విజయవాడ

ఎక్స్‌రే అవార్డుకు కవితల ఆహ్వానం (వేదిక )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునిక తెలుగు కవిత్వంలో గత 34 సంవత్సరాలుగా విశేష కృషి చేస్తూ అనేక ప్రాపంచిక పరిణామాలకు స్పందిస్తున్న ‘ఎక్స్‌రే’ జాతీయ స్థాయి అవార్డుకు కవితలు ఆహ్వానిస్తోందని అధ్యక్షులు కొల్లూరి, కార్యదర్శి ఆంజనేయరాజు, కోశాధికారి వెంకటసుబ్బయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాన అవార్డుకు ఎంపికైన కవితకు రూ.10 వేలతో పాటు కవికి జ్ఞాపిక అందజేసి సత్కరిస్తారు. మరో పది ఉత్తమ కవితా పురస్కారాలు కూడా అందజేస్తారు. చారిత్రక వికాసాన్ని క్రమపద్ధతిలో పదిలపరిచే ప్రయత్నానికి కవులు సహకరించాలని ఈసందర్భంగా వారు కోరారు. కవితా వస్తువు, పరిధి విషయాల్లో కవికి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. సుదీర్ఘ కవితలు పరిశీలించరు. కవితలు పంపేవారు ఎక్స్‌రే చందాదారులై ఉండాలని, తమ కవితలను ఈ నెల 31లోగా ‘ఎక్స్‌రే, 28-15-2, దాసువారి వీధి, అరండల్ పేట, విజయవాడ-2’ చిరునామాకు పంపాలని కోరారు. వివరాలకు 98484 48763 నంబర్‌లో సంప్రదించవచ్చని తెలిపారు.

**
అలా చూడమాక! (చిన్న కథ)

ఇంటి ముందు కారాగింది. కారులోంచి దిగుతున్న వాసంతి, గిరిజలను నవ్వుతూ ఆహ్వానించాడు హరనాథ్.
‘జమున వచ్చేసింది. ఇల్లు అమ్మిన తరువాత వస్తానని పట్టుపట్టి చివరికి అద్దెకిచ్చి.. ఇంత త్వరగా ఎలా రప్పించారు? ఏం ప్లాన్ వేశారు? నమ్మలేకపోతున్నా’ అన్నాడు.
‘నువ్వు మేనమామ కూతురితో పెళ్లి అని చెప్పిన తరువాత మేమందరం నిన్ను ఆ దృష్టితో చూడలేదు. ఒక ఫ్రెండ్‌లా భావించాం. కానీ జమునకి మామీద బోలెడు అనుమానం వుంది. ముఖ్యంగా వాసంతి మీద. అందుకే వాసంతి పెళ్లి చేసుకోకుండా వుండిపోయిందని, అది ఇక్కడే జాబ్ చేస్తోందని ఫోన్ చేశాను జమునకి’ చెప్పింది గిరిజ.
‘అరె! ఈ సంగతి నాకేం తెలుసు? వాసంతి భర్త బ్యాంక్ మేనేజర్ అని, కృష్ణలంకలో చాలా అందమైన బిల్డింగ్ వుందని, ఇద్దరు అమ్మాయిలు’.. అంటూ రాత్రి నీగురించి మొత్తం చెప్పేశానే’ అన్నాడు.
‘అయ్యో! అందుకే అది సిగ్గుపడి బయటికి రాలేదు. రావే తల్లీ! నిన్ను అమరావతికి రప్పించడానికి వేసిన చిన్న ప్లాన్. నీ మొగుడిని నేనేం ఎత్తుకుపోను!’.. సరదాగా అరుస్తున్న వాసంతిని ఆశ్చర్యంగా చూశాడు హరనాథ్.
‘ఏమిటలా చూస్తున్నావ్?’ అడిగింది వాసంతి హరనాథ్‌ని అభిమానంగా చూస్తూ.
‘అలా హరి వంక చూడకు తల్లీ! జమున మళ్లీ అపార్థం చేసుకుని హరిచేత ఉద్యోగానికి రిజైన్ చేయించేసి హైదరాబాద్ తీసుకుపోయి ఏ బిజినెస్సో చేయించేయగలదు’ అంది గిరిజ.
‘నువ్వు మారవా? ఇంకా మీరిద్దరూ అలాగే వున్నారా?’ చిరుకోపంగా అడుగుతున్న జమునని చూసి పకపకా నవ్వారు ముగ్గురూ!!

- జి నాగమల్లిక, టీచర్ గుంటూరు.