విజయవాడ

నాడలా.. నేడిలా! (చిన్న కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జానకమ్మకి మూడు పదులు నిండకుండానే వైధవ్యం వచ్చింది. ఒక్కగానొక్క కూతురిని కళ్లల్లో పెట్టుకుని పెంచి పద్దెనిమిదేళ్లు నిండగానే తమ్ముడికిచ్చి పెళ్లి చేసింది. మగపిల్లలిద్దరిని (కవలలు) ఇచ్చి, పాతికేళ్లు నిండకుండానే ఆమెను వదిలి పైలోకానికి వెళ్లిపోయాడు. ‘తల్లి వారసత్వమే.. తల్లి, బిడ్డలిద్దరూ దురదృష్టవంతుల’ని అగ్రహారం తీర్మానించింది. జానకమ్మ ధైర్యంగా మనవలని క్రమశిక్షణతో పెంచి తొమ్మిదేళ్లకే వారిద్దరికీ ఉపనయనం చేసి చిన్నజియ్యరుకి అప్పగించింది. పదేళ్ల తరువాత విద్యలన్నీ అభ్యసించి తిరిగి వచ్చారు. వారిద్దరికి రామాలయం, ఆంజనేయస్వామి కోవెలలను అప్పగించారు. బ్రహ్మతేజస్సుతో వెలిగిపోయే వారి ముఖాలను చూసినవారికి చేతులెత్తి నమస్కరించాలనిపించేది గుడికొచ్చిన భక్తులకు. పెద్దపెద్ద పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, డాక్టర్లు, లాయర్లు వారిని ఆహ్వానించి తమ గృహం పావనమైందని మురిసేవారు. ‘రత్నాల్లాంటి బిడ్డలను కన్నారు. మీ తల్లీకూతుళ్లు చాలా అదృష్టవంతుల’ని వచ్చిన భక్తులు పొగుడుతుంటే.. ‘అప్పుడలా! ఇప్పుడిల్లా!! కష్టాలొచ్చినప్పుడు కుంగిపోకుండా ధైర్యంగా నిలిచినందుకే ఇప్పుడీ ప్రశంసలు’ అంటూ ఆనందంగా బిడ్డలను దగ్గరకి తీసుకున్నారిద్దరూ!

- వేమూరి రాధాకృష్ణ, ఎంబిఏ, విజయవాడ.