విశాఖపట్నం

ఉద్యోగం! (మినీకథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నగరంలోని అతిపెద్ద కంపెనీలో సూపర్‌వైజర్ పోస్టుకిగాను నిర్వహించిన పరీక్షలో మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి ఇంటర్వ్యూ కోసం బయలుదేరాడు దివాకర్. బస్టాండు దగ్గరవుతుండగా కారొకటి స్పీడుగా వచ్చి దివాకర్ పక్క నుండి వెళ్లింది. రోడ్డు మీద బురద నీరు బురద నీరు దివాకర్ షర్టు మీద పడింది.
అది చూసి కారాపి అందులో ఉన్న వ్యక్తి కిందకి దిగి ‘‘క్షమించండి చూసుకోలేదు’’ అన్నాడు.
‘‘క్షమించండి అంటే సరిపోతుందా? రోడ్డు మీద నడుస్తున్న వాళ్లని కూడా చూడాలన్న జ్ఞానం కూడా లేదా మీకు?’’ అంటూ గట్టిగా అడిగి షర్టుకి అంటుకున్న బురదని తుడుచుకుంటూ వెళ్లిపోయాడు దివాకర్ ఇంటర్వ్యూకి టైం అవుతుండడంతో.
ఇంటర్వ్యూ జరుగుతున్న రూము లోపలికి వెళ్లి చూడగానే ఆశ్చర్యపోయాడు దివాకర్. ఆ ఉద్యోగం ఇక తనకి రాదని తీర్మానించుకుని వెనక్కి తిరిగాడు దివాకర్.
ఇంతలో ‘‘మిస్టర్ దివాకర్ ఇలా రండి. యు ఆర్ అపాయింటెడ్’’ అని ఇంటర్వ్యూ అధికారి అనగానే ఆశ్చర్యంతో చూడడం దివాకర్ వంతయింది. మళ్లీ ఇంటర్వ్యూ అధికారి దివాకర్‌ని చూస్తూ ‘‘ ఈ ఉద్యోగానికి నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా ఉండడంతో పాటు నిజాయితీగా కూడా ఉండాలి. అవి నీ దగ్గర ఉన్నాయన్నది ఇందాక నేను కారులో వస్తున్నప్పుడే చూసాను’’ అని ఆయన అనగానే నోట మాట రాక ఆనందంతో నిలబడిపోయాడు దివాకర్.
***

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

- వసంతకుమార్ సూరిశెట్టి, నెల్లిమర్ల-535217. విజయనగరం జిల్లా. సెల్ : 8297191810.