రాజమండ్రి

పరమ గురువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఎలాగైనా సరే అబ్బాయిని మెడిసిన్‌లో జాయిన్ చెయ్యాల్సిందే’ అంటూ భార్య రంజిత చేసిన హెచ్చరిక లాంటి స్వరం ఈజీ ఛైర్‌లో, ఎసిలో కూర్చున్న శంకర్‌ను చెమటతో కంపనాలు వచ్చేలా చేస్తోంది. ఒక లక్షా రెండు లక్షలతో పోయే వ్యవహారం కాదు. ఏకంగా యాభై లక్షల వ్యవహారం. ఎక్కడ నుండి తేవాలి? అప్పు చేస్తే తీర్చగలమా? మరి దారేమిటి?2 రకరకాల ప్రశ్నలతో అంతరంగం వేడెక్కిపోతోంది శంకర్‌కి. నిజానికి ఊహించడానికి కూడా సరిపోని ఆర్థిక స్థితి శంకర్‌ది. ప్రభుత్వం కల్పించిన సంక్షేమాలతో ప్రభుత్వ ఉద్యోగిగా అధికారి స్థాయికి ఎదిగాడు. అడపాదడపా బల్లకింద చెయ్యి తడుపుకుంటేనే ఉన్నాడు. కాని ఇప్పుడు కడుక్కోవాలి. తన అధికార దర్పాన్ని ఉపయోగించి నిధులు రాబట్టవచ్చు. కాని ఇప్పటిదాకా తాను చేస్తున్న పనికి ఎక్కడో సంస్కారం ప్రశ్నిస్తోంది శంకర్‌ను. ప్రభుత్వ సహకారంతో ఇంతవాడైన తాను తన కంటె కిందిస్థాయిలోనున్న వాళ్లను ఉద్ధరిద్దామని నిరుద్యోగిగా ఎన్నో ఆశయాలు వల్లె వేసేవాడు. కాని తరువాత అవన్నీ మరచిపోయాడు.
‘ఇంత పెద్ద మొత్తంతో చదివించడం అవసరమా? తన స్థాయికి తగిన చదువు చెప్పించడమే న్యాయమేమో?’ అని అతని సంస్కార అంతరంగం ప్రబోధించడం మొదలుపెట్టింది. కాని రంజిత మాటలు ఏంచేయ్యాలో తెలియని పరిస్థితిని కల్పిస్తున్నాయి. ‘నిజమే నా జీవితం నాకు చాలా ఎక్కువ. కాని ఇంతకాలం ఎంత తప్పు చేశాను. ఏమైనా సరే ఈ రోజు నుండి మారాలి’2 అనుకున్నాడు. హైస్కూల్లో తెలుగు మాస్టారు శర్మ గారు పరిచయం చేసిన గురువును అడిగి తన కర్తవ్యాన్ని నిర్ణయించుకోవాలనుకున్నాడు శంకర్. మరునాడు ఆదివారం ఉదయానే్న స్నానం చేసి సమీపంలోని కృష్ణ మందిరానికి బయలుదేరాడు. నిత్య జీవిత సమస్యలకి మార్గం సుగమం చేసే గురువును కళ్లకు అద్దుకున్నాడు. అత్యంత భక్తిశ్రద్ధలతో తన మనసులోని డోలాయమాన పరిస్థితిని వివరించాడు. తాను మారాలన్నాడు. ఎవరి ప్రలోభాలకు లొంగ కూడదనుకున్నాడు. చిత్రంగా పరిష్కారం వెంటనే తెలియజేశాడు పరమ గురువు. ప్రార్థించి తెరచిన పేజీ పదహారవ అధ్యాయమైన దైవాసుర సపద్విభాగయోగములోని 21వ శ్లోకము
‘త్రివిధం నరక స్యేదం ద్వారాం నాశనమాత్మనః
కామః క్రోధస్త్థాలోభః తస్మా దేవత్త్రయం త్యజేత్!’2
విపరీత కోరికల వలన కోపము జనించి తుదకు లోభిగా మారి నాశనమగును. వెంటనే జలజలా రాలుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ పరమ గురువు భగవద్గీతకు శిరస్సు వంచి తాకి గుండెల నిండా ఊపిరి పీల్చుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఎంతో ఆనందంగా బయలుదేరాడు శంకర్.

- వారణాశి వెంకట సూర్య కామేశ్వరరావు, రాజమహేంద్రవరం, చరవాణి - 9491171327