రాజమండ్రి

పరిమళించిన గ్రంథాలయ కుసుమాలు (పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రంథాలయాలు వౌన విశ్వవిద్యాలయాలు. చైతన్య స్ఫూర్తికి, విజ్ఞానానికి, వికాసానికి గ్రంథాలయాలు సోపానాలు. గ్రంథాలయోధ్యమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా గ్రంథాలయ సంఘం తాజాగా ప్రచురించిన ‘గ్రంథాలయ కుసుమాలు’ కవితా, కథా సంకలనం ఆకట్టుకుంటుంది. మహమ్మద్ రఫీ (ఈవేమన), డబ్బీరు శ్రీనివాసరావు సంపాదకత్వాన విడుదలైన ఈ పుస్తకంలో 35 కవితలు, 7 కథలకు స్థానం కల్పించారు. పాఠశాల విద్యార్థుల రచనలకు ప్రోత్సాహం కల్పించారు.
బాలలు తమ కలాలకు పదును పెట్టి రాసిన కథలు, కవితలు ఆకట్టుకునేలా ఉన్నాయి. కథల విషయానికి వస్తే అన్నీ బాగున్నాయి. తగిన మార్గదర్శకత్వం ఉంటే ఈ బాలలంతా మంచి కవులుగాను, కథకులుగాను రాణించగలరని చెప్పొచ్చు. ‘తెలుగుభాష గొప్పదనం’ శీర్షికన విద్యార్థిని కె. కుసుమ రాసిన కవితలో ‘పల్లెపాటలే ప్రబంధ వాటికలలో/కవికి బాహ్యరాలు చదివించింది తెలుగు’ అని రాసింది. నేతింటి నవీన్ అనే విద్యార్థి ‘మా బడితోట’ శీర్షికన రాసిన కవితలో ‘మా బడిలో ఉంది తోట/పోస్తాం దానికి నీళ్లు ప్రతిపూటా/వింటాం కమ్మని కోయిలమ్మ పాట/తింటాం తోటలోని తియ్యని సపోటా అని రాస్తూ తోటల పెంపకం వల్ల కలిగే లాభాలను చక్కగా వర్ణించాడు. ఎన్. రాకేష్ అనే విద్యార్థి ‘అమ్మప్రేమ’ కవితలో ‘అమ్మంటే ప్రేమ/ప్రేమనే మాటకు అర్ధం అమ్మ’ అంటూ తల్లిని గురించి చక్కగా అభివర్ణించాడు. వై. గౌతమి అనే విద్యార్థిని ‘మన చదువు’ అనే కవితలో ‘ ఏది మంచి ఏది చెడు ఏది న్యాయం/ ఏది అన్యాయం ఏది ధర్మం ఏది అధర్మం/తెలుసుకునే విచక్షణే చదువు/కారు చీకట్లో చిరుదీపం మన చదువు’ అని రాసింది. వీటితో పాటు మహమ్మద్ రఫీ రాసిన గ్రంథాలయం కవితలో అక్షరం గర్జిస్తే అంధకారాన్ని తొలగించి/అధ:పాతాళానికి తొక్కేయగలదు/జడపదార్థాన్ని కూడా కరిగించి/కదిలించగల సత్తా గలది అక్షరం’ అని రాశారు. వెలగా వెంకటప్పయ్య, రమణయ్య, హరిసర్వోత్తమ్ కలలకు ప్రతిరూపం ఈ పుస్తక భాండాగారం అంటూ ఆ మహానుభావులను కీర్తించారు ఈ పుస్తకంలో. కథల విషయానికి వస్తే రైతు తెలివి అనే కథలో తెలివితో ఏ పనినైనా సులభంగా పరిష్కరించవచ్చు అనే సందేశాన్ని ఇచ్చారు. కోతుల కథలో అందని వాటి కోసం ఆశపడరాదు అనే సందేశం అందించారు. ఈ పుస్తకాన్ని చదవాలని ఆశించేవారు 7893451307 అనే నెంబర్‌లో సంప్రదించాలి.

