దక్షిన తెలంగాణ

హృదయాలను స్పందింపజేసేదే కవిత్వం! (అంతరంగం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గరిశకుర్తి శ్యామల
ఫ్లాట్.నం.101, సాయిచిత్ర అపార్ట్‌మెంట్
రాంనగర్, జడ్‌బి గార్డెన్ దగ్గర
హైదరాబాద్.
సెల్.నం.9490189081
**
కేవలం అక్షరాలు పేర్చడం కవిత్వం కాదనీ.. మనస్సులను కదిలించేది అసలైన కవిత్వమని భావించే శ్యామలగారు కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందినవారు. వృత్తిరీత్యా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా ఉద్యోగ విరమణ చేసిన ఆమె రచనా వ్యాసాంగాన్ని ప్రవృత్తిగా కొనసాగిస్తున్నారు. హృదయాలను స్పందింపజేసేదే కవిత్వమని కవయిత్రి శ్రీమతి గరిశకుర్తి శ్యామల అభిప్రాయపడ్డారు. ‘కోవెల దీపాలు’ కవితా సంపుటితో సాహితీ లోకంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని పదిలపరుచుకున్నాను. ‘స్నేహ పరిమళాలు’ కథా సంపుటిని వెలువరించి కథకురాలిగా అందరికీ పరిచయమయ్యారు. 1997 నుండి తమ రచనలను సృజన చేస్తున్న ఆమెతో మెరుపు ముచ్చటించింది. ముఖాముఖి వివరాలు మెరుపు పాఠకుల కోసం..

ఆ మీ రచనా వ్యాసాంగం ఎప్పుడు ప్రారంభమైంది?
1997లో సినారె జన్మదినం సందర్భంగా సిరిసిల్లలో మొట్టమొదట కవిత రాసి చదివాను.

ఆ మీకు రచనలపై ఆసక్తి కలగడానికి ప్రేరణ ఎవరు?
మా అమ్మ ప్రేరణతో రచనలు చేయాలన్న ఆసక్తి కలిగింది.

ఆ మీరు ఏయే ప్రక్రియల్లో రచనలు చేశారు?
వచన కవిత్వం, కథలు, సాహిత్య వ్యాసాలు, బాల సాహిత్య రచనలు, మొదలగునవి. పలు కవితా సంకలనాల్లో, కథా సంకలనాల్లో నా కవితలకు, కథలకు చోటు కల్పించారు. ఆకాశవాణి ద్వారా కూడా కొన్ని ప్రసారమైనాయి.

ఆ మీ దృష్టిలో కవిత్వమంటే ఏమిటి?
నా దృష్టిలో మనస్సులను కదిలించేదే అసలైన కవిత్వం. కవిత్వం సామాజిక చైతన్యానికి దోహదపడాలి. హృదయాలను స్పందింపజేయాలి. ఇజాలకు కట్టుబడకుండా నిజానికి పట్టం కట్టేదే కవిత్వం..

ఆ మీకు నచ్చిన గ్రంథమేది?
సినారె గారి విశ్వంభర.

ఆ మీ అభిమాన కవులు, రచయితలు ఎవరు?
సినారె, విశ్వనాథ సత్యనారాయణ, ముదిగంటి సుజాత రెడ్డి, కొవ్వలి లక్ష్మీనర్సింహారావు తదితరులు.

ఆ నేటి యువతరాన్ని సాహిత్యం వైపు మళ్లించాలంటే ఏం చేయాలి?
ఆధునిక వేగవంతమైన ప్రపంచంలో బుక్ కల్చర్ తగ్గింది. లుక్ కల్చర్ పెరిగింది. యువతరానికి ఇష్టమైన మాధ్యమాల ద్వారా వీలైనంత వరకు కథలు, పాటలు, వ్యాసాలు క్రమంగా ప్రవేశపెట్టాలి. సాహిత్య సభలు, సమావేశాలు అప్పుడప్పుడు విద్యాలయాల్లోనే ఏర్పాటుచేస్తే బాగుంటుంది.

