దక్షిన తెలంగాణ

కథా ప్రక్రియే నాకు ప్రాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐతా చంద్రయ్య
4-4-11, శేర్‌పురా
సిద్ధిపేట, మెదక్ జిల్లా - 502103
సెల్.నం.9391205299
**
‘వివిధ ప్రక్రియల్లో సాహిత్య సృజన చేసినప్పటికీ కథా ప్రక్రియంటే తనకు ప్రాణం’ అంటున్నారు ప్రముఖ సాహితీవేత్త, కథకుడు ఐతా చంద్రయ్య.. ఏడు వందల కథలకుపైగా రాసిన అనుభవమున్న ఐతా చంద్రయ్య మెదక్ జిల్లా సిద్ధిపేట నివాసి.. వివిధ ప్రక్రియల్లో తొంభైకి పైగా గ్రంథాలను వెలువరించారు. వాటిలో 18 కథా సంపుటాలు.. 15 కవితా సంపుటాలు, 9 నవలలున్నాయి! రంగస్థల నాటికలు, రేడియో నాటికలు, బాల సాహిత్య గ్రంథాలు, అనువాదాలు ఇతరాలు కలిసి తొంభైకి పైగా గ్రంథాలను ప్రకటించి బహుగ్రంథకర్తగా భాసిల్లుతున్నారు.. ఏడు పదుల వయసు దాటినా రచనా వ్యాసాంగాన్ని నిరంతరం కొనసాగిస్తున్న ఆయనకు అనేక ప్రతిష్ఠాత్మక పురస్కారాలు లభించాయి. కథల పోటీల్లో అనేక బహుమతులు గెలుపొందారు. ఆయన సాహిత్యంపై ఉస్మానియా, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాల్లో కథలపై, కాకతీయ విశ్వవిద్యాలయంలో నవలలపై పరిశోధనలు జరిగాయి! కథాశిల్పి, కథాకళానిధి, కవిశేఖర బిరుదులతో సత్కరింపబడిన ఆయనతో ‘మెరుపు’ ముచ్చటించి అంతరంగాన్ని ఆవిష్కరింపయత్నించింది.. ముఖాముఖి వివరాలు ‘మెరుపు’ పాఠకుల కోసం...
ఆ మీరు రచనా వ్యాసాంగాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
నేను ఐదో తరగతి చదువుతున్నప్పుడు మా స్కౌట్ మాస్టారు పి.వి.బ్రహ్మయ్య గారి ఆదేశంతో ఓ గేయం రాశాను.. స్కౌట్‌పై రాసిన గేయం నా మొదటి రచన అప్పటి స్కౌట్ మేగజైన్‌లో అచ్చయింది.
ఆ వివిధ ప్రక్రియల్లో సాహిత్య సృజన చేసిన మీకు ఏ ప్రక్రియ అంటే ఇష్టం?
నాకు అత్యంత ప్రియమైనది కథా ప్రక్రియ.. అందుకే 700 పైగా కథలు రాశాను.
ఆ ప్రస్తుతం వెలువడుతున్న తెలంగాణ కథలపై మీ అభిప్రాయం?
ప్రస్తుత కాలంలో తెలంగాణ నుండి కథలు చాలానే వస్తున్నాయి.. తెలంగాణ మాండలికంలోనూ వస్తున్నాయి.. అయితే రాశి ఉన్నంతగా వాసి ఉండటం లేదు.. కొందరు కథల పేరుతో గల్పికలు రాస్తున్నారు.. కథలో దృశ్య వర్ణనతో పాటు ‘కథ’ ఉండాలన్నది మనవాళ్లు గుర్తించాల్సి ఉంది!
ఆ తెలంగాణ కథకులు చాలామంది వెలుగులోకి రాకపోవడానికి కారణమేమంటారు?
తెలంగాణ కథా రచయితల మాగాణమే.. పత్రికల వివక్ష.. తదితర కారణాల వల్ల వెలుగులోకి రాలేకపోయారు. అంతేగాక.. ఒక్కొక్కరు తమ భావజాలం, సిద్ధాంతాల కట్టడిలో కూరుకుపోయి ఇతర వర్గాల రచయితలను ప్రోత్సహించడం లేదు.. సాహిత్యంలో వర్గ దృక్పథం పోవాలి. అప్పుడే అందరూ సమంగా గుర్తింపబడతారు.
ఆ మీపై ప్రభావం చూపిన గ్రంథమేది?
‘శివభారతం’ నాపై ప్రభావం చూపింది. అది పద్య కావ్యమైనా.. కథా గమనం హృద్యంగా సాగింది.
ఆ సాహితీ పురస్కారాలపై మీ అభిప్రాయం?
కవులు, రచయితలకు పురస్కారాలిచ్చి ప్రోత్సహించడం అవసరమే.. కానీ పురస్కార ఎంపికల్లో పారదర్శకత, ప్రామాణికత లోపిస్తోంది.. సాహితీ రంగంలోని వివిధ వర్గాల కారణంగా.. కమిటీలో కొలువుదీరిన సభ్యులు తమ వర్గం వారికే పురస్కారాలు ప్రకటిస్తున్నారన్న అపవాదు పోవాలి. అలాగే కవులు, రచయితలు పురస్కారాల కోసం వెంపర్లాడకుండా పాఠకుల హృదయాలను దోచుకునేలా తమ రచనలో ప్రతిభను కనబరుస్తూ ముందుకు సాగాలి.. పురస్కారాలు కవులు, రచయితల బాధ్యతను మరింత పెంచేలా ఉండాలి.
ఆ ఆధునిక కవులు, రచయితలకు మీరిచ్చే సలహాలు, సూచనలు ఏమిటి?
అధ్యయనం పట్ల శ్రద్ధ చూపాలి.. రచనల్లో కనీస ప్రమాణాలు ఉండేలా జాగ్రత్త పడాలి.. కవితకు, వచనానికి తేడా ఉన్నప్పుడే.. రచన అందరిని ఆకట్టుకుంటుందని గ్రహించాలి.

ఇంటర్వ్యూ : - దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544

chitram.. ఐతా చంద్రయ్య
***

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net