నెల్లూరు

వెంకయ్యస్వామికి అక్షర పుష్పాలు (పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతులకు
గురుబ్రహ్మ వేణుగోపాలస్వామి
చరవాణి : 9490916869
***
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలో వెలసిన అవధూత వెంకయ్యస్వామి మహిమలు ఎనలేనివి. ఆర్తితో ఉన్నవానికి అన్నం పెట్టుమన్న అవధూత నినాదం నిత్యనూతనం. అవధూతగా పదిమందికీ మంచిని బోధిస్తూ ఊరూరా తిరుగుతూ తన మహిమల్ని చాటి చివరికి దివ్య సమాధి పొందిన శ్రీవెంకయ్యస్వామికి వెంకటాచలం మండలం గొలగమూడిలో నిత్య ఆరాధనలు ఎంతోవేడుకగా జరుగుతున్నాయి. అక్కడ పనిచేసే కార్యనిర్వహణాధికారి సుబ్రహ్మణ్యం నిబద్ధత, చిత్తశుద్ధితో పనిచేయడంతో ఆలయం అభివృద్ధి చెందడంతో పాటు వెంకయ్యస్వామి లీలలు బహుళ ప్రాచుర్యం పొందాయి. అందులో భాగంగా వెంకయ్యస్వామి లీలలు, ఆరాధనా విధానం వంటి ఎన్నో ప్రచురణలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా భగవాన్ శ్రీవెంకయ్యస్వామి ధ్యానయోగ, ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రముఖ రచయితలు మోపూరు పెంచలనరసింహం, డి ప్రసూనా శరత్ సంయుక్తంగా అవదూత వెంకయ్యస్వామి పాదాలపై తమ పాండిత్య ప్రతిభతో వంద పద్యాలను శతక రూపంలో భక్తిపూర్వకంగా సమర్పించుకున్నారు.
భగవాన్ శ్రీ వెంకయ్యస్వామి మహిమామృతము(శతకం) భక్తిమాల పేరుతో జంట కవులు రాసిన వందకు పైగా పద్యాలు ‘వెంకయార్యు మహిమ వినుమురయ్య’ అనే మకుటంతో భాసిల్లాయి. ప్రతి శతక రచనకు ముందు ప్రార్ధనగా శ్రీ గణనాథుడిని, వీణాపాణిని జన్మనిచ్చిన తల్లిదండ్రులను భక్తిపూర్వకంగా ప్రార్ధించి ఆపై వెంకయ్య స్వామి లీలల్ని ఒక్కొక్కటిగా కావ్యాంశాన్ని ఒక పద్యంలోనూ చక్కగా పొందికగా అమర్చిన విధానం అద్భుతం. ముందుగా అవధూత వెంకయ్యస్వామి చరిత్రను తెలుసుకోవడం ఒక ఎత్తు ఆపై ఆయన లీలల్లో కొన్నింటిని క్రోడీకరించి వాటికి అక్షర రూపం ఇస్తూ చంధస్సులో బంధించడం మరో ఎత్తు. పద్యరచన మరుగున పడుతున్న ఈకాలంలో వెంకయ్యస్వామి లీలలను ఆవిష్కరించడానికి పద్యాలన్ని ఎన్నుకోవడం ముదావహం. ఇందులో రచయితలిద్దరూ సఫలీకృతులయ్యారనే చెప్పవచ్చు. వేమన శకత శైలిలో, తేలికపాటి పదాలతో పండిత పామరులకు అర్ధమయ్యే రీతిలో ఈ ఆధ్యాత్మిక భక్త్భివన తొణికిసలాడేలా శతక రచన సాగిందని చెప్పడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదు.

- గౌతమి , 9347109377