- చందన రవీంద్ర,
సెల్ : 9492118960
**
జ్ఞాపకాలే ఊపిరిగా
స్మృతి కవిత్వం

మాస్టారు నాకు ముందు, నా వెనుక అంతులేని ధైర్యం, ప్రసంగ కావ్యాలు పాతవే, ప్రసంగించిన అంశాలు కొత్తవి. అద్దేపల్లి వారి స్మృతికి ఈ కవిత్వం జ్ఞాపకాలే ఊపిరిగా అంటున్న ఎస్. ఆర్. పృధ్వి హృదయ లోతుల్లో నుండి ఆత్మీయంగా వెలువడి, అంతరంగాన్ని అక్షరాలలో ఆవిష్కరిస్తాయి. ఇద్దరి మధ్య సాగిన సాహితీ సభలు, పలు వేదికలపై సాగిన సాహిత్యోపన్యాసాలు, పుస్తకావిష్కరణలు, కవి సమ్మేళనాలు, ప్రముఖుల సన్మానాలు అన్నీ కళ్ల ముందు సాక్షాత్కరింపజేస్తూ వారికే ఈ కావ్యాన్ని అంకితం చేసిన సహృదయత వారి మధ్య సాగిన అంతరంగ సాహితీ నేపథ్య ఆత్మీయ బంధాన్ని తీపి గుర్తుగా నిలుస్తూ ఎందరో యువ కవులకు ఆదర్శమార్గాన్ని అవలోకింపజేస్తుంది. అద్దేపల్లి వారిని కవిగా, వక్తగా, విమర్శకునిగా, వినయశీలిగా, సాహితీవేత్తగా, సామాజిక విజ్ఞాన రచయితగా వారి సుదీర్ఘ సేవలను శ్లాఘిస్తూ సాగిందీ కావ్యం. ఆయన ఒక మానవతావాది. సాహితీ బృందావనం. రాయల నాటి భువన విజయంలో పెద్దనలా వెలుగొందిన విజ్ఞాన విపంచి. విలువల వెలుగు. కవితా ప్రపంచంలో అక్షరాల అడుగులు వేసేందుకు నడక నేర్పిన మార్గదర్శి. ఎవరి కవితాశక్తి ఎంతుందో నిక్కచ్చిగా కొలవగల అత్యాధునిక తూనికయంత్రం. వారి పలుకుల కుసుమాల్లోంచి తేనెచుక్కలు చిందుతాయన్న వాస్తవాన్ని వెల్లడిస్తారు పృధ్వీ. ఆయనతో గడిపిన కాలం మధురాతి మధురం. అది మరపు రాని వైనం. మరువలేని యానం. గడియారంలో ముళ్లు ఎక్కడివక్కడే ఆగిపోతాయి ఆయనతో మాట్లాడు వేళ. ఆయన చూపు పడిన వాడు కవి అయి కాలాన్ని నిలదీస్తాడు. విమర్శకుడై వ్యవస్థని వెలువరిస్తాడు. ఆయనో అక్షర కర్మాగారం. హృదయానికి హత్తుకునే తత్వం. సభ ఏదైనా కావచ్చు అందులో నవ్యతను నింపడం అద్దేపల్లికే సాధ్యం. అన్నింటికీ కేంద్రబిందువు. విశ్వనాథ ప్రేరణతో వారికి సంప్రదాయం తొలి అడుగులైనాయి. అవి నిత్యం సాహితీ సౌరభాలను వెదజల్లుతూనే ఉంటాయి. ఆయన్ని తలచుకున్నప్పుడల్లా వేదన కంచుగంటై మోగుతుంది యెదలో పదిలంగా అంటారు పృధ్వీ. వారి సాహచర్యంలో గుణసౌందర్యంతో పాటు, కవతా మాధుర్యం తోడై నిలుపుకున్న పృధ్వీని ఓదార్చి సానుభూతినందిద్దాం. అద్దేపల్లి ఆశయాన్ని కవిత్వ దిశలో కొనసాగించాలని కోరుకుందాం.

- చెళ్లపిళ్ల సన్యాసిరావు, సెల్ : 9293337394