ఉత్తర తెలంగాణ

చల్లని తల్లి! (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చల్లని తల్లి చెట్టు
తన కడుపు పండితేనే కదా..
మన కడుపు నిండుతుంది!
తన ఒడిలోనే కదా
మనం సేద తీరుతాం!
పశు పక్ష్యాదులకూ..
ఆశ్రయమిచ్చేదీ అదే కదా!
పేగుబంధంలాంటిది..
మనిషికీ చెట్టుకున్న అనుబంధం!
ప్రాణవాయువుతో
ప్రాణం పోసేది చెట్టే!
విసనకర్రకైనా.. బండి చక్రానికైనా
అదే ఆయువుపట్టు!
పిల్లన గ్రోవికి ఆలంబనై..
కుర్చీకి ఆసరై..
ముసలితనంలో ఊత కర్రై...
మరణిస్తే పాడై...
మనకు చివరికి చితిలో దోస్తీ చేసేదీ అదే!
అందుకే
మొక్కలు విరివిగా నాటుదాం..
ఎంచక్కా.. నాటిన ప్రతి మొక్కను
కాపాడుకుందాం!

- డాక్టర్ అడువాల సుజాత, కరీంనగర్, సెల్.నం.9989558678
***

మానవత్వమే..

హన్మయమైనా
మణిమయమైనా
పాత్రను వాడేది దాహార్తికే సుమా!
మృష్టాన్నమైనా
చిప్పకూడైనా
గంజి నీళ్లయినా
మనకు క్షుద్బాధను తీర్చేవే కదా!
ఇక తేడాలకు తావెక్కడ?
మిద్దెలు వున్నా..మేడలువున్నా..
పూరి గుడిసెలో వున్నా..
మానవత్వమే మనిషికి..
కావాలి ఆభరణం
అప్పుడే కదా..
ఆనందమయ జీవనానికి..
మార్గం సుగమమం!

- చెన్నమనేని ప్రేమసాగర్ రావు
కరీంనగర్
సెల్.నం.9912118554
**

తొలకరి జల్లులతో..

గగనంలోని మేఘాలు
హద్దులు లేని ఆకాశం చుట్టూ
తిరిగి తిరిగి.. అలసి సొలసి
కాస్తంతా సేదతీరుతున్నాయో ఏమో..
అంతమాత్రానికే..
అవనీ తలమంతా బోసిపోయింది!
ఎటు చూసినా..
బావులు, చెరువులు ఎండి
ఎద తడారి ఎదురుచూస్తున్న
విగత జీవులైనాయి
వసంతంలో కూడా
వన కన్య ప్రియుని కోసం
నిరీక్షిస్తున్నట్లుగా..
లతలన్నీ తలలు వంచుకుని
విరహతాపాన్ని ఆపుకోలేక..
నిలువెత్తు నిత్యయవ్వన రూపాన్ని
తొలకరి జల్లులతో..
జత కట్టాలని
తహ తహలాడుతున్నాయి!
ఇకనైనా కరుణించుమా అని..
మేఘాలతో..
వినమ్రంగా విన్నవించుకుంటున్నాయి!

- గంప ఉమాపతి
కరీంనగర్
సెల్.నం.9847467551
***

జెండా.. ఎజెండా!

జెండా అంటే.. కాదు
రంగులకో, బొమ్మలకో పరిమితమైన
మూడు మూరల గుడ్డ!
అది ఓ స్పూర్తి!
అమలు చేయగలిగే సామాజిక ఎజెండా!
సమకాలీన సామ్యవాదానికి అండ!
ఎగుర వేసే జెండా కన్నా
ముఖ్యం.. ఎలుగెత్తి చాటే ఎజెండా!
సన్యాసిలా కూర్చుని జపం చేసేవాడికి
వరాలు కురిపించేది కాదు ఎజెండా!
కులమతాల పునాదుల పటిష్టానికి..
కాదు ప్రతీక!
అది ఓ సామాజిక చైతన్య వాహిక!
అవసరమే..
జ్ఞానార్జనకై పేద విద్య!
ఉపాధికై ప్రపంచ విద్య!
పిడికెడు అక్షరాలకు అధిపతి అయితే
చిటికెడు విభూతికి బానిస కావాలా?
కావాలి.. కులాల గీతలను తుడిచేసే
మత వ్ఢ్యౌల కుడ్యాలను కూలదోసే
సంస్కర్త! నవసమాజ నిర్మాత!

- ఆచార్య కడారు వీరారెడ్డి, సెల్.నం.7893366363
**

బంగారు తెలంగాణ!

ఆరు దశాబ్దాల కల నెరవేరింది!
కత్తుల వంతెనపై నడిచిన కాళ్లు..
ఇప్పుడే సేద తీరుతున్నాయి!
అమరుల..
బలిదానాల పునాదులపై
కొత్త రాష్ట్రం కొలువుదీరింది!
ఉద్యమ నేపథ్యంలో..
నేతలు జనులకు ఒసిగిన
బాసలన్నీ..
నెరవేర్చే సమయమొచ్చింది!
బంగారు తెలంగాణ కోసం..
బాటలు వేసే తరుణమొచ్చింది!
ఇకనైనా..
పాలకులు తమ వాగ్దానాలు
నీటిపై రాసిన రాతలవ్వకుండా..
చిత్తశుద్ధిని ప్రదర్శించాలి!
ప్రజలు కన్న కలలను..
సాకారం చేయాలి!

