నెల్లూరు

తప్పు (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డాక్టర్ మధుకర్ కారు సడన్ బ్రేక్‌తో ఆగిపోయింది. ఏమై ఉంటుంది కారుకి. ఈరోజే పెట్రోలు ఫుల్ చేశానే మరి ఎందుకు ఆగి ఉంటుంది తెలీడం లేదు. బయట భోరున వర్షం. ఆ వర్షం కారణంగా కరెంట్ కూడా లేదు. మెకానిక్ మస్తాన్‌కు ఫోన్ చేస్తే వెళ్లడం లేదు. కారు దిగి తనకు తోచిన రిపేర్లు చేశాడు డాక్టర్ మధుకర్. ఊహు కారు నడవడానికి మొరాయిస్తోంది. ఇక చేసేదేమి లేదు వర్షం వెలిసే వరకు ఎక్కడైనా నిలబడాలి అంతే తప్ప మరోదారి లేదు. డాక్టర్ మధుకర్ ఆ ఊళ్లో పెద్ద ఆర్ధోసర్జన్. అప్పుడే ఒక ఎమర్జన్సీ సర్జరీ చేసి వస్తున్నాడు, వస్తుంటే ఇలా జరిగింది. అతడి అడుగులు వడివడిగా ఒక ఇంటి ఆవరణలోకి లాక్కెళ్లాయి. వెళ్లి నిల్చున్నాడు పది నిమిషాలైనా వర్షం ఆగలేదు. ఇంతలో తలుపు తెరుచుకున్న శబ్ధం అయింది. అరే ఇప్పుడేలా ఎవరో ఇంటి ఓనర్ వస్తున్నట్టున్నాడు.. తను వెళ్లిపోవాలి లేకుంటే అనవసరంగా తనని దొంగ అనుకున్నా.. అనుకోవచ్చు..‘ప్చ్’ అనుకుని ఓ రెండడుగులు వేశాడు..్ఫన్ కాంతి తన మీద పడేసరికి చీకట్లో నిలబడ్డ మధుకర్ మొహంమీద రెండు చేతులు పెట్టుకున్నాడు కాంతి భరించలేనట్టు.
‘‘ ఓ మధుకర్ మీరా’’ అంటూ భుజం మీద పరిచయమైన చేయి పడింది ఆ స్వరం బాగా తెలిసిందే మధుకర్‌కి. అది ప్రముఖ పిల్లల డాక్టర్ సుధాకర్‌ది. అతడితో స్నేహమైతే లేదు గాని పరిచయం ఉంది ‘‘హలో ఇది మీ ఇల్లా.. సారీ నాకు తెలీదు వర్షం పడుతుంటే కారు చెడిపోయింది..నిలబడ్డాను’’ అంటూ అపాలజీ చెప్పాడు. ‘‘్భలే వారే రండి కాఫీ తాగుదురు మిమ్మల్ని నా కార్లో డ్రాప్ చేస్తాను నా మిసెస్, కిడ్స్ పార్టీకి వెళ్లారు, నాకు ఓ సర్జరీ వుండడంతో వెళ్లలేకపోయాను, కరెంట్ పోవడంతో టీవీ కూడా చూడలేకపోయాను థాంక్ గాడ్ మీరు వచ్చారు అంటూ అది సరే మీరెందుకు వెళ్లలేదు పార్టీకి’’ అని ప్రశ్నించాడు సుధాకర్.
