నెల్లూరు

హమ్మయ్యా.. నేనొచ్చేశాను ఇంటికి! (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినతి చేస్తుందే గాని
వీరోచిత పోరాటాలు చెయ్యదు
ఇబ్బందులెన్నైనా భరిస్తుంది గాని
విద్యుక్త్ధర్మాన్ని వీడదు...
ఇంటి పోషణ భారాన్ని
భుజాలపై మోస్తూ
కాలాన్ని గడుపుతున్న
ఓ... ఇల్లాలు ఆమె!
పట్నంలో విధులు
రోజూ ప్రయాణం..
రెండు మైళ్ల దూరమైనా
నరక లోగిళ్లు దాటుతున్నట్లు
కలవరపడని రోజు లేదు!
ఇల్లు వదిలి
రోడ్డుపై అడుగిడగానే
మొదలవుతాయి అవస్థలు..
కల్తీ ఆయిల్స్‌తో
దట్టమైన పొగలు వెదజల్లుతూ
భరించలేని రొదలు చేస్తూ
దూసుకెళుతున్న వాహనాల్ని చూసి
ముక్కు, చెవులు మూయాల్సిందే!
వాహనాల్ని పరిశీలిస్తూ
నేలచూపులు మరిస్తే
పాతాళానికి పల్టీకొడతారు
పొంచి వున్న
మూతలు లేని మ్యాన్‌హోల్స్‌తో!
అంతేకాదు
హఠాత్తుగా వాహనాల్లో
దూసుకొచ్చి
సూదులు గుచ్చే సైకోలు..
చైన్లు లాగే దొంగలు
ఎక్కడ దాడి చేస్తారోనని
మనసంతా కలవరం..
ఇంకా..
ఏ ఉగ్రతండాలు
విరుచుకుపడుతాయోనని
ఏ ఆత్మాహుతి బాంబర్లు
బరి తెగిస్తారోనని
ఎలాంటి రక్తపాతాల్ని
కళ్లచూడాల్సి వస్తుందోనని
అణువణువు భయం.. భయం..
ఎలాగో బస్సుస్ట్ఫాలో బస్సెక్కినా..
పొగరాయుళ్ల పొగలు
మందుబాబుల చిందులు
కొరకొర చూపులు
వెటకారపు మాటలు
ఎదురవ్వకుండా ఉండవు
విసుగు తెప్పించక మానవు..!
ఇంకా.. ఇంకా..
రేపిస్టుల కళ్లబడకుండా
కిడ్నాపర్ల చేత చిక్కకుండా
పని ముగించుకుని ఇంటికి వచ్చేస్తే
అది ఒక గొప్ప?
అంతేకాదు అది ఒక అదృష్టం కూడా!
అర్ధరాత్రి కాదు
పట్టపగలు.. ఒంటరిగా
కొంత సమయం బయటికెళ్లి వచ్చి
హమ్మయ్య నేనొచ్చేశానింటికి అని
ఆనందాలు పంచుకునే ఆమె..
సగటు స్ర్తి ఆవేదనకి ప్రతీకగా
అభద్రతభావాన్ని ప్రశ్నిస్తోంది..!
- కొండూరు వెంకటేశ్వరరాజు
చరవాణి : 9492311048

స్నేహబంధం

వయసున ఉదయించిన ప్రేమను
ఒడిలో లాలించిన తల్లికి చెప్పలేను
బ్రతుకులోని తలవంపులను
భార్యతో ఎన్నడూ పంచుకోలేను
తలకు మించిన ఋణభారాన్ని
తనయులతోడ ముచ్చటించలేను
రెండు కొప్పుల మధ్య రణరంగాన్ని
తోడబుట్టిన వాడికి వివరించలేను
అన్ని బాధలను అలవోకగా నీకు
విడమరచి విశదీకరించగలను
దహించుకుపోతున్న
అంతరంగానికి
నీ మాటలు ఓదార్పుల చిరుజల్లులు
మోయలేని ఆర్థిక బాధలకు
అణువంత సాయపడే
సాధనానివి నువ్వు
ఋణానుబంధం మన మధ్య లేకున్నా
లోకంతో నా ఋణం తీరేవరకు
వెన్నంటి తిరిగే ఛాయ నువ్వు
కులమత భేదాల కార్చిచ్చు
మన మధ్యలేదు
జాత్యంతర వివక్ష మన దరికి రాదు
రక్తసంబంధం ఏ మాత్రం లేని
అనురక్తబంధం మనది
స్వార్థ సంకుచితాలకు తావివ్వని
నిస్వార్థ స్నేహబంధం మనది..!
- శింగరాజు శ్రీనివాసరావు
చరవాణి : 9052048706
**
కనురెప్పలు

తొలిసంధ్య నుండి
మలిసంధ్య వరకు
అలసి సొలసిన మనసుకు
కనురెప్పలు చేయూతనివ్వాలి!
కనుపాపలో గుండెను చిదిమే
కల్లోల దృశ్యాల నృత్యవిన్యాసాలు
కకావికలం చేస్తున్నప్పుడు
కళ్లకు సఖ్యతయేది?
గుండె గాయాలు
పునరావృతవౌతున్నప్పుడు
కళ్లెలా నిశ్చితంగా వుండగలవు?
కళ్లకు కునుకు దూరమయినప్పుడు
మనసుకు శాంతిలేదు కదా!
మనసు హృదయాలకు
శాంతికరువైనప్పుడు
మనిషెలా నెమ్మదించగలడు?
మనిషికి శాంతి కరువైనప్పుడు
కనురెప్పలెలా కలుసుకుంటాయి!
తీయని కలలకు స్వాగతమెలా
చెబుతాయి!
తీయని అనుభూతులకు
తావెక్కడుంది!
మనసు స్వచ్ఛమైన మేఘంలా
మారితేనే తప్ప
మనిషికి శాంతి వుండదు
కళ్లు నిండుగా నిద్రించవు!

- గుర్రాల రమణయ్య
చరవాణి : 9963921943