- దరిపెల్లి స్వరూప లక్ష్మణ్
మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లా
సెల్.నం.9912965549
**

పచ్చల హారం

పర్యావరణ సమతుల్యాన్ని
కాపాడుకుందామని
జీవరాశుల మనుగడకు
దోహదపడదామని
ధ్వంసమైన అటవీసంపదను
మళ్లీ సాధిద్దామని
ప్రాణవాయువునిచ్చే తరువులకు
ప్రాణం పోద్దామని
మనమంతా దండులా కదులుదాం!
ఊరూ వాడా మొక్కల పండుగ
జరుపుకుంటూ పుడమికి
పచ్చతోరణం కడదాం!
ఆకుపచ్చని ఆవరణ
అడుగడుగున కనిపించేలా
నాటిన ప్రతి మొక్కని
బతికించుకుందామని
ప్రతినబూనుదాం !

- నూజెట్టి రవీంద్రనాథ్
జగిత్యాల
సెల్.నం.9948748982
**

భరోసా!
ఓ ఉషోదయాన
మగత నిద్రను వీడి కల్లు తెరిచా!
నా చూపులు నిశ్శబ్దంగా
ప్రకృతి వైపు పరుగులు తీశాయి!
తొలకరి జల్లులు పుడమి తల్లిని పులకరిస్తుంటే...
హరితహార సొబగులు
నన్ను పరవశింపజేశాయి!
నా హృదయం పువ్వయి..
గువ్వలా ఎగరసాగింది!
అద్భుత దృశ్యాలు
ఇంద్రనీల శోభితంగా..
కనువిందు చేశాయి!
హరిత కాంతులతో..
తెలంగాణ మాగాణమంతా
ప్రకాశ మానమవుతుందన్న
ఓ చిన్ని ఆశ
నా హృదిలో మొగ్గతొడిగింది!
ఇక వర్షాలకు కొదువుండక..
రైతుల మోముల్లో వెలుగులు
చూస్తామన్న భరోసా కలిగింది!

- మహ్మద్ నసీరోద్దీన్, కరీంనగర్, సెల్.నం.9440237804
**

సురవాణీ విలాసం

అమృతం త్రాగినవాళ్లే
ఆ భాషలో మాట్లాడుతారు
ఆ భాష పుట్టింది దివిలో
అంతటా వ్యాపించింది భువిలో
కొందరు మూర్ఖులు
అమృతాన్ని చూసి మృతమంటారు
అది వారి అజ్ఞానానికి సంకేతం
వేదనాదాలను భువికి దింపిన భాష
శాస్తశ్రోధనలను ఆరంభించిన భాష
జ్ఞాన బోధనలతో పల్లవించిన భాష
ఇతిహాస రహస్యాలను
ఎరుక జెప్పిన భాష
కమనీయ కావ్యాలను
రమణీయ రత్నాలుగా
అరచేతికి అందించిన భాష
పలుకు సంస్కారాలను
పదిలపరచిన భాష
భరత మాతృ హృదయ భూష
జీవద్భాహ గీర్వాణభాష
నా మాతృ భాష నా పితృభాష
నా రాష్ట్ర భాష నా దేశభాష
నా అంతరంగ భాష
అమర భాష!

- డా. అయాచితం నటేశ్వర శర్మ
కామారెడ్డి
సెల్.నం.9440468557
**

హెల్మెట్

నేస్తం.. లాభాల మాటెలా ఉన్నా
క్షేమంగా ఇంటికి తిరిగివస్తే చాలు
కీడెంచి మేలెంచాలంటూ
బయటికెళ్లినప్పుడల్లా
తోడు నీడలా నిన్ను అనుసరిస్తూ
భద్రతను గుర్తు చేస్తున్న నన్ను
మరిచావా..లేక
కావాలని ఎందుకులే అని వదలివెళ్లావా
ఏది ఏమైతేనేం
ఇది ఇలా జరిగి ఉండేది కాదేమో
విధిని నిందించుకుంటూ
నీ విధిని విస్మరించిన ఫలితం చూస్తున్నావుగా...
నేరం ఒకరిదైతే
శిక్ష మరొకరికా అంటూ
రక్తసిక్తమైన ప్రదేశం
ముక్త కంఠంతో ఘోషిస్తున్నది
గాయాల పాలైన కాయం
కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ
సాయం చేసే వారికోసం వెదకుతూ
సాక్షిభూతంగా నివ్వెరపోయి చూస్తున్నది
అనుబంధాల కోసం ఆరాటపడుతూ
నరక యాతనతో
మనసు అతలాకుతలమై పోతున్నది
ఆ ప్రాధాన్యత నెంతగా కోల్పోయావో
కష్టాల్ని నష్టాల్ని చవిచూస్తూ
పశ్ఛాత్తాపంతో పరితపిస్తున్న
నిన్ను చూస్తుంటే అవగతవౌతున్నది
సదా నీ సౌఖ్యం కోరుకుంటూ
సఖ్యం చేసిన దానను
సత్వరమే నీకు స్వస్థత చేకూరాలని
సర్వేశ్వరున్ని వేడుకోవడం మినహా
నేనేమీ చేయలేని పరిస్థితి..!!

- రాకుమార, గోదావరిఖని
సెల్.నం.9550184758
**