నెల్లూరు

నడక (కృష్ణమ్మ ఘనకీర్తి)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆకాశంలో మేఘాలతో విహరిస్తున్నాను
పాతాళంలో నిధిగా నిక్షిప్తపై వున్నాను
భూమిపై బాటసారిగా నడక సాగిస్తున్నాను
నేనుంటేనే ఏ గ్రహానికైనా జీవశక్తి
నేను లేని చోటు జీవరాశులకు ప్రాణవిముక్తి
చెట్టుకైనా..చేనుకైనా..పక్షికైనా..పశువుకైనా..
మనిషికైనా..మహోన్న శక్తికైనా..నేనే జీవనాధారం
నిరంతరం నడక సాగిస్తూనే ఉంటాను
ఆగితే నా కాళ్లు నొప్పెడతాయి
నా నడకలో ఎన్ని అందాలను చూస్తాను..
ఉషోదయం వేళ
సూర్యుని కిరణాలు నన్ను తాకుతుంటే
నులివెచ్చని గిలిగింత.. సుర్యాస్తమయ వేళ
అరుణ కాంతులు ముద్దాడుతుంటే
చిలిపి తనపు కవ్వింత
పున్నమిరాత్రి వెండి వెనె్నల పరుచుకొంటే
తొలిరేయి పులకరింత
ఎన్ని పొలిమేరలు చూశాను
ఎన్ని పొలికేకలు విన్నాను
ఎందరి పాదముద్రలు తాకాను
ఎన్ని చరిత్రలు గుండెల్లో దాచుకొన్నాను
నాగరికత ఓనమాలు దిద్దుకొంది నా దగ్గరే
నేను నడక ప్రారంభించినపుడు
రాళ్లూ..రప్పలు..కొండలూ..కోనలు
నాకు ఆటంకం కలిగించాయి
నా నడకకు సంకెళ్లు వేయాలని చూశాయి
కొన్నిచోట్ల ఆగాను..చరిత్ర తెలుసుకొన్నాను
కొన్ని చోట్ల వడివడిగా నడిచాను..
కొన్నిచోట్ల పరుగుపెట్టాను..ముందు తరాల అవసరాలు గుర్తించాను
అయినా..నా నడక ఆగలేదు
నా కోసం ఎన్ని యుద్ధాలు, ఎత్తులు, చిత్తులు
పూజలు, కొలుపులు, యాగాలు, ఆగాలు
చర్చిలో వుంటాను..మసీదులో వుంటాను
సమానత్వ గీతం నా నడక
పైనుంచి క్రిందికి దూకుతుంటే
వెన్ను విరిగిపోయినంత బాధ
ముళ్ల కంపలను దాటుకొంటూ పరుగెడుతుంటే
శరీరం రక్తశిక్తమై గుండెకోత
రాళ్లూరప్పలకు ఎదురుదెబ్బలు తగులుతుంటే
ఎవరికీ చెప్పుకోలేని వ్యధ
అయినా..గమ్యం తెలియని బాటసారిలా
నడుస్తూనే ఉన్నాను. లక్ష్యం ఒక్కటే..
ఎండిన బీళ్లల్లో అన్నం మొక్కై మొలవాలని
ఎండిన గొంతుల్లో తడినై నడయాడాలని
అంధకారం నిండిన జగతికి వెలుగులు
పంచాలని...నడుస్తూనే ఉన్నాను
గాయమైన పాదాలకు లేపనం వ్రాయడానికి
విరిగిన వెన్నుకు విల్లంబై నిలవడానికి
రక్తశిక్తమైన నా శరీరానికి సేవలందించడానికి
మీరు పరుగుపరుగున వచ్చిన తీరు చూస్తుంటే
నా నడక చిన్నబోయింది
జనప్రవాహం ముందు
నా పరుగు వెలవెలపోయింది
ఈ జీవరాశికి ఎంత కృతజ్ఞత
పుష్కరవేళ నా పాదముద్రల్లో మునిగి
పునీతులవడానికి బిరబిరా కదలి వచ్చి
నా పాదాలకు నమస్కరించి
తమ సంస్కారాన్ని చాటుకున్నారు
మనిషంటే చేసిన మేలు మర్చిపోయే
వాడనుకొన్నాను.. ఈ జన ప్రవాహాన్ని చూసి
నేనూ ఈ జనప్రవాహంలా
పుష్కరస్నానం చేసి తరించా..!

- పొన్నూరు వేంకటశ్రీనివాసులు, ఒంగోలు, చరవాణి : 9666693077