విశాఖపట్నం

తలోదారి (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అది రిటైర్ ఐఎఎస్ ఆఫీసర్ గారికి కొత్తగా ఏర్పాటు చేసిన కార్యాలయం. పరీక్షల నిర్వహణ మీద వేసిన కమిటీ అది.
ఒక్కొక్కరుగా ఆ గదిలోకి వస్తుండడం వల్ల కాన్ఫరెన్స్ హాలు క్రమంగా నిండసాగింది.
ప్రభుత్వం పరీక్షల్ని అవినీతిరహితంగా ఎలా నిర్వహించాలో సలహాలు సూచనలకు ఏర్పాటు చేసిన సమావేశం అది. ఇండియన్ పంక్చువాలిటీ ప్రకారం అరగంట ఆలస్యంగా అందరితో హాలు నిండింది. అంత వరకు పక్క గదిలో వెయిట్ చేస్తున్న పట్నాయక్ లేచాడు సమావేశాన్ని ప్రారంభించేందుకు.
హాల్లో సుమారు ఏభై మంది వరకు ఉన్నారు. ఇరవై మంది విద్యావేత్తలు, ఇరవై మంది వ్యాపారవేత్తలు కాగా మిగిలిన వారు రిటైర్డ్ అధికారులు.
ప్రసంగం ప్రారంభిస్తూనే పట్నాయక్ అన్నాడు ‘‘ఇది మనందరం చాలా ఫ్రీగా మనసులోని అభిప్రాయాల్ని పంచుకుని దేశానికి దిశా నిర్దేశం చేయగలిగే విధానాన్ని సూచించాలి. ప్రాథమిక స్థాయి నుండి పిజి, వృత్తి విద్య, సాంకేతిక కోర్సులు అన్నీ మనందరం ఈ రెండు రోజుల సెమినార్‌లో చర్చించి అభిప్రాయాల్ని ప్రభుత్వానికి తెలపాలి’’.
అందరూ తోచిన విధంగా మాట్లాడుకుంటున్నారు. ప్రతిసారీ సమావేశాల్లోపై అధికారులు ఏదో చెప్పడం, మిగిలిన వాళ్లు ఆచరించడం ఇదీ జరుగుతుంది. సమావేశానికి ముందే వారి అభిప్రాయాల్ని అడగడం ఇదే మొదటిసారి.
అందరికీ నోట్‌పాడ్స్ పంచారు. ఫైలులో పెన్, పెన్సిల్ వంటి అవసరం అయిన వస్తువులు సప్లై చేశారు. అతను మాట్లాడుతున్న సమయంలోనే ‘‘రాష్ట్ర ప్రభుత్వ అవసరాలు తీరుస్తూ మానవ వనరులను సమర్థవంతంగా మెరుగుపరుచుకోగలగడం, కేంద్ర ప్రభుత్వం సంయమనంతో విద్యా వనరులని మెరుగుపరుచుకోవడం అన్నీ ఒకేసారి జరగలి. వీటి మధ్యలోనే విద్యార్థి ప్రయోజనం, అతడి ఆర్థిక అవసరాలు, నైతిక స్థైర్యం మెరుగుపడేలా చర్యలుండాలి’’ అంటూ ప్రసంగం ముగించాడు పట్నాయక్.
‘‘సార్ ఖర్చులు పెరిగేలా ప్రతిపాదించాలా? తగ్గించాలా?’’ ఒకరడిగారు.
‘‘ప్రభుత్వ పరంగా ఖర్చులు ఎంత తగ్గితే అంత మంచిది’’
‘‘అధికారుల సంఖ్య’’
‘‘వాళ్లూ తక్కువగా ఉంటే ఇంకా మంచిది’’
‘‘ఎలిమెంటరీ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతుంది?’’ రామ్మూర్తి అన్నాడు చంద్రవౌళితో సమావేశంలో పరస్పరం జరిగిన చనువుతో.
‘‘ఏముంది చదువులు సరిగ్గా సాగడంలేదు’’
‘‘కారణం’’
‘‘ఉపాధ్యాయులకు వేర్వేరు పనులు అప్పగించడం, వాళ్లు సొంత పనులపై చదువును నిర్లక్ష్యం చేయడం’’
‘‘మార్గం లేదా?’’
‘‘ఎందుకు లేదు? కానె్వంట్ చదువుల మోజు పెరిగింది ఈ రోజుల్లో. అందుకే ఎలిమెంటరీ లెవెల్లో మనమూ దానిని అమలు చేయాలి’’
‘‘మరి ఆ ట్రైనింగ్ ఇవ్వాలేమో కదా’’
‘‘వీకెండ్ సెంటర్ క్లాసులు, వారం పది రోజుల రిఫ్రెష్‌మెంట్ కోర్సులు చాలు’’
‘‘హైస్కూలు సంగతి’’
‘‘ఎలిమెంటరీ గేట్లు ఎత్తివేశాక హైస్కూలు వాళ్లు ఇంకేం చేస్తారు?’’
