నెల్లూరు

నిత్య శ్రామికుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొత్తిళ్లలో ఉన్ననాడు ఉగ్గుపాలతో
అమ్మ చెప్పిన దేశభ క్తుల కథలు విని ఉత్తేజితుడవై
దేశం కోసం నేనూ ఒకడినంటూ సైన్యంలో చేరి పహారా కాసే
సైనికుడా.. వందనం
నిత్య శ్రామికుడా నీకు వందనం
లాలి లాలించూ
జోలపాటతో నిద్రబుచ్చవద్దంటూ
భరత మాత రక్షణకు
మన కర్తవ్యం ఏమిటో
బోధించమని ఊయలలో
పడుకో బెట్టినప్పడు అమ్మను అడిగి
ఆమె చెప్పే దేశభక్తుల కథలు విని చైతన్యం నింపుకున్న
సైనికుడా.. వందనం
నిత్య శ్రామికుడా నీకు వందనం
పాఠశాలలో చేరి దేశ భక్తుల చరిత్ర
పాఠాలుగా నేర్చుకున్నప్పడు
న రనరాన దేశభక్తి నింపుకుని
దేశరక్షణలో నిమగ్నం కావాలన్న దృఢ సంకల్పం ఏర్పరచుకున్న
సైనికుడా వందనం..
నిత్య శ్రామికుడా నీకు వందనం
రాత్రనక పగలనక, ఎడారుల్లోనూ, కొండగుట్టల్లోనూ, వాగుల్లోనూ సంచరిస్తూ
ముష్కరుల దాడులను తిప్పికొట్టే
సైనికుడా.. వందనం
నిత్య శ్రామికుడా నీకు వందనం
రెప్పవాల్చని పహారాతో భ రతమాత రక్షణ నీకు విధి
మీ సైనిక ధీరోచిత కృత్యాలను నిత్యం చరవాణిలోనే చూస్తున్న
మీ కుటుంబాన్ని ఆదుకోవడం
మా కర్తవ్యం
భారతీయులంతా ఎవరి పనులు వారు చేసుకుంటూ సుఖంగా జీవిస్తున్నారంటే
మీ సైనిక శక్తి మా వెనుక ఉందని అర్థం.. అందుకే మీ కుటుంబానికి మేము అండగా ఉంటాం
ముష్కరుల దాడులను చాకచక్యంగా తిప్పికొడుతూ
భరత మాతను,
దేశ ప్రజలను రక్షించే ఓ జవానూ ..
అమ్మ ఆప్యాయత
ఆలి ఆలింగనం
బిడ్డల మమతానురాగాలకు దూరమై
సరిహద్దులో భరతమాత రక్షణకు నడుం బిగించిన
సైనికుడా.. వందనం
నిత్య శ్రామికుడా
నీకు పాదాభివందనం
ఏమిచ్చి తీర్చుకోగలం మీ రుణం..!

- పీసపాటి సంపత్‌కుమార్
చరవాణి : 9347109377
**
భారత సింహం

జూలు విదిల్చిన భరతమాత సింహం జవాన్
ఉగ్రవాదులను భద్రకాళి వలె
సంహరించే శక్తి అతడు
తూటాలు తనువును చీల్చిన
శత్రువులను తుదముట్టించేంత వరకు ఆగడు
ఆసేతుహిమాచలం నీ ధైర్యానికి
సలాం చేస్తుంది
భరతావనికి హీరో ఇతడు
పుట్టుకకు పరమార్థం నీవేనని
చాటుతుంది అవని
వారి సమాధుల సువాసనల దగ్గర
దేశభక్తి దేశ జెండాలు గర్వంగా ఎగురుతున్నాయి
ఋణపడింది నిన్ను కన్న తల్లిదండ్రులకు మన భరతావని

