రాజమండ్రి

అవ్వ... హవ్వ (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కిరణ్, స్వాతి కొత్తగా పెళ్లయిన జంట. పెళ్లయిన రెండు నెలల తర్వాత అన్నవరం సత్యనారాయణ స్వామి దర్శనానికి వెళ్లారు. ముందుగా వ్రతానికి కావాల్సిన సామాన్లను కొంటున్నారు. కొబ్బరికాయలు కొని బయటకు వస్తున్నప్పుడు ఓ ఎనభై సంవత్సరాల ముసలి అవ్వ వాళ్ల దగ్గరకొచ్చి ఒక రూపాయి ధర్మం చెయ్యండి అంటూ ప్రాధేయపడింది. అంచులు చిరిగి, రంగు వెలిసిన పాత చీర.. కళ్లద్దాలు, చిన్నగా బొట్టు, చెదిరిపోయిన జుట్టు, శరీరంపై ముడతలు, కాళ్లకు వేర్వేరు చెప్పులు అవన్నీ చూసి కిరణ్ చలించిపోయి వంద రూపాయలు ధర్మం చేశాడు.
ఆ తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం పూర్తి చేసుకొని దర్శనం కోసం క్యూలైన్లలో నిల్చున్నారు ఇద్దరు. ఆ అవ్వ దర్శనంలో ఉన్నవారిని కూడా అడుక్కోవడం కూడా గమనించాడు!
‘పాపం ఆ ముసలి అవ్వ ఎవ్వరూ లేరనుకుంటా రోజు గడవడం కోసం తప్పని పరిస్థితుల్లో అడుక్కొంటున్నట్లు ఉంది.’
‘అవును నాకు అలానే అన్పించింది’ అని స్వాతి కిరణ్‌తో చెప్పింది.
తర్వాత దర్శనం చేసుకొని బయటకొచ్చారు. అప్పుడు కూడా ముసలి అవ్వని చూసి బాధపడ్డారు కిరణ్. ఇంతలో అవ్వ మళ్లీ వాళ్ల దగ్గరకొచ్చింది. ఈసారి స్వాతి యాభై వేసింది. ‘చాలా బాధన్పిస్తోంది’ అని చెప్పింది కిరణ్‌తో.
కొండ దిగి ఓ భోజన హోటల్‌లో భోజనం చేసి బిల్ చెల్లించేటప్పుడు ఆ అవ్వ ఎప్పుడు కొండ దిగిందో తెలియదు ఆ హోటల్‌లో అడుక్కోవడం మొదలుపెట్టింది.
ఆ ఓనర్ వెళ్లు వెళ్లు అంటూ అరిచాడు.
పాపం ఒక రూపాయి వేయాల్సింది, ఎలా బక్కచిక్కిపోయిందో చూడండి, అప్పుడు ఆ ఓనర్ ‘తనకేం రోగం.. లక్షల ఆస్తి సంపాదించి అడుక్కు తినడంలో, ఈ అన్నవరంలో రెండు ఇళ్లు కట్టింది, మనవరాలికి పది లక్షలిచ్చి పెళ్లి చేసింది, రెండు భారీ స్థలాలు కొంది, తన ఆదాయం రోజుకు రెండువేలు’.
ఆ ఓనర్ మాటలకి షాక్ తిని ‘మేము ఈరోజు నూట యాభై వేశాం’ అని కిరణ్ చెప్పగానే, ‘ఆ అవ్వ ఎలాంటి వారినైనా మాయ చేస్తుంది. నటించడంలో తనకి తనే సాటి’ అని చెప్పడంతో కిరణ్, స్వాతి ‘హవ్వ’ అని మిన్నకుండిపోయారు.

- నల్లపాటి సురేంద్ర సెల్: 9490792553