నెల్లూరు

సైనికా నీకు సలామ్..! (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎముకలు కొరికే హిమపవనాలు
గగనపు ఛత్ర ఛాయలో
అనుకోని ఆపదలా వచ్చే తుహిన తుఫానులైన
వేడిగాలులు విరజిమ్మే ఎడారులైన
కదనానికి కవ్విస్తూ
వికృత చేష్టలు చేసే వైరిసేనకు
వెన్నులో వణుకు పుట్టిస్తూ
వగవక, వెరవక
కార్యదీక్షాపరుడవై
తలిదండ్రుల మమతలను
భార్యాబిడ్డల ప్రేమానురాగాలను
ఎదగదిలో పదిలపరిచి
బ్రహ్మచారిలా జీవిస్తూ
సైనిక మిత్రకోటితో మమేకమై
సరిహద్దులనే నేత్రాలుగా మలచి
కుల, మత, ప్రాంతీయతలకు అతీతంగా
నిర్వీర్యమైన యువతకు ఆదర్శంగా
భరతమాత రక్షణే ధ్యేయంగా
అహర్నిశలు కంటికి రెప్పలా కాస్తూ
ప్రకృతి వైపరీత్య సంభవ సమయాన
జనులకు అండగా నిలిచి
ధీరుడవై, వీరుడవై
ఆపన్న హస్తం అందిస్తూ
మునుముందుకు నీ గమనం సాగిస్తూ
నరమేధం సాగించే నయవంచక
ఉగ్రభూతాలను ఛిద్రం చేసే
ఓ వీరసైనికుడా!
సాధించావు ఘనత
ఈ జాతి మరువదెన్నడు నీ చరిత
అర్పిస్తున్నాం నీకు మా ప్రణత
అయినదిలే నీ జన్మ ధన్యత.

- ఆడేరు చెంచయ్య
నాయుడుపేట. చరవాణి : 9492331449
**
చిన్నబోయిన చెప్పు

కోట్లతో టికెట్ కొని
మరిన్ని నోట్లతో ఓట్లు కొని
ప్రజాధనం లూటీ చేసే
నాయకుడొకడు పెట్టాడు మీటింగ్
కడుపు కాలిన వాడొకడు
కాలి చెప్పు విసిరాడు
ఆ చెప్పు గాల్లో వేగంగా దూసుకుపోతూ
‘‘ఓరి కృతఘు్నడా!
ఎంత పనిచేశావురా! యిన్నాళ్లూ
నీ పాదాలనంటి రక్షణ యిచ్చిన నన్ను
ప్రజాభక్షకుడ్ని తాకమని పంపావా?
అంత తక్కువై పోయానా నేను నీకు!
అంటూ నాయకుడ్ని తగలకనే
పక్కన పడిపోయింది చిన్నబోతూ...

- జి.బాలానంద్, నేతాజినగర్, నెల్లూరు
**
ఉగ్రవాదులారా... ఖబడ్దార్!

అతివాదం - తీవ్రవాదం - ఉగ్రవాదం
అదేకదా! పొరుగు దేశ పైశాచిక - మతోన్మాదం
మానవ మృగాల మృత్యుహేల - ఉగ్రవాదం
సామూహిక జన హవనం - ఉగ్రవాదం
అసురీ శక్తుల విజృంభణే - ఉగ్రవాదం
అది మిన్నాగు లాంటిది - పరమ కిరాతకమైనది
అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతూ,
ప్రాపంచిక భ్రమలతో - అకృత్యాల పాపరాశిని
మూటకట్టుకోవడమే - ఉగ్రవాదం
అర్థం, పరమార్థం ఏదీ లేనిది - ఉగ్రవాదం
ఏ కులమైనా! ఏ మతమైనా! ఏ దేశమైనా!
అందరం - ఈ భూమాత బిడ్డలం
ఈ భూమిని, పంచభూతాలను
అనుభవిస్తూ జీవించే సహోదరులం
ఈ అవనిలో ప్రకృతినే దైవంగా భావించే
ఏకైక జాతి - మన భరతజాతి
ఇంతటి మహోత్కృష్టమైన, మహిమాన్వితమైన
భారతావనిపై అపశృతులు పలికించి
అల్లకల్లోలం సృష్టించే విశ్వమానవాళి
వినాశ శక్తులారా! ఖబడ్దార్!
నోరు మెదపని రోజులు పోయాయి
సింహాన్ని రెచ్చగొడితే - ఏం చేస్తుందో
చేసి, చూపించే రోజులు వచ్చాయ్
తస్మాత్ జాగ్రత్త!

- కొడవలూరు ప్రసాద్‌రావు
పూలతోట, గూడూరు
చరవాణి : 8500757622