‘‘పార్టీనా ఎవర్దీ’’ ఆశ్చర్యంగా అడిగాడు మధుకర్. ‘‘ఓ మీకు తెలీదా ఆశ్చర్యంగా ఉందే అందర్నీ పిలిచాడు సిటీలో ఈఎన్‌టి స్పెషలిస్ట్ శ్రీకర్ వాళ్ల అబ్బాయి బర్త్‌డే అట మిమ్మల్ని పిలవలేదా? మీతో కూడా చాలా క్లోజ్ కదా?’’ అన్నాడు సుధాకర్. ‘‘బహుశా మరచిపోయి ఉండొచ్చులేండి’’ అన్నాడు మధుకర్’’ ‘‘లేదు సర్ అతడు ఏ డాక్టర్‌ని వదల్లేదు నన్ను కూడా మరి మరీ పిలిచాడు టైమ్ లేక వెళ్లలేకపోయాను ఫోన్‌లో అపాలజీ చెప్పి నా మిసెస్, కిడ్స్‌ను పంపించాను. మరి మిమ్మల్ని ఎందుకు ఇన్‌వైట్ చేయలేదో ఆశ్చర్యంగా ఉంది’’ అంటూ కాఫీ కప్ అందించాడు సుధాకర్. కాఫీ తాగేసరికి కరెంట్ వచ్చింది వాన వెలసింది ‘‘పదండి మిమ్మల్ని డ్రాప్ చేస్తాను’’ అంటూ ఇల్లు లాక్ చేసి కారు డోర్ ఓపెన్ చేశాడు సుధాకర్. తనని ఎందుకు ఇన్‌వైట్ చేయలేదో అర్ధమైంది మధుకర్‌కి తనకి పిల్లలు లేకపోవడమే కారణం. మనిషి ఎంత చదివినా కొన్ని మూఢనమ్మకాలకు కట్టుబడిపోతాడు అందుకే తనని తన కొడుకు బర్త్‌డే పార్టీకి పిలవలేదని అర్ధమైంది మధుకర్‌కి. ఇలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ గురించి తన మిసెస్ తనతో అప్పుడప్పుడు డిస్కస్ చేస్తూనే వుంటుంది. పిల్లలు లేకపోతేనేం అనాధాశ్రమంలో ఎందరో పిల్లలు తనని ‘డాడీ’ అని పిలుస్తారు. ప్రతి ఆదివారం తను అక్కడికి వెళ్లి వాళ్లకి కావాల్సినవి తన చేతనైన వరకు అమరుస్తాడు. బిస్కట్స్, చాక్లెట్స్ పంచుతాడు. ఎవరైనా పిల్లవాడు బర్త్‌డే అంటే దగ్గరుండి కేక్ కట్ చేయించి కొత్త బట్టలు తొడుక్కున్న ఆ అనాధ బాలల మొహంలో వెలిగే సంతోషం చాలు అనుకుంటాడు. పడుకున్నాడన్న మాటే కానీ అతడికి నిద్రపట్టలేదు. ఇంతలో ఫోన్ ‘సర్ నేను శ్రీకర్‌ని మా అబ్బాయి పడిపోయాడు మేడపై నుండి మీరే కాపాడాలి’’ అంటూ ఫోన్లో ఏడుస్తున్నాడు ‘‘మిస్టర్ శ్రీకర్ నేను వస్తున్నాను భయపడకండి’’ అంటూ డ్రస్ ఛేంజ్ చేసుకోకుండానే భార్య కార్ కీస్ తీసుకుని బైల్దేరాడు. ఎమర్జన్సీ ఆపరేషన్ చేశాడు. కొత్త బట్టలు కాస్త పొడవు అవ్వడంతో తట్టుకుని మేడమెట్ల పై నుండి జారిపడ్డాడు శ్రీకర్ వాళ్ల అబ్బాయి సాత్విక్. ఆశ్చర్యం ఎక్కడ దెబ్బలు తగల్లేదు. చేయి మాత్రం ఫ్రాక్చర్ అయింది. అది చాలా పెద్ద ఫ్రాక్చర్ దానికి సర్జరీ చేసి ‘‘మళ్లీ రేపు వచ్చి చూస్తానని మరేం ఫర్వాలేదు’’ అంటూ వెనుతిరిగిన మధుకర్ కాళ్ల మీద శ్రీకర్ పడ్డాడు ‘‘అరే..అరే లేవండి ఏంటి ఇది’’ భుజాలు పట్టుకులేపబోయాడు మధుకర్. ‘‘నేనొక తప్పు చేశాను సార్ ఆ తప్పు రిజల్టే ఈ ఇన్సిడెంట్ అంటూ ఏవో చెప్పబోతున్న శ్రీకర్‌కి ఇట్స్ ఓ.కే. ‘‘మిస్టర్ శ్రీకర్ మీరు చేసింది ‘‘తప్పు’’ అని తెలుసుకున్నారు కదా అదే చాలు నాకు వెళ్లొస్తాను’’ అంటూ వెనుతిరిగిన మధుకర్‌ని కళ్లనీళ్లతో అలాగే చూస్తుండిపోయాడు నమస్కరిస్తూ శ్రీకర్.

- డాక్టర్ ఎం.ఎస్. జ్ఞానేశ్వర్ మదనపల్లె చరవాణి : 9440729701