రాజమండ్రి

కవిత్వం మాత్రమే మాట్లాడే ఆల్ఫా - ఒమెగా (పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

- ప్రతులకు -
పేజీలు 111, వెల రూ.50
ర్యాలి ప్రసాద్,
విశ్వర్షి ప్రచురణలు, 949455342,
అన్ని ప్రచురణ సంస్థల్లోను లభ్యం
**
ఒక జీవితం విలువల్లో, పుట్టుక - మరణం సమపాళ్లుగానో - ఒకింత ఎక్కువ - తక్కువలా తెలిసీ చెప్పకుండా కవిత్వం మాత్రమే మాట్లాడటం - ర్యాలి ప్రసాద్ రచించిన ‘ఆల్పా - ఒమెగా’1 కోవలోకి వచ్చి చేరింది. సాధారణ గణితంలో గాని, శాస్త్ర పుస్తకాల్లోగాని ఆల్పా, ఒమెగాలకు తెలియనిదీ తెలుస్తున్నట్టు ప్రక్షిప్తం, అనంతంగా ప్రతిక్షేపింపబడుతుంటాయి.
ముఖాలు గుమికూడాయి
ఆలోచన వెనుతిరుగుతుంది
నీ వాక్యమెప్పుడూ నిశ్శబ్దమే
చీకటి నీకూ నాకూ మధ్య
దూరాన్ని గీస్తుంది
కన్నీటిలో జారిపడ్డ
కళ్లను వెతుకుతుంది
నేనింకా చూపుల ఆఖరి అంచులు
పట్టుకు వేలాడుతున్నాను
ఇది ఒక వాదాలకతీతమైన కవిత. మానవ జీవితం సుఖ దుఃఖాల మేలు కలయకే అంటూ సూత్రీకరణం - అంతిమ దుఃఖాన్ని గుర్తుకు తెచ్చే గంటలు వినబడుతుంటాయి. ఒక స్పష్టా - స్పష్ట అనుభవాలు - దృశ్యాక్షరాలుగా మారటం, అభివ్యక్తికి పద చిత్రాలుగా అక్షరాల్ని మానవ మస్తిష్కంలోకి చేర్చే ప్రయత్నం కనిపిస్తుంది. ఒక బాణికి అలవాటు పడిన పాఠకులు ఈ ఆధునికోత్తర ప్రక్రియల్ని ఎంతవరకూ జీర్ణం చేసుకుంటారో కదా! అనుకోవడం పరిపాటి. అయితే ఇప్పుడు వర్తమాన ధోరణుల్ని ఆకళింపు చేసుకుంటూ ఈ వాదం సమాంతరంగా కవిత్వానుశీలనం చేసుకుంటేనే ఈ తరహా కవిత్వం తన శైలిని విషయ వివరణల్ని చెప్పగలుగుతుంది.
ఊపిరి నిండని కాగితాన్ని
చింపెయ్ ప్లీజ్
చిరిగిన పదాలు నేలకొరిగినై
నీ కళ్లను
పెదాల్లోకి పంపి//
కవిత్వపు నీడని విప్పీ విప్పకుండా
ఇలా కొంత అరూపం, కొంత వైరుధ్యం కన్పర్చడం జరుగుతుంటుంది. ముఖ్యంగా ‘ఆల్ఫా ఒమెగా’లో ఒక మనిషి అతని మరణ చింతనలో ఎదురయ్యే ఘట్టాలు చివరి దాకా పొందిన అగమ్య గోచరమైనవిగా తాత్వికతలు, తర్కాలు ఎదురవడం చూస్తాము
ఇల్లు లేని నీడను
వెదుకుతూ వెళ్తున్నాను
దగ్గరౌతున్న చీకటి మధ్య
పుట్టని విరామం / నిద్ర ఎర్రగా
వెలుగుతున్నప్పుడు / పదాల కింద
సమాధి వాక్యాలు / నల్లబడిన కాలంలో
పాచిపెట్టిన సందర్భాలు
