ఉత్తర తెలంగాణ

దొంగా! దొంగా! (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొద్దునే్న కూరగాయలు కొనుక్కొని ఇంటిముఖం పట్టిన అమర్‌కు ఓ పదిమంది వరకు అరుస్తూ పరుగెత్తుకుంటూ తనకెదురుగా వస్తున్న గుంపువైపు చూసాడు. సుమారు ఓ పదేళ్ల బాలుడు చేతిలో ఓ ప్లాస్టిక్ సంచిలో ఏదో పట్టుకొని వారికి దొరక్కుండా ప్రయత్నిస్తూ పరుగెత్తుతున్నాడు. పదేళ్ల పిల్లాడి వెంబడి పదిమందిదాక.. అమర్‌కు దాదాపు పది గజాల దూరంలో పట్టుకొని చితకబాదుతున్నారు. విషయం అర్థం కాని అమర్ ఆదరా బాదరాగా ఆ గుంపులో జొరబడి ఆ బాలున్ని అందరి నుండి వేరుజేయడంలో సఫలీకృతుడయ్యాడు.
‘ఏమయ్యింది? ఎందుకు మీరందరు కలిసి కొడుతున్నారు? వీడు చేసిన తప్పేంటి?’
గుంపులోంచి ఒకతను ముందుకొచ్చి అమర్‌వైపు, ఆ పిల్లాడి వైపు కోపంగా చూస్తూ.. ‘దొంగ రాస్కెల్! ఈ మందులు కావాలని అడిగి, అవి ప్యాక్ చేయగానే డబ్బులివ్వకుండా ఎత్తుకొని పారిపోతున్నాడు’ అంటూ వాడి నెత్తిపై మరో రెండు తగిలించాడు. అందరూ దానికి వంతపాడుతూ..
‘తన్నండి గాడిదని! ఇంత చిన్నప్పుడే దొంగతనం మొదలుబెడితే.. పెద్దయ్యాక వీడు గజదొంగ అవుతాడు!’ అంటూ తలా ఒకటి దెబ్బ వెయ్యాలని చేతులేత్తే లోపల..‘ఆగండి!’ గట్టిగా అరిచాడు అమర్.
‘వీడు చేసింది తప్పే! కాదనను. వాడి దగ్గర డబ్బులు సరిపడా ఉండక పోవచ్చు. కాని ఎందుకు ఇలా చేయాల్సి వచ్చిందో మీలో ఒక్కరైనా ఆలోచించారా? మీరు శాంతించండి. నేను కనుక్కుంటాను’ అమర్ ఆవేశంగా ఓ చిన్నపాటి ఉద్బోధ చేశాడు. ఎందుకో అమర్‌కు ఆ చిన్నోడి వాలకం చూస్తే జాలేసింది. దొంగలా అనిపించడం లేదు.
‘మీ బిల్లు ఎంతండీ? నేనిస్తాను’ అమర్ ఆ షాప్ ఓనర్ అడిగిన రెండు వందల రూపాయలు చెల్లించి, అందరు వెళ్లిన తరువాత ఆ పిల్లాడ్ని దొంగిలించడానికి దారితీసిన విషయాలన్నీ నెమ్మదిగా కనుక్కున్నాడు. వాళ్లమ్మకి నాలుగు రోజుల నుండి జ్వరమని, ఎవరో డాక్టర్ వచ్చి ఈ మందులు వాడితే తగ్గుతుందని.. ఏడుస్తూ గద్గద స్వరంతో చెప్పాడు -దెబ్బలు బాగా తగలడంతో.
‘నీ పేరేంటి బాబు? మీనాన్న ఏం చేస్తుంటాడు? మీ ఇల్లెక్కడ?’ బుజ్జగిస్తూ అడిగాడు. పేరు శ్రీరామ్ అని, వాళ్ల నాన్న లేడని, చిన్నప్పుడే చనిపోయాడనీ.. అమ్మ చెప్పిందనీ..అమ్మ బట్టలు కుడుతుందని, వాడిని పక్క ఊళ్లో చదివిస్తుందనీ, ఇప్పుడు నాలుగవ తరగతిలో వున్నానని.. మెల్లిగా అన్నీ చెప్పేసాడు. వాడున్న పరిస్థితి చూసి అమర్‌కు జాలేసింది.
‘సరే, నాయనా! బాగా చదువుకో, ఇలాంటి చిన్న చిన్న తప్పులు పొరపాటున మళ్లీ చేయకు. అవే అలవాటుగా మారితే తరువాత వదిలించుకోవడం చాలా కష్టం. అమ్మ కష్టపడి నిన్ను చదివిస్తుంది. పెరిగి పెద్దయ్యాక అమ్మను బాగా చోసుకో, పేరు తెచ్చుకొని అవసరమైన పదిమందికి మేలు కలిగే పనులు చెయ్యి. అమర్ పెద్ద మనసుతో చెప్పాడు. వాడికి ఏమి అర్థమయ్యందో గానీ... తల ఊపి కృతజ్ఞతాభావంతో అమర్ వైపు చూసి వెళ్లిపోయాడు. అమర్‌కు మాత్రం తన జీవితంలో ఒక మంచి పని చేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతృప్తితో ఇంటి బాట పట్టాడు.
