవు డాక్టర్, ముందు ఆపరేషన్ చెయ్యండి. తరువాత తెచ్చి కడ్తా’ నన్నాడు. డాక్టర్‌కు కోపమొచ్చింది. ‘పైసలు లేకపోతే ప్రైవేటు దవాఖాన్లకు రావద్దు’ గదమాయించింది. ‘నా దగ్గర బంగారం గూడా లేదమ్మా!’ అన్నాడు. డాక్టర్ తిరిగి వెళ్లిపోయింది. నాగలింగం నెత్తి కొట్టుకున్నాడు.
‘ఈ దవాఖానకు పెద్ద ఎవరమ్మా!’ నర్సునడిగాడు.
‘ఇప్పుడు చూసిన లేడీ డాక్టరుదే ఈ దవాఖాన. ఆమెనే పెద్ద’ అని నీ పెండ్లాం మెడల పుస్తెలతాడు బంగారందే గదా! గుర్తు చేసింది.
‘అయ్యో రామా! పుస్తెలతాడు తియ్యొద్దు’ నర్సవ్వ గొల్లుమంది. ‘నీకు పుస్తెల తాడెక్కువనా, నీ బిడ్డ ఎక్కువనా?’ నర్సు నిలదీసింది.
‘అత్తా! ముందు నీ బిడ్డ ప్రాణాలు కాపాడుకొందాంలె’ అని ‘ఈ పుస్తెల తాడునెవరు కొంటరమ్మా?’ నర్సునడిగింది.
‘అగ్గో ఎదురంగ మార్వాడి దుకాణముంది. ఆయన బంగారం కొంటడు, అమ్ముతడు’ అంది. వజ్రవ్వ నొప్పి భరించలేక తోక కోసిన మేకలా అరుస్తూ అవస్థ పడుతోంది.
నాగలింగం బయటి కెళ్లి కిరాణా షాపులో దారం, పసుపుకొమ్ము తెచ్చాడు. దారానికి పసుపుకొమ్ము కట్టి భార్య మెడలో వేసిండు. పుస్తెలతాడు తీసుకెళ్లి మార్వాడి దుకాణంలో అమ్మేసిండు. పదిహేను వేల రూపాయలొచ్చినై. పదివేలు ఆసుపత్రి కౌంటర్లో కట్టేసిండు. రసీదు లేడీ డాక్టరుకు చూపించిండు.
వెంటనే నర్సవ్వకు ఆపరేషనైంది. ఆడపిల్ల పుట్టింది. నర్సు బయటికొచ్చి ‘మీకు లక్ష్మి పుట్టింది. తల్లి-పిల్ల క్షేమం’ తీపి కబురు చెప్పింది.
నాగలింగం సంతోషానికి హద్దులు లేవు.

- ఐతా చంద్రయ్య సిద్దిపేట, మెదక్ జిల్లా సెల్.నం.9391205299