ఇలా కవిత్వాన్ని దుఃఖం చిరుగులతో దుప్పటి మీద ఆరేసుకున్నప్పుడు కూడా బ్రహ్మాండమైన కాంతి ప్రవహించాలనుకోవడం కవికిగల సహజవంతమైన ఆశ - ప్రయాస కూడా అవుతుంది.
నిజంగానే కవిత్వం ప్రసవ వేదనాక్షరం
//ఒక ప్రసవ వేదన / ఆకాశంలో బోర్లాడిపనపుడు శిలువ మీద కృష్ణుడు / వేణువుకి వేలాడుతున్న పదహారు వేల గోపికల్లో / మగ్ధలీనా నెంబరుం అది అక్షరాలా ప్రకటీకృత సత్యంగానే ఏకమైనా రీతి, నీతుల్లోకి పరుగులు తీయించడం పరిపాటి. జీవి మరణాన్ని మ్లాన వదన సంకేతంగా కాక ఒక పరివేదనల సమాహారంగా, దేనికదే నిగూఢంగా సాగడం ‘అనునయం, అభిమానం, ఆగ్రహం’ల త్రైమూర్తిమంతం ద్యోతకమవుతుంది.
ఒక శ్వాస ఆగడం లిప్తకాలపు ప్రక్రియ. అందుకే శ్వాస - ధ్యాస మనుగడలో ప్రాముఖ్యవౌతుంటాయి. ఆగిపోయిన గడియారం / మృత్యువు కాలంలోకి ఒంపుతుంది / చందమామను తలకింద దాచి, కల నుండి బైటికొచ్చాక, వేదన వేణువై ఆకారాలు వసంతం పచ్చగా మెరుస్తుంది//
చివరిగా కవి భావాల్ని అట్ట వెనుక గమనిస్తే// ఆశ మొదలైంది / మూలాలకోసం / అవక్షేపాలు పెనుగులాట. ఈ వాదాల అస్థిత్వాల్ని ప్రభావితం చేసేందుకు, మరింత జవజీవాలు మరెన్నో సంపుటాల్లోకి నింపుకోవాలని ఆశిద్దాం. ఒక స్వప్నం సాకారమవటం జరగడానికి ఎన్ని ప్రయాణాల్లో చేయాల్సి ఉంటుంది.
//అరసిక భావాకాశంలో / తవ్వుతున్న శూన్యంపై / చుక్కలై రాలుతున్న / వెనె్నల శకలాలు / కళ్లు మిటకరిస్తూ శిలల శరీరాలు // ఒక భావం భాషా సమన్వయం చేయడానికి శూన్యం నుంచి - భావాకాశంపై చూస్తున్న కవికి రాలుతున్న వెనె్నల శకలాలు దర్శనమిస్తాయి. విద్రోహత్వాన్ని లెక్కకట్టడానికి, మెదడులోదాగున్న జ్ఞాపకాలను / గాయాలను ఏరి / అంటూనే ఒక వాస్తవికాంశాన్ని నిగూఢమైనదిగా ప్రకటిస్తారు కవి.
జీవితంలోని అనేక పార్శ్వాలు - వాటి నుంచి విడివడుతున్న సంఘటనాత్మక దృశ్యాల పొరలు ఎంత తార్కికంగానైనా, తాత్వికంగానైనా చెప్పడానికి పదాలు వాటి వెనుక అర్థాలు నవీనంగా ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. ఒక వేదాంతాన్ని - జీవిత రహస్యాల అంతిమ పరిష్కారంగా చూపడానికి చేసే ప్రయత్నం ‘ఆల్ఫా ఒమెగా’లో కనిపిస్తుంది. మనిషి ఊపిరికి - ఉనికికి అది వాస్తవికతల్ని జోడించటం ఒక ప్రయోగమని చెప్పాలి.
***

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net