దక్షిన తెలంగాణ

చీకటి సూర్యుడు (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓడిపోయిన మనసు
వెక్కి వెక్కి ఏడుస్తున్నపుడు
ఆకాశం నిశ్వబ్ధంగా వుంది
ఆరిపోయిన దీపం
చీకటిని కౌగిలించుకున్నప్పుడు
చందమామ తన కంట తడి చూడకుండా
కనులు మూసుకుంది
దుర్మార్గము దౌర్జన్యము
గూండాగిరి చట్టబద్ధ రౌడీగిరీ
ఏదో ఒకటి
దోపిడి వలయం గుండె మీద విస్తరించింది
చల్లారిన బ్రతుకులు.. తెల్లారని చీకట్లు
ఎక్కడో ఆరిపోయింది మనసు
ఇక్కడే రాలిపోయింది తనువు!
ఓడిపోతున్న గీతం
వేడివేడిగా కసికసిగా
ధిక్కార స్వరాన్ని పెంచినపుడు
చీకట్లు వణుకుతున్న దృశ్యం
ఒక సంతృప్తియే కానీ
ఉద్యమ సూర్యుడు
ఉదయిస్తున్నట్టు లేదు
అస్తమించటమే చూస్తున్నా!

- సిహెచ్.మధు
నిజామాబాద్, సెల్.నం. 9949486122
**
మంచి మనసు!

మంచి మనసుతోనే...
మంచి నడవడి అలవడుతుంది!
అందరి మన్ననలు..
పొందేందుకు అదే ఆలంబనమవుతుంది!
మంచి మనసుంటేనే..
మన లక్ష్యం నెరవేరుతుంది!
ఆటంకాలను అధిగమించడానికీ..
ఆత్మవిశ్వాసాన్ని నింపేది మనస్సే!
చెడు సోకనంత వరకు..
మనసుతో అన్ని విజయాలే సాధిస్తాం!
ప్రయోజకునిగా..
సమాజంలో మసలుకుంటాం!
- కె.మధుసూదన్
హనుమకొండ
సెల్.నం.8374084396
**

జీవనగమనంలో..

ఓ నవతరమా!
నడుమంత్రపు నవయవ్వన వయసులో
ఆకర్షణ సుడిగుండాలలో
చిక్కుకున్న యువతరమా!?
పాశ్ఛాత్యపు విషకోరలలో
బందీయైన నా యువతా..
భారతీయపు విలువలలో
బంగారు భవితవ్యం నీకుంది సాధించు
వేకువ సూర్యోదయానికి ఆటంకాలు లేనపుడు
ప్రవహించే సెలయేటికి అడ్డంకులు రానపుడు
వృక్షంగా విచ్చుకునే విత్తుకి అవరోధం కల్గినపుడు
శక్తియుక్తులున్న ఓ ధీరయువతా!
నీ జీవనగమనంలో ముందు ముందుకు నడువు!
ఆటంకాలు ఎదురైనా ఆగకుండ సాగవోయి!
- సామల కిరణ్,
జూలపల్లి, కరీంనగర్ జిల్లా
సెల్.నం.9949394688
**
నిరీక్షణ

బీడుపడిన నేలపై
మోడువారిన తరులు
రెండూ చూసిన నా గుండెలో
చెప్పరాని గుబులు! ఇంకేముంది!
నా మనసంతా చిందరవందర
మళ్లీ చిగురించేదెప్పుడా అని?
తలెత్తి చూశాను ఆకాశం వంక!
ఇకనైనా.. జాతర చేయరాదటే
ఓ జడివాన!
మా జాడ మరిచిపోకు సుమా!
మబ్బులు గూడును వదిలి
మా హృదిపై కురిపించవే
ఓ చిరుజల్లుల వెనె్నలవాన!
నీ తోడు లేక.. గిరులు, తరులు
ప్రియుడు లేని ప్రయుని వోలే
మూగనోముతో
ముగ్ధమనోహరిగా ముడుచుకుంది!
నీ రాకతో మళ్లీ వికసించేనులే!
ఈ చేనూ చెలకలు!
ఓ గడసరి వాన రారాదటే!!
- గంప ఉమాపతి
కరీంనగర్, సెల్. 9849467551
**

వసంత గీతం !

