రాజమండ్రి

తలచుకొని తరిస్తాం (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేల కొద్ది మార్లు జోకొట్టి
వేన వేల సార్లు జోల పాడిన
అమ్మ గురించి
ఒక మాట
అమ్మకోసం
జాలి పాట పాడం

గోరుముద్దలు తినిపించి
గోముతనం చూపించి
గారాం చేసిన
అమ్మ గురించి
గొప్పమాట
అది తప్ప
ఏమి చెప్పం

గుక్కపట్టి ఏడ్చినపుడు
గుండెకు హత్తుకొని
పాలిచ్చి ఓదార్చింది అమ్మ
ఆమె ఔదార్యం గురించి తప్ప
అది మానేసి మరేం చెప్పం

ఆకలి తీర్చింది అమ్మ
ఆనందం చేసింది అమ్మ
మాటలు పేర్చని మమతలు చూపి
మాధుర్యపు రుచులు తినిపించి
అనురాగపు అర్ధాల్ని చెప్పి
అనుబంధాల ఆత్మీయతకు
అపురూపాల నెలవయింది అమ్మ
అలాంటి అమ్మను వదిలేసి
మరేం చెప్పం

అమ్మ గురించి దిగులు ఆవహిస్తేనే
ఆమె జ్ఞాపకం ఒక మధుర స్వప్నం

అమ్మను తలచి విలపించం
ఆమెను తలచుకొని తరిస్తాం
అమ్మ ఒక మధుర జ్ఞాపకం

మాలో ఉన్న అమ్మ
మాతో ఉండిన అమ్మ
మా దగ్గర లేదని ఎలా చెప్పం

అమ్మ మాలో ఉంది
అమ్మ మాతో ఉంటుంది
అమ్మ గురించి మరో మాటలేదు
మానవతను ఇచ్చిందే అమ్మ
మహిమ పరచమనే చెప్పింది
అమ్మను మరచి ఇక మరోమాట చెప్పలేం

అందుకే అమ్మకు
దివ్యత్వం సిద్ధించింది
అమ్మను దైవత్వం వరించింది

- అనంత్
సెల్: 8985959638
**

మనిషే! కాని...
దండలు వేస్తాడు!
దండాలు పెడతాడు
దీపాలు వెలిగిస్తాడు!
ధూపాలు వేస్తాడు
పూలు పెడతాడు! పూజలు చేస్తాడు
లక్షలకు లక్షలు హుండీలో వేస్తాడు
కోటి కోరికల చిట్టా విప్పుతాడు
అడగని అంతర్యామికి ఆర్భాటం
అడుక్కునే వాడికి మాత్రం రిక్తహస్తం
మానవుడే మాధవుడనిన
ఆ మాధవుని మాటనే నమ్మడేమిటి?
-హైమవతీ సత్య, వేల్పూరు

విజయాలతో అభిషేకిద్దాం
భుజాలపై ఎక్కించుకున్నప్పుడు
భవిష్యత్ శిఖరాలని అధిరోహించడం నేర్పాడు
వేలు పట్టుకు నడిపించినప్పుడు
లక్ష్యి సాధనలో వేలమైళ్లు దాటడమెలాగో చూపాడు
నాన్న జీవితం తెరిచిన పుస్తకం
పిల్లలే ఆయన కలలకి ఆది, అంతం
ఆ ప్రేమాభిమానాలకు అభివందనం చేద్దాం
ఉప్పొంగిపోయే విజయాలతో అభిషేకం చేద్దాం!
- జి.దుర్గాదేవి, బిఎస్సీ సెకండియర్
**
ప్రేమమయం చేద్దాం

నేనెప్పుడూ
యుగాల నించీ
నిన్నూ, ఈ ఆలోచనలనూ
ఆహ్వానిస్తూనే ఉన్నాను
నాకు తెలుసు నువ్వు నాలాలేవని
నాకు తెలుసు నువ్వు నేనుకాదని
బాహ్యంగా మన ఆకారాలు వేరని
అంతర్గతంగా మన వికారాలు వేరని!

నాకు తెలుసు
నువ్వూనేను వేర్వేరు కొమ్మలని
నాకు తెలుసు
నీలో ప్రవహిస్తున్న రక్తం గ్రూపువేరని
అయినా నిన్ను నేను ఆహ్వానించాను
హృదయానికి హత్తుకున్నాను
ఆలోచనలు వేరైనా
మనం మనుషులమే కదా
మన ఆలోచనలేమైనా
మనం పీల్చేగాలి ఒకటే కదా
మనం తాగేనీరు ఒకటే కదా
మనలో వున్న చైతన్యం ఒకటే కదా
అది చూడడం నేర్చుకో
నీలో వున్న అసహనం పోతుంది!
అది హృదయంలో ప్రతిష్ఠించుకో
నీలోవున్న అహంకారం నశిస్తుంది
యుగయుగాలనించి
నేను నీకు ఇదే నేర్పాలని ప్రయత్నం చేస్తున్నా
రా, ఈలోకాన్ని నందనవనం చేద్దాం
రా, ఈవిశ్వాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం
నీలోని నాలోని ప్రేమరంగులని అద్ది
ఈ ప్రకృతికి కొత్త అందాలనిద్దాము
నీలోని నాలోని అసహనాన్ని పెకిలించేసి
ఈ ఆకాశాన్నీ అవనినీ శాశ్వతం చేద్దాము!!
- డాక్టర్ మోపిదేవి విజయగోపాల్, సెల్: 9490679570