‘‘వాళ్లూ ఎలిమెంటరీ లాగే తొమ్మిది వరకు ఎత్తేసారు. పదవ తరగతి సంగతి అప్పుడు చూద్దాం అని’’
‘‘పదవ తరగతి ఎలా గట్టెక్కుతారు?’’ అడిగాడు చంద్రవౌళి.
‘‘కొన్ని బిట్లు కొందరి సాయం. చదివే వాళ్ల విషయం ఆలోచించనక్కర్లేదు. మిగిలిన వాళ్ల గురించే ఈ దారి’’
‘‘ఇక ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లు కాలేజీలు బాగా చదువుకున్న వారిని ఎత్తుకుపోతాయి. సాదాసీదా వాళ్లు, కాలక్షేపం వాళ్లు, పేదరికం వల్లనో చదివే వాళ్లు మాత్రమే అధిక శాతం మంది ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలను ఎంచుకుంటారని అంటుంటారు’’
‘‘అవును జరుగుతుంది అదే’’
‘‘అంతా అటు కొట్టుకుపోయాక ఉనికి నిలబెట్టుకోవడానికి ఇలా రకరకాల మార్గాల్ని అనే్వషిస్తున్నారంతా’’
మరో చోట వసంతరావు, ఆనందరావుల మధ్య సంభాషణ ఆ గదిలోనే సాగుతోంది.
‘‘మనం హైస్కూల్స్ ప్రారంభించాం. అక్కడి నుండి జనాల్ని మన కళాశాలలకు తరలించవచ్చు. అట్నుండి ప్రొఫెషనల్, టెక్నికల్, జనరల్ కోర్సులకు దారులు ఏర్పాటు చేసుకోగలం’’ అన్నాడు వసంతరావు.
‘‘ప్రస్తుతం అదే చేస్తున్నాం మనం’’
‘‘ప్రభుత్వం పెట్టిన కొన్ని కండిషన్లు ఓకే చేసి మిగతా చోట్ల దొరికినంత దోచేసే ఛాన్స్‌కి పోకపోతే సరి’’
‘‘స్కాలర్‌షిప్ సహకారం ఉంది కాబట్టే ఎలాగోలా నెట్టుకొస్తున్నాం. ఇప్పుడు కొందరు ఈ సౌకర్యం కేవలం ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కూళ్లు, కళాశాలలు, యూనివర్సిటీలకే పరిమితం చేయాలంటున్నారు. ఇది జరిగితే’’ అంటూ ఆపేశాడు ఆనందరావు.
‘‘ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గి ప్రైవేటు రంగంలో పెరిగితే వారికి ఖర్చులు మిగులుతాయి కదా’’
‘‘అందుకే ప్రభుత్వం మన చర్యల్ని చూసీచూడనట్లు వదిలేస్తోంది’’
‘‘అవునవును’’ అంటూ తలాడించాడు వసంతరావు.
ఇంకో చోట ప్రకాష్, స్వరూప్‌ల మధ్య సంభాషణ ఇలా సాగుతోంది.
‘‘చూసి రాతల విధానం ప్రవేశపెడితే ఖర్చులు తగ్గుతాయి’’
‘‘చూసి రాతలా?’’ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు స్వరూప్.
‘‘అందులో తప్పేముంది?’’
‘‘తప్పులేదా?’’
‘‘అవును. సంవత్సరం అంతా పుస్తకాలు చదివి వాటినే చూసి అవసరం అయిన విషయాలు ప్రశ్న అడిగిన ప్రకారం ఇచ్చిన మార్కులకు తగినట్లు రాయాలి. అదే చూసి రాత’’
‘‘అంటే పుస్తకం అంతా చదివితే గానీ రాయలేరన్న మాట’’
‘‘అవును ముందుగా గైడ్లు పోతాయి. చదవాల్సిన అవసరం విద్యార్థులది. చెప్పవలసిన అవసరం ఉపాధ్యాయులది’’ అన్నాడు ప్రకాష్.
‘‘స్కాలర్‌షిప్‌ల విధానం కూడా మారాలి’’
ఈ చర్చల్లోనే ఆఖరు రోజు వచ్చేసింది.
అందరూ తమకిచ్చిన ఫైల్లో తోచిన సమాచారం అంతా రాశారు. ఎవరికి వారే తమ అభిప్రాయానికి విలువెక్కువుంటుందని నమ్మకంగా ఉన్నారు.
టిఎ, డిఎలు పుచ్చుకుని అందరూ తలో దారి పట్టారు.
పట్నాయక్ ఆ ఫైళ్లు, వాళ్లందరికీ చర్చించుకోవడానికి ఇచ్చిన గదిలోని సిసి పుటేజీ క్యాసెట్స్‌తో ప్రభుత్వ పెద్దల్ని కలవడానికి వెళ్లాడు.
ఆర్నెల్లలో ఫైల్ సిద్ధమయింది.
సంవత్సర కాలం నుండి సిఎం టేబుల్‌పై ఆయన నిర్ణయం కోసం ఎదురుచూస్తోంది. రాబోయే సిఎం అయినా దానికి మోక్షం కల్పిస్తారన్న ఆశతో.

- శ్రీనివాసభారతి, శ్రీకాకుళం.