నీ స్నేహగీతం ఆలపించి
నవ వసంతం కురిపించి
అనురాగంతో పలకరించి
అమృత జల్లులు వర్షించి
తారకలలో కనిపించి
నీ జ్ఞాపకాల మానస సమీరాలలో
విహరించి..
నీ మైత్రి మాధుర్యాన్ని ఒలికించి
మమతానురాగాలతో మైమరిపించి
వసంత గీతంతో
నన్ను అలరించి..
నా హృదిలో పదిలంగా
చోటు సంపాదించావు!
ఎలా మరువగలను?
నీ సహచర్యంలోని మధురిమలను!
- బొమ్మకంటి కిషన్
కరీంనగర్
సెల్.నం.9494680785
**

దేశం కోసం!

ప్రతి యువకుడు కావాలి ఓ సైనికుడు
మంచితనంతో ముందుకు సాగాలి
దేశ ప్రతిష్టలు నిలబెట్టాలి
అన్యాయాన్ని ధైర్యంగా ఎదిరించాలి
ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి!
రాజ్యాలు మారినా..
రాజకీయాలు మారినా..
ఆలోచన దేశభక్తితో నిండాలి
ప్రతి పనికి ఒక పద్ధతి పాటించాలి
సమాజంలో అన్యాయాలు-
అరాచకాలు ఎన్నో ఉన్నా
వౌనంగా ఉండవద్దు!
జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా
లక్ష్యం దిశగానే అడుగులు వేయాలి
మానవత్వాన్ని నింపుకుని
దేశగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేయాలి
- ఎం.డి.ఖాలిద్
కరీంనగర్
సెల్.నం.9618175421
**

కవితామృతమై..

ఎక్కడో ఎదలోయల్లో
తేట తేట నీటి ఊటలా
అక్షరాల నీటి బిందువులు
కదిలి కదిలి
సెలయేరులా ప్రవహించి
కలంలోకి కవితామృతమై..
ప్రవేశించి
కాగితంపై పదాల పాదాలు
నర్తనం చేస్తూ.. కనువిందు చేస్తున్నాయి!
మనసులోని మధుర భావాలను
అందంగా చిత్రిస్తూ...
నవరసాలు ఒలికిస్తున్నాయి
నా సాహితీ క్షేత్రంలో!!

- రంగు గోవర్ధన్, కరీంనగర్
సెల్.నం.9849497679
**

ప్రేమంటే..!

ప్రేమంటే.. ప్రాణితనం
నలుపులోని తెలుపుదనం
నిప్పులోని చల్లదనం
ద్రవీభవించని ఆవిరితనం
ఘనీభవించని నవనీతం
అదుమలేని వెలుతురు
ఆర్పలేని జ్వాల
ప్రకృతి ప్రసవించిన పరవశం
మనోజ్ఞ వీణాతంత్రి నాదం!
చీకటి స్రవించిన చందనం
వెలుతురును పెనవేసుకున్న
ఆశాకిరణం
హృదయస్పందనల అమరతరంగం
పాలలోని తేట తెలుపుదనం
పువ్వులోని మకరందం
నవ్వులోని నవజాతం
మానవతా స్వచ్ఛత
పురుషత్వంలోని పుంగవం
స్ర్తిత్వంలోని మాతృత్వం
మాతృత్వంలోని మమత
విత్తనంలోని మొలకతత్వం
కాయలోని పండుదనం
ఆకులోని చిగురుదనం
చెట్టులోని అమ్మదనం
కరుకుదనంలో కమ్మదనం
గుజ్జులోని గువ్వం
కాలానికి కళ్లెం
ఒక శాశ్వత నమ్మకం
ఆ రూపం..ఆ శరీరం..అగోచరం
అపాత్రం.. ధ్రువాతీతం
ఆత్మల అనుసంధానం
ఎంత ఇచ్చినా తరుగనిది
పుచ్చుకున్నా సరిపోనిది
ప్రేమ..సత్యం
అనిర్వచనీయ విశ్వరూపం!
అనంతం!!
- ఆచార్య కడారు వీరారెడ్డి
హైదరాబాద్
సెల్.నం.7893366363
**

