నెల్లూరు

బతుకులు ఎలాగైనా తారుమారు కావచ్చని చాటిన బంగారు కథ (స్పందన)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెరుపులో ప్రచురితమైన బంగారు కథ చాలా బాగుంది. ఎంత బాగా బతికినా మనం వేసే అడుగుల్లో ఒక్క తప్పటడుగు జీవితాన్ని కకావికలం చేస్తుంది. ఇలాంటి ఓ కథను ఎంచుకుని చక్కగా ఆవిష్కరించిన రచయిత ఆలకుంట రెడ్డిప్రసాద్ గారికి ధన్యవాదములు. గొప్పగా యువరాణిలా పెరిగిన బంగారు జీవితం చివరికి ఎలా బుగ్గిపాలయ్యింది. ఆమె పడిన కష్టాలు పగవాడికి కూడా రాకూడదని ఆ దేవున్ని ప్రార్థించాలనిపించేలా కథలో భావోద్వేగాలను చొప్పించిన తీరు హేట్సాప్. అలాగే కథ నిడివి ఎక్కువైనా ఈ కథకు అంతమాత్రం అవసరం. రైలులోని సంభాషలన్నీ బాగా కుదిరాయి.
- సన్యాసి రామ్మోహన్, కావలి
- లక్ష్మీప్రియాంక, పుంగనూరు

ఆలోచింపజేసిన నేనంటే నేను
గతవారం మెరుపులో నేనంటే నేను కవిత ఆలోచింపజేసేదిలా ఉంది. రచయిత చాలా పరిఢవిల్లే చైతన్యంతో కవితను రచించారు. ముఖ్యంగా మనం పుట్టగానే మనతో పాటు మృత్యువు పుడుతుంది. అలాగే మనం ఎదుగుతున్నామనుకుంటాము, కానీ వాస్తవంగా మనం తరుగుతున్నాము, మనం వేడు ప్రతి అడుగును మన మృత్యువు మన వెంట ఉండి గమనిస్తూనే వుంటుంది. ఎన్ని ఎత్తులు పైఎత్తులు వేసిన చివరికి చేరేది మృత్యు ఒడిలోకి. గొప్ప కవితను మనకు అందించిన వేదగిరి రామకృష్ణ గారికి ధన్యవాదములు.
- రామాంజనేయులు, కుప్పం
- ఆళహరి సత్యనారాయణ, నాయుడుపేట
- హేమప్రియ, ఫత్తేఖాన్‌పేట, నెల్లూరు

కాలం-మహత్యం సూపర్
గతవారం మెరుపులో కాలం మహత్యం కవితను గొప్పగా రాసి జీవితంలో జరిగే ప్రక్రియలను కళ్లకు కట్టిన రచయిత గర్నెపూడి వెంకటేశ్వరరావు గారికి నమస్సులు. చాలాకాలం తర్వాత ఓ గొప్ప కవితను చదివామన్న భావన కలిగింది. నిజంగా జీవితం ఇలానే సాగుతుంది.
- అయినాబత్తిన లలిత, అద్దంకి
- ఏనుగు నరసింహశాస్ర్తీ, ఆత్మకూరు
- పులుగుల సుబ్బయ్య, పుత్తూరు
***

రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net