- కారుమంచి నాగేంద్ర ప్రసాద్
చరవాణి : 9441624001
**
సంస్కృతి స్తంభాలు

వాడికి భలే సరదా
భారత్‌పై యుద్ధమంటే
పైకి స్నేహహస్తం
అందిస్తామంటాడు
లోపల ఉగ్రవాదం
నూరిపోస్తుంటాడు
వాడికి అదో ఆట
భారత్‌పై యుద్ధమంటే
తలల్ని తెంపమంటాడు
అణ్వాయుధాలతో
ఆటలాడుతానంటాడు
వాడికి భలే ధైర్యం
భారతీయులు సహనశీలురనీ
భారతీయులు శాంతికాముకులనీ
మనల్ని ఏమీ చేయలేరనీ!
వాడికి భలే తెగింపు
తుపాకి చేతికిస్తాడు
గీత దాటమంటాడు
ప్రాణాలు పోతే భయపడకు
కర్మక్రతువులూ వాళ్లే చేస్తారు పో
అంటూ నిస్సిగ్గుగా మాట్లాడుతాడు
కానీ...
వాడికి తెలీదు
ఇక్కడ తెగిన తలలు కూడా
దేశభక్తినే ప్రబోధిస్తాయని!
వాడికి తెలీదు
ఇక్కడ మొండాలు కూడా
వీరమరణం పొందామని
గర్వంతో నృత్యం చేస్తాయనీ!
వాడికి తెలీదు
ఇక్కడ సహనమే ఆయుధమని
శాంతి స్థాపనే ధ్యేయమనీ
వాడికి తెలీదు
ఈ దేశం ధర్మపునాదులపై
నిలబడి వుందనీ!
సంస్కృతి స్తంభాలపై
నిర్మించబడి వుందనీ!!
వాడికి అసలు తెలీదు
భారతీయులు సంయమనం కోల్పోతే
ప్రపంచ పటంలో
పాకిస్తాన్ వుండదనీ..!

- పల్లాపు రాము
చరవాణి : 9491384819
**

జై జవాన్

నిద్రాదేవి
వారి కనురెప్పలను సైతం తాకను
సాహసించలేదు
ఎంత శీతల పవనం అయినా
ఆ పౌరుషంతో వరదలా
పొంగిపొరలే
వారి రక్తప్రవాహాన్ని
గడ్డ కట్టించలేక
గజగజ వణుకుతుంది
సరిహద్దు రేఖ వద్ద కాపలా కాసే
వాడి పద ఘట్టనలను విని
శత్రువుల గుండెలు భీతితో
గుభిల్లుమంటాయి
వారి కళ్ల నుండి కురిసే
క్రోధాగ్నులను
చూసి.. శత్రువుల మర ఫిరంగులు
వెలవెలపోతాయి.
జై జవాన్..!

- మోపూరు పెంచల నరసింహం
చరవాణి : 9346393501
**
ఖబడ్దార్

ఇపుడే వస్తున్నానమ్మా అంటూ
వాగ్దానం చేసి తిరిగిరాని
లోకాలకెళ్లిన బిడ్డడు..!
విధి నిర్వహణకు వెళ్లిన
భర్త కోసం ఎదురుచూసే భార్యకు
శరాఘాతం లాంటి వార్త
మనిషి మాంసం రుచిమరిగిన
క్రూరమృగాల వికృత చేష్టల ఫలితం
ఈ పుణ్యభూమి వౌనంగా
రోదిస్తుంది
వీరులకు నివాళిలర్పిస్తూ..!
ఓ ఉగ్రవాదమా..!
మనుషుల ప్రాణాలను
తృణప్రాయంగా తీయగలవు గానీ
ఇప్పుడు తీసుకురా..
ఏడిచే ఆ పిల్లకి తల్లిని
కుమిలే తల్లులకు బిడ్డలని
ఉగ్రవాదమనే మాదకద్రవ్యాలను
వంటి నిండా నింపుకున్న
మూర్ఖులారా
ఏనుగు ఊరేగింపులో
కుక్కలు మీరు
మేము నిద్రించేటపుడు ఎలుకలా
మా కాలివేలు కొరకగలవేమో కాని
మా నిలువెత్తు శౌర్యాన్ని
ఎదిరించగల సత్తా నీకెక్కడిది?
ఇతరుల కోసం ప్రాణాలను
సైతం లెక్కచేయని
సైనిక వీరుల స్థైర్యం చూసి
నీ వెన్నులో చలి పుట్టలేదూ?
నిన్ను చూసి భారతావని బెదరదు
మా గుండెల్లో ధైర్యం బెదరదు
నీవు ఎన్ని జన్మలెత్తిన
మా సౌభ్రాతృత్వ భావాలను
నీరు కార్చలేవు

- అవ్వారు శ్రీ్ధర్‌బాబు
చరవాణి : 8500130770