నెల్లూరు

రక్తికట్టిన నగరానికి ఆవల (స్పందన )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత వారం మెరుపులో ప్రచురించిన నగరానికి ఆవల కథ చాలా బాగుంది. మెరుపులో చాలాకాలం తర్వాత ఓ మంచి ఆసక్తికరమైన కథను చదవామన్న భావన కలిగింది. రచయిత కె రవిశేఖర్ విభిన్న కోణంలో ఆలోచించి కథను నడిపిన తీరు రక్తికట్టింది. బాంబుపేలుళ్లలో మరణించిన వారు దేహంపై ఉన్న భ్రాంతితో ఇంకా జీవించి వున్నట్లే చూపిన ప్రయత్నం బాగుంది. వారి సంభాషణలు అంతా కొత్తగా సాగాయి. కథను చదువుతున్నంత సేపూ కథ నిజంగా ఇద్దరు సజీవ వ్యక్తుల మధ్య జరుగుతున్నట్టే అనిపించింది. కానీ చివరలో ఊహకందని ట్విస్ట్ పెట్టి వారు మనుషులు కాదు..మరణించినవారు అంటూ రచయిత నిజంగానే పాఠకులపై బాంబు పేల్చాడు. భార్యను కలుసుకోవాలనే అతని కల, బార్డర్‌లో జరిగిన కాల్పుల్లో భర్త మరణించిన ఆమె ఇద్దరూ కూడా బాంబు పేలుళ్లలో మరణించడం.. వారి కోర్కెలు తీరక చివరకు సమాజంలో జరిగే పరిణమాలపై విసుగు చెంది అలా అనంతతీరాలపై సాగిపోవడం ఇలా..కథను చాలా అద్భుతంగా అందించిన రచయితకు మరోసారి ధన్యవాదాలు.
అల్లూరు సాయికృష్ణ, మదనపల్లె
రమాలక్ష్మీ పిడతల, గిద్దలూరు
వెంకటేష్ తిరువాయిపాటి, కావలి
అంచల రాగవేణి, నెల్లూరు

హోదాపై ప్రచురించిన కవితలు బాగున్నాయి
మెరుపులో మోదీజీ హోదా రొద ఎన్నాళ్లు? అలాగే హోదా కోసం ఏ గోదాలోకైనా దిగుదాం అంటూ ప్రచురించిన కవితలు రెండూ బాగున్నాయి. సాక్షాత్తు తిరుపతి శ్రీవారి సన్నిధిలో మోదీ ఇచ్చిన హామీని అమలు చేయాలంటూ రచయిత సింగంపల్లి వెంకటకృష్ణ ప్రసాద్, ఈ హోదా కోసం ఏ గోదాలోకైనా దిగేందుకు ఆంధ్రులందరు..సమరసింహనాధం చెయ్యాలి అంటూ ఉత్తేజభరితంగా కుర్రాప్రసాద్‌బాబు గారు రాసిన కవిత చాలా బాగుంది. ప్రతి పదం కదిలించేవిధంగా సాగింది. అభినందనలు
- శైలజా వడిసిపట్ల, జలదంకి
- పచ్చా సోమయాజులు, అగ్రహారం, మేదరమెట్ల
- అనసూయమ్మ, రచయిత్రి, ఉదయగిరి

***
రచనలకు ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net