నీ ప్రేమ కోసం

మన వంశానికి పెద్దలు..
అనుభవాలకి ప్రతీకలు
ఆచరించుటకు ఆదర్శనీయులు
అనుకరించుటకు మార్గదర్శకులు
హుందాతనానికి హేతువులు
హితములు చెప్పుటకు గురువులు
ముందుతరానికి బాల శిక్షకులు
ప్రేమని పంచుటకు అనురాగమూర్తులు
లౌకికానికి గుంభనానికి పెట్టింది పేరు
గృహానికి సింహస్వప్నమై...
మెలగాల్సిన వారు
ఈనాడు.. రెక్కలు విరిగిన పక్షులై
ఆదరణ అందని శాపగ్రస్తులై రోగగ్రస్థులై
చీదరింపులు ఛీత్కారాలతో
ఇంట్లో మూలనున్న గదిలా
అవమానాలెదుర్కుంటూ
చావు బతుకుల మధ్య
ఊగిసలాడుతూ
బ్రతుకీడుస్తున్నారు!
కొంతమంది..
ఎంతమంది ఉన్నా
ఏ తోడు లేని అనాధలుగా మిగిలి
నిస్సహాయులై ప్రేమకోసం పరితపిస్తున్నారు
ఇకొంత మంది
ఆశ్రమాలకి నెట్టబడి
నెలకొకసారైనా
తమ వారొచ్చి పలకరిస్తారని ఆశగా..
కళ్లల్లో వత్తులు వేసుకొని
ఎదురు చూస్తున్నారు!
మరికొందరు
రోడ్లమీద ఫుట్‌పాత్‌ల మీద
వదిలి వేయబడి
తాము ఎక్కడున్నామో తెలియని
అయోమయంలో ప్రాణాలు కోల్పోతున్నారు!
నీవు అడగకుండానే..
నీకు జన్మనిచ్చి..ప్రేమని పంచి
నీ ఆశలకు జీవం పోయుటకై
తమ ఆశలకు నీళ్లొదులు కొన్నవారు
నీ ప్రేమకోసం పాకులాడుతూ..
గుండె పగిలి
ఎముకల గూడులా మిగిలి
ఓ జీవశ్ఛవంలా..కాటికి కాళ్లు చాచి..
తమ మృత్యువుకై ఎదురుచూసే
నిస్సహాయులు..

- పోపూరి మాధవీలత
హైదరాబాద్, సెల్.నం.8125115667
**

ఆశ

మనిషి ఒంటరితనానికి గురైనపుడు
కృంగి కృశించి పోతాడు..
ఏదీ తెలియని భ్రమల్లోకి
వెళ్లిపోతాడు..
ఒక అచేతనావస్థలోకి వెళతాడు!
అప్పుడే అక్కడ..
ఒక అద్భుత ఆలోచన పుట్టొచ్చు..
‘గత స్మృతుల’ లోతుల్లోంచి
తొంగి చూస్తే..
భవిష్యత్తంతా ‘ఆనందం’గా
జీవించొచ్చనే ‘ఆశ’ మొలకెత్తొచ్చు!
అది ‘మహా వృక్షంగా’ మారి
ఎన్నో హృదయాలకు ‘నీడ’నిస్తూ
సాంత్వనను ప్రసాదించవచ్చు!
- గుండు రమణయ్య
పెద్దాపూర్, జూలపల్లి
సెల్.నం.9440642809
**

వింత మాలోకం!

మనిషి బ్రతికుండగా
పచ్చి నీరు పోయలేని వారు
మరణించేటప్పుడు మాత్రం
పరుగు పరుగున వచ్చి పాలు పోస్తారు
ఎన్నడు లేని ప్రేమను వొలకబోస్తారు
గత జ్ఞాపకాలన్నీ నెమరేస్తూ
కన్నీరు మున్నీరుగా ఏడుస్తారు!
బంధాలన్నీ తెగిపోయాక
బోలెడు ఖర్చు చేస్తారు
మంచాన పడినప్పుడు
ముక్కు మూసుకుని
మూలుగుతూ చీదరిస్తారు
ఎప్పుడు చస్తాడని
ఎదురుచూస్తారు!
ఎంత ఆశ్చర్యం!
ఏమిటీ ఈ వింత మాలోకం!
- జాదవ్ పుండలిక్ రావు పాటిల్
భైంసా, ఆదిలాబాద్ జిల్లా
సెల్.నం.9441333315
**

జ్ఞానగంగా ప్రవాహం

ప్రతి నిత్యం ఇంటిలో
పేరుకొనిపోయే చెత్తవలె
అనుక్షణం మనస్సులో
కల్మషాలు పేరుకొంటూనే ఉంటాయి
అనునిత్యం వాటిని కడిగివేయాలి
జ్ఞానగంగా జలాలతో!
శివుడనే గురువును ఆశ్రయించనిదే
శిష్యుడైన భగీరథునికి
గంగాజలం లభించదు!
ప్రతి మనిషీ ఒక భగీరథుడు కావాలి
తరతరాలకూ తరగని
జ్ఞానవాహినులను భువికి తేవాలి
కరడుగట్టిన కల్మషాలన్నీ పోవాలి!

- డా. అయాచితం నటేశ్వర శర్మ
కామారెడ్డి
సెల్.నం.9440468557