విశాఖపట్నం

మత్తును వదిలించుకో నేస్తమా! (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంచభూతాల సాక్షిగా
ముక్కోటి దేవతలు ఆనందిస్తుండగా
గ్లోబల్ గేము మాయలో చిక్కుకుని
మహాసరదాగా ముందుకు దూసుకుపోవాలని
ఆరాటపడుతున్న ఓ నేటి మానవుడా...
ఒక్కసారి కళ్ళు తెరువు
ఆట ఆపి నిన్ను నువ్వు చూసుకో
వానపాముల్లా మెల్లగా నీప్రక్కన
కాస్త నీడ కోసముచేరి,
కొండ చిలువల్లా బలిసి
నిన్ను మింగటం కోసం ఆరాటపడుతున్నాయి
ఆదమరిచి ఆటలో మునిగిపోయావో
బలికాక తప్పదు వాటి ఆకలికోరలకు
మేలుకో ఇకనైనా గ్లోబల్‌గేములోని
మత్తును కాస్త విదులించుకొని
తరిమికొట్టు వాటిని ప్రభంజనమై
విశ్వం అంచులు దాటేదాక

సి.హెచ్.వి. లక్ష్మి,
శ్రీకాకుళం,
సెల్ : 9493435649.
**
పద సంపద

మనిషికి కావాలి సంపద
మణులై కురవాలి సంపద
తరిగిపోనిదీ సంపద
కరిగిపోనిదీ సంపద
వదలిపోనిదీ సంపద
కదలిపోనిదీ సంపద
ఎవరెత్తుకు పోలేని సంపద
ఎత్తుకు చేర్చేటి సంపద
సర్వం అందించే సంపద
స్వర్గం చూపించే సంపద
ఈ నా పద సంపద

- జె. బి. తిరుమలాచార్యులు,
శ్రీనివాసకాలనీ, సాలూరు,
విజయనగరం జిల్లా - 535591.
**

బ్రతుకు పాఠం

ఉత్తేజం ఊపిరిగా అలుపెరగని ప్రయత్నం
తీరంలో హోరెత్తించే అలల ప్రతియత్నం
అది యిదియని భేదమెరుగని సమానత్వం
అన్నింటా స్పృశిస్తూ వ్యాపించేటి గాలితత్వం
ఎరుపేదో నలుపేదో బట్టబయలు చేయు కాంతి
జ్ఞాన మార్గదర్శియయి వెడలుగొట్టు మన భ్రాంతి
కాలిస్తే ఇటుకయ్యె, తడిపేస్తే మొలకయ్యె
సకల జీవరాశులకు మట్టియే ఆధారమయ్యె
విషంమింగి జనులకొరకు అందించు ఆమ్లజని
త్యాగ గురొపు చిరునామా తరువు చలువ కడాని
పసిసెలయేరు కాస్త యువనవనదియాయె
గంభీరపు ప్రవాహంతో సాగరాన మిళితమాయె
మనసు అలలు అలుపులేక ఉత్తేజితమవ్వాలి
మనతత్వం గాలివోలె సమానత్వ మెరుగాలి
సత్యానికి త్రోవ చూపు కాంతి మనం పొందాలి
మట్టివలె సమ్మతించు సహనమనే దుండాలి
తరువులోన త్యాగగుణం లేశమైన ఉండాలి
ఈజీవనయాత్రకు అంతముండునని యెరగాలి
అనంత కీర్తి సంద్రాన మనం భాగమై మిగలాలి.

- చావలి శేషాద్రి సోమయాజులు
**

ఓ భూమాతా క్షమించు

తల్లి కడుపు నుండి
నేలపై పడగానే
నీ మీదే పడి, పాకిరి, నడచి
ఇంతవాళ్లమయ్యేము
నీగాలి పీల్చి - నీ నీరు త్రాగి
నీ పైరు పంటలనే - తిని
మనుగడ కోసమై అడవులు నరికేసి
పర్వతాలు పెకిలించి
విషపు ప్లాస్టిక్కులను
నీ గుండెలో - కప్పేసి
రసాయనాలు వెదజల్లి
పండంటి భూమిని
ఎడారిగా మారుస్తున్నాం
గగనాన పొగ కాలుష్యాలు నింపి
ఓజోన్‌ను లేపుతున్నాం
మలినాలతో జలకాలుష్యం చేస్తున్నాం
భూతాపాన్ని పెంచుతున్నాం
కనులు తెరచాము -
కాలుష్యాలను ఆపి
జలవూటలను వృద్ధి చేసి
నీటి గుంటలు తవ్వి
వాన నీటిని ఒడిసి పట్టి
చెరువుల పూడిక తీసి
చెలమలను పరిరక్షించుకుని
నీటి పొదుపు నేర్చుకుని
వృక్షాలను నేస్తాలను చేసుకుని
పర్యావరణాన్ని పరిరక్షించుకుని
నీ కోపాన్ని తాపాన్ని
తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం
భవితకు పునాదులు వేసుకుంటున్నాం
ఓ ధరణీ లలామా! క్షమామణీ!
ఓభూమాతా! మమ్ము క్షమించు!
మానవాళిని - రక్షించు!

- విద్వాన్ ఆండ్ర కవిమూర్తి,
అనకాపల్లి.
సెల్ : 9246666585.