దాదాపు ఇరవై సంవత్సరాలు గడిచాయి.
లావణ్య అమర్‌కు ఒకానొక కూతురు. మెడిసిన్ పూర్తికాగానే హైదరాబాద్‌లోని ఓ అతి పెద్ద కార్పోరేట్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్‌గా చేరింది. కొంతమంది నిపుణులయిన డాక్టర్లు కలిసి స్థాపించిన హాస్పిటల్ అనురాగ్. ఏ వ్యాధినైనా నయం చేసే సత్తా వున్న ఎంతోమంది నిష్ణాతులైన డాక్టర్లతో మంచి పేరున్న హాస్పిటల్. దసరా పండక్కి తన హాస్టల్ రూమ్ మేట్ రజనీని తీసుకొని తల్లిదండ్రుల వద్ద కొన్ని రోజులు గడపడానికి వచ్చింది. హాయిగా పండగ గడిచింది. మరునాడే లావణ్య బయలుదేరాల్సింది. ఉండుండి హఠాత్తుగా అమర్ ఛాతిలో నొప్పి అంటూ బాధతో మెలికలు తిరుగుతూ కిందబడిపోయాడు. ఏ మాత్రం ఆలస్యం చెయ్యకుండా లావణ్య అంబులెన్స్ తెప్పించి హైదరాబాద్‌లో తను పనిచేసే అనురాగ్ హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. అన్ని టెస్టులు చేసి రిపోర్ట్సు చూసిన తరువాత తేలిందేమంటే.. అమర్ గుండెకు సంబంధించిన చాలా రక్తనాళాల్లో సమస్య. తప్పనిసరి ఆపరేషన్ చెయ్యాల్సిన పరిస్థితి. వెంబడే లావణ్య డాక్టర్ శ్రీరామ్‌తో ఆపరేషన్ గురించి మాట్లాడింది. ఇది అతిక్లిష్టమైన ఆపరేషన్, ఇలాంటివి డాక్టర్ శ్రీరామ్ కొన్ని వందలపైన విజయవంతంగా చేసిన పేరుంది. వయసులో చిన్నవాడైనా సర్జరీలో దిట్ట! అదృష్టవశాత్తు ఆయన ఒప్పుకున్నాడు. రిపోర్ట్స్ చూసిన పిదప బెడ్‌పై ఉన్న పేషెంటు అమర్‌ను సమీపించగానే ఏదో జ్ఞాపకమొచ్చి చిన్నగా నవ్వుకున్నాడు.
సర్జరీ సక్సెస్! ఐసియులో ఒక రోజు ఉంచి స్పెషల్ రూమ్‌కి మార్చారు. రెండో రోజు పొద్దునే్న పది గంటలకు డాక్టర్ శ్రీరామ్ అమర్‌ను పరీక్షిస్తూ.. ఇప్పుడెలా ఉంది? అని అడిగాడు. ‘చాలా థాంక్స్, డాక్టర్ గారు! బ్రతుకుతానో.. లేదో.. అన్న పరిస్థితిలో వున్న నన్ను ఆపరేషన్ చేసి సురక్షితంగా గట్టుచేర్చారు. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనిది. జన్మ జన్మకు మీకు రుణపడి వుంటాను’ అమర్ గొంతు పెగలకున్నా ఇంకా ఏదేదో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అంతలో డాక్టర్ శ్రీరామ్.. ‘లేదు అమర్ గారు! నేనే మీకు ఎంతో రుణపడి వున్నాను! మీకు గుర్తులేదేమో.. నా చిన్నప్పుడు మా అమ్మకు జ్వరమని మందులు దొంగిలించి పట్టుబడినప్పుడు మీరు నన్ను కాపాడారు! బాగా చదువుకుని ప్రయోజకుడివి కావాలని ఆశీర్వదించారు! ఈ రోజు ఇలా.. కొంత రుణం తీర్చుకునే అవకాశమొచ్చింది’ అన్నాడు ఉద్వేగంగా.
ఇదివరకు లావణ్య, శ్రీరామ్‌లు ఎన్నోసార్లు కలిసి మాట్లాడారు. కానీ.. ఇప్పుడెందుకో ఇద్దరికీ ఈ కలయిక చాలా కొత్తగా అనిపించింది!

- ఆచార్య కడారు వీరారెడ్డి హైదరాబాద్, సెల్.నం.7893366363