ఆ సాహిత్య పురస్కారాలపై మీ అభిప్రాయం ఏమిటి?
ప్రతిభను గుర్తించి, పారదర్శకంగా ఎంపిక చేసి ఇవ్వబడే పురస్కారాలు మంచివే. పురస్కారాలు కవులు, రచయితల బాధ్యతలను పెంచుతాయి. అయితే.. ఇచ్చుకో వాయనం.. పుచ్చుకో వాయనం అన్న చందంలా కొన్ని సంస్థలు, కొంతమంది వ్యక్తులు ఇచ్చిపుచ్చుకోవడాలను మనం నేడు చూస్తున్నాం. వాటి వల్ల ప్రతికూల ఫలితాలుంటాయి.

ఆ మీ ముద్రిత గ్రంథాలు తెలుపుతారా?
కోవెల దీపాలు, కవితా సంపుటి స్నేహపరిమళాలు కథా సంపుటి.

ఆ ఇప్పుడొస్తున్న టీవీ సీరియళ్లలో మహిళల పాత్రలపై మీ అభిప్రాయం?
సాహిత్యం సమాజహితం కోరాలి. టీవీ సీరియళ్లలోని సాహిత్యం భిన్నంగా ఉంటోంది. మహిళల స్వభావానికి విరుద్ధంగా పగలు, ప్రతీకారాలు తీర్చుకునే స్ర్తిల పాత్రలను రూపొందిస్తున్నారు. ఇలాగే కొనసాగితే సమాజంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. అలాగే టీవీ సీరియళ్లలో పురుష పాత్రలను ఇద్దరు పెళ్లాల ముద్దుల మొగుళ్లుగా చూపడం జరుగుతోంది. ఇది బాధాకరం! కాబట్టి టీవీ సీరియళ్లలో సాహిత్యపరంగా సామాజిక చైతన్య సంబంధ అంశాలపై దృష్టి పెడితే బాగుంటుంది.

ఆ మారుతున్న సమాజంలో ఇంకా స్ర్తివాద కవిత్వమవసరమంటారా?
అవసరం లేదు.

ఆ కొత్త కవులు, రచయితలకు మీరిచ్చే సలహాలు, సూచనలు ఏమిటి?
అధ్యయనం పట్ల శ్రద్ధ చూపి మెలకువలు తెలుసుకోవాలి. పదబంధాల ప్రయోగం పట్ల పట్టు సాధించాలి. ఏ వాదానికి కట్టుబడకుండా మానవతా వాదంతో రచనలు చేయాలి.
***

ఇంటర్వ్యూ : దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544
**

20న ధర్మనిధి సాహితీ పురస్కారాల ప్రదానం (అంతరంగం)
ధర్మనిధి సాహితీ పురస్కారాలను ఈ నెల 20వ తేదీన ప్రదానం చేయనున్నట్లు సర్వవైదిక సంస్థానం కులపతి భాష్యం విజయసారధి తెలిపారు. కరీంనగర్‌లోని బొమ్మకల్ రోడ్డులో ఉన్న యజ్ఞ వరాహ స్వామి ఆలయంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పురస్కార గ్రహీతలుగా ఆరుట్ల భాష్యాచార్యులు, చెన్ను ప్రమీల, గౌరీభట్ల రఘురామ శర్మ, శేషం వేంకట నర్సింహాచార్య, బి. రేవతి, జక్కని వెంకటరాజం, తిరునహరి సత్యనారాయణ, చిగురుమల్ల శ్రీనివాస్ వేణుశ్రీ, ఎం.హెచ్.ఎస్. భాస్కరమూర్తి, ఎం.ప్రదీప్‌శర్మ, బి.ఎస్.ప్రహ్లాదాచార్యులు, ఎల్.సత్యనారాయణ అవధాని, సిహెచ్. చంద్రశేఖర్‌శర్మ, పి.వి.రమణాచార్యులు, మహేశ్వర శర్మ పురాణం, డా. ఎన్.ఎల్.ఎన్.ఆచార్యులు, మంగళంపల్లి వేణుగోపాలశర్మ, డా. దివి నర్సింహ దీక్షితులు, వేల్పుల రత్నం, శకల్ల హరిహరాచారి, బేని హరి ఎంపికైనట్లు సంస్థానం కులపతి ఒక ప్రకటనలో తెలిపారు.
**

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net