రాజమండ్రి

వందన మూర్తి (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలాన్ని పరీక్షించడం
సాధ్యంకాదు
పరిశీలించడం
సాహసం కాదేమో!

ప్రకృతిలో పరవశించడం
మోహనమో కాదో కాని
ఆరాధించడం, ఆరాటపడటం
పాపం కాదు

సహానుభూతిని వ్యక్తం చేయడం
మనిషితనం
సాయమించకపోవడం
చేయూతను ప్రకటించకపోవడం
మానవీయం అన్పించదు

స్నేహంలో ఒరిగిపోవడం
సేవా పరాయణతతో
సాగిపోవడం
మానవతకు మించిన
మహోన్నతత్వం
మరొకటి ఏమి ఉండదు
జ్ఞానం పంచినపుడే
జీవితం విలువ పెరుగుతుంది
గడించిన అనుభవ సారం నుంచే
బ్రతుకు గమనం మొదలవుతుంది
గుణించిన కష్టాలు
భాగించిన సుఖాలు
మనసును దృఢతరం చేస్తాయి

అనేక అంతరాల సంగమం నుంచి
స్వాభావిక చింతనల్ని స్వాగతించవు
స్వయం ప్రకాశిత నిర్ణయాలను
చిగురింప చేస్తుంటాయి
నవసమాజ రీతులను ప్రతిబింబించవేమోకాని
సమసమాజ కాంక్షలను ప్రస్ఫుటింపచేస్తాయి

హాలాహలాన్ని మింగి
కాలాల్ని దాటి
శీలంపై నింద లేసుకొని
నిశ్చలంగా ప్రవహించే
నందన వందనమూర్తులు
మనలో సైతం ప్రవేశిస్తుంటారు
మనలను కూడా ప్రభావింప చేస్తుంటారు

- రవికాంత్, సెల్: 9642489244
**

ఎడారి ఆనందమే
వేడుకగా...

సూర్యుని తొలికిరణం కాంతికన్నా
నీప్రేమ కాంతి ముందుగా
నాకు తాకి గిలిగింతలు పెడుతుంటే
ఇక సూర్యుడు ఎందుకులే అనిపిస్తోంది
కారుచీకటిలో కూడా ప్రసరించే
అంతులేని నీ ప్రేమకాంతి
తోడుగా వుంది అనుకోగానే
జీవితంలో జనించిన విషాదం
వినమ్రంగా తలవంచి ప్రణమిల్లి సాగిపోతోంది...
హృదయంలో నిండిన నీకాంతి జ్వాలలకు
వెనె్నలకాంతి కూడా వెలవెల పోతోంది
ఆమని లోని వసంతంకన్నా
ఎడారి ఆనందమే వేడకగా ఉందని చెప్పాలని వుంది
తొలకరి చినుకుల జల్లుల్లో తడవటంకన్నా
నీ తలపుల కడలి కెరటాల జోరులో
కొట్టుకుపోవటమే హాయిగా వుందని ఎలా తెలుపను?

- చోడవరపు వెంకటలక్ష్మి
శ్రీకాకుళం. సెల్: 9493435649.
**
అందమైన బాల్యం

అందమైన బాల్యం
తిరిగి రానిది మరుపు రానిది
తీయనైనది హాయియైన బాల్యం!
కులాలు తెలియనది మతాలు ఎరుగనది
హద్దులు - లేవన్నది సున్నితమైన బాల్యం!
దాపరికాలు లేనిది ద్వేషాలు ఎరుగనిది
మోసాలు తెలియనిది
మధురమైన బాల్యం!
ఏది చెప్పినా వినేది
ఎవరు పిలిచినా పలికేది
ఎక్కడైనా మారనిది
ముచ్చటైనా బాల్యం!
ఆటలలో ఆడేది
పాటలలో కదిలేది
కథలకు ఊకొట్టేది
మాటలకు మైమరచేది
మురిపెమైన - విలువైన బాల్యం!

- జి.కృష్ణకుమారి
బాబామెట్ట, విజయనగరం.
సెల్ : 9441567395.
**

పులకిత గోదావరి

ఆ: శ్రీలు సంపదలును చిందించు గోదారి
అంత్య పుష్కరముల నలరెనిపుడు
పుణ్య స్నానములకు గణ్యతనొందిన
భక్త జనములంత పరుగునలరె

పూజా ద్రవ్యములును పుష్పములన్నియు
గోదారి పూదారికోసమంచు
పిండ ప్రదానమ్ము ప్రీతిగజేయుచు
దండిగ విప్రులు దానమొంద

తీ: సేవ జేయుట భాగ్యమ్ము చిన్ని వయసు
చేవ జూపిన విద్యార్థి సేవలకును
అమ్మ గోదారి పులకించెకమ్మగాను
జనము సంద్రమ్మువలెనుండె ఘనము సుమ్మి!

క: హారతులిచ్చిరి గౌతమి
ధీరత జాడంగమేను తీయగ మారున్
భారతీ మందున ధర్మము
తారావళి దాకునయ్య తన్మయమలరన్!

- సుధా శశిరేఖ
సెల్: 9441599321