రాజమండ్రి

మొక్కలు మనతో మాట్లాడితే... (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ మనసున్న మనుషుల్లారా!
అనాది నుండీ అనాధలైన మమ్మల్ని పెంచి పోషిస్తూ
మా సేవల్ని కొనియాడుతున్నారు మీరు
మీ ప్రాణాంతక వాయువును మేం గ్రహిస్తూ
మీకు ప్రాణవాయువును అందిస్తున్నామనీ
ఫల-పుష్ప-కలప ఔషదాదులతో అలరిస్తున్నామనీ
భూసార రక్షకులమనీ భూకోత భక్షకులమనీ
వర్షకారకులమై జీవకోటికి ప్రాణదాతలమనీ
వాతావరణ సమతౌల్యానికి తోడ్పడుతున్నామనీ
మీకు తోడూ-నీడగా ఉంటున్నామనీ
మీ ప్రగతిలో మాపాత్రను వేనోళ్ల శ్లాఘిస్తున్నారు
మరి! మీరో!! మాకోసం మా పెరుగుదల కోసం
‘వనభారతి-జనహారతి’2 ‘పచ్చదనం-పరిశుభ్రత’
‘నీరు-చెట్టు’2‘వనం-మనం’2 అంటూ
విశ్వమానవ కళ్యాణానికి ఆసేతు హిమాచల పర్యంతం
ఆ బాలగోపాలం ఢిల్లీ నుండి గల్లీదాకా
మమ్మల్ని నాటే పనికి
నడుం బిగించి ప్రతినబూని పట్టుదలతో
ఊళ్లను ఉద్యానవనాలుగా మారుస్తూ
మమ్మల్ని ఉద్ధరిస్తున్నారు
మాలో ప్రాణం ఉందని కనుగొన్న మహానుభావుడిలా
మాకు మాటలు నేర్పే మహనీయుడు
ఉద్భవిస్తే బాగుండును అనిపిస్తుంది
ఎందుకంటే!? మనసున్న మానవాళికి మనస్ఫూర్తిగా
కృతజ్ఞతలు తెలుపుకుంటూ మానవత్వంతో మమేకమై
మమతానురాగాలు పంచుకుందామని చిన్న ఆశ అంటూ
మొక్కలు మనతో మూగగా మాట్లాడుతున్నాయని ఎంచి
‘మొక్కలతోనే మన మనుగడ’2అని మాటిచ్చి మనమంతా
పచ్చదనానికి పునరంకితవౌదాం!
మంచి వాతావరణంలో మనుగడ సాగిద్దాం!!

- శిడగం దొరయ్య, ఏలేశ్వరం
***
చెల్లాయి వచ్చింది

అభిమానాలు అంతరిస్తే
మనసు మంధర వౌతుంది
వ్యత్యాసాలు వృత్తమైతే
వాత్సల్యం నిక్షేపణ వౌతుంది

స్నేహభావం సన్నగిల్లితే
శాంతిసౌఖ్యాలు సఖ్యం కావు
ఆంతర్యాలు ప్రచ్ఛన్నమైతే
రుగ్మతలు రుజువుగా నిలుస్తాయి!

ఒంటరితనంలో ఔత్సుక్యం తగ్గుతుంది
కలుపుగోలుతనం కళలను క్రమ్ముకుంటుంది
స్వార్థపు సంకెళ్లను సడలించకుంటే
చట్ర బతుకు నుంచి బైటపడకుంటే
జీవితం జడమై జటిలవౌతుంది!

మనిషి మనిషికి విభేదాలు ముదిరి
మానవత మూర్తిల్లిన ఈ రోజుల్లో
స్వార్థమనే సర్పం విషం గ్రక్కుతుంటే
మనుగడ మనస్తాపమైన నేటికాలంలో

చాలా ఏళ్లు అయితేనేం?
చెల్లి జ్ఞాపకాలు చెల్లిపోకుండ
చెల్లి వచ్చింది, మనసు చల్లనయింది
అంతిమ శ్వాసతో ఉన్న ఆత్మీయతకు
ప్రాణం పోసింది!

అన్నయ్యా! అన్న పిలుపుతో
కరుడుగట్టిన హృదయం ద్రవించింది
ప్రేమలు ఇగిరిపోయాయన్న మోడైన
అభిప్రాయాన్ని చిగురింప చేసింది!

అన్నయ్యా! అనే తీయని పలకరింపుతో
ఆనంద సుమ పరిమళాల్ని
ఎదకు అద్దింది!

-మల్లిమొగ్గల గోపాలరావు
సెల్ నెం: 98857 43834
**
ఓటమికి లొంగకు

ఓ మనిషీ! నీ ఓటమి నిన్ను
అతలా కుతలం చేస్తోంది!
నిగ్రహించు..ఆగ్రహించావో..
దిగులు, దుఃఖం చెకుముకి రాళ్లలా
నిరాశా నిస్పృలని రాపాడిస్తాయి.
రాలిన అగ్గిరవ్వలు హృదిలో పడి
నివురుగప్పిన నిప్పవుతాయి!
ఆవేశకావేశాశ వాయువులు వీచగానే
పరాజయం అగ్గి రాజుకుంటుంది!
పగ ప్రతీకారం మంటలు చెలరేగుతాయి
మారణాయుధాల జ్వాలాశిఖలు
దొరికిన వారిని దొరికినట్టు
చుట్టుముట్టి కాల్చేస్తాయి!
మసిరంగు శవాలు మిగుల్తాయి.
బలమైన సాక్ష్యాధారాలు దొరికితే..
సిరి సంపదల బలం
రాజకీయుల అండ
చట్టానికి కాదు..
ఆత్మసాక్షికి జడిసి సమర్థించవు
సిఫార్సు చెయ్యవు
వెనక్కి తిరిగి చూడవు
ఆస్తి అంతస్తు
బంధుమిత్రులున్నా
ఏకాకివై పోతావు!
మానవుడా!
ఇదే నిజమైన ఓటమి
గమనించి గమనం మార్చుకో!

- కృష్ణ మాధవరపు, కాకినాడ