దక్షిన తెలంగాణ

దైవత్వం హర్షిస్తుందా? (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్నతల్లి తన పాలామృతాన్ని
త్రాగించకుండా జోలపాటతోనే
ఏడ్పును మాన్పింపచూస్తే
నవ్వుతూ శిశువు నిద్రలోకి జారుతుందా?
ఆత్మహత్యల నివారణోపాయం చూపక
కవులు రైతులకై సానుభూతి కవిత్వం వ్రాస్తే
వారి కష్టం తీరుతుందా?
ఆత్మస్థైర్యం సిద్ధిస్తుందా
యువత తమ సంస్థకు బలమని
పొగడ్తలతో సరిపుచ్చితే
నవతరానికి బ్రతుకుపై ఆశ చిగురిస్తుందా?
నాయకత్వంపై నమ్మకం కలుగుతుందా?
అప్పటి రాక్షసుడి బొమ్మను
దహించి సంతృప్తిపడుతూ
ఇప్పటి ఉగ్రవాది రాక్షసుడిని ఉపేక్షిస్తే
భూమిమీద మనుజులకు
ప్రశాంతత లభిస్తుందా!
ఎదుటనే దేహి యంటున్నా
బిచ్చగాళ్ల నాదరించక
జగత్తంత దైవ స్వరూపమెనని మురిస్తే
ఆ దైవత్వమే హర్షిస్తూ కరుణిస్తుందా?
మానవత్వం అనిపించుకుంటుందా?

- తోట సదానందము, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లా, సెల్.నం.9908594669
***
వెండికొండ!

విశ్వంలో
మన క్రీడాకీర్తి పతాకాన్ని ఎగురవేసి..
వెండికొండగా నిలిచిన
పి.వి.సింధు..
మనందరికీ గర్వకారణం!
ఆమె ఆటలో ఆణిముత్యం!
ఆమె తప్పక..
ఇంకా పెంచుకుంటుంది నైపుణ్యం!
రాబోయే పోటీల్లో..
‘బంగారు కొండ’ను
అధిరోహించడం ఖాయం!
మనందరం తెలుపుదాం అభినందనలు
అదే ఆమెకు కొండంత అండదండలు!

- ఆర్.పోచయ్య
బెల్లంపల్లి, ఆదిలాబాద్ జిల్లా
**
ఇంతలోనే..!

సామాన్యున్ని సైతం
మంత్రముగ్ధులను చేసి..
పాటకు పట్ట్భాషేకం చేసి
ఉద్యమానికి ఊపిరిపోసి..
గీతానికి కొత్త సొబగులద్ది
తెలుగు పాటను ఎల్లలు దాటించి
మా హృదయాలను దోచిన..
ఓ ప్రజాకవీ!
మా గూడు వదిలి..
మా కలలు కల్లలు చేసి
కానరాని లోకాలకు
వెళ్లిపోయావా?
ఓ ‘గూడ అంజన్నా!

- నల్లగొండ రమేష్
ఆసిఫాబాద్, కొమురం భీం జిల్లా
**
ఓ ప్రియతమా!

ఓ ప్రియతమా!
నన్ను కలుసుకోవాలని
చాలాకాలం పిదప నువు నా దగ్గరగా
ఎందుకు వస్తున్నావో నాకు తెలియదు!
కానీ మిత్రమా!
నీ అడుగుల సవ్వడి మనోహర పరిమళమై
నన్ను స్పృశించి పులకరింపజేస్తోంది!
రాగ రంజితమైన సరస్సులో
విరబూసిన కలువ పూలవోలే
నక్షత్రాల వలె వెంటాడే నీ చూపులు
నా స్మృతిపథంలో కడలి కెరటంలా..
నర్తనం చేస్తున్నాయి!
నన్ను చేరుకోవాలన్న
అంతులేని నీ తపనచూసి
మూగవోయిన నా జీవన వేణువులో
కమనీయ దృశ్యమేదో కదలాడుతుంటే..
తడియారని బంధంలా
నా ఆశల హరివిల్లులో
కోరికలు పురివిప్పుకున్నాయి!
ఊహలోకాల్లో విహరింపజేస్తున్నాయి.
కనురెప్పల మైదానాలపై
మన జీవన చిత్రాన్ని ఊహిస్తూ
ఆకుపచ్చని ఆశనై
నిన్ను చేరుకోవాలని
నా గోరువెచ్చని ఊపిరితో
నీకు స్వాగతం పలుకుతూ
నీతో జత కలిసే క్షణాలు దగ్గరవ్వడంతో..
ఇంత కాలపు వేదనను మరిచిపోయా!
కడపటి సూర్యకాంతి
రాత్రిలో కలిసినట్లు..
నీ ప్రేమైక సామ్రాజ్యంలో
కొలువుదీరాలని
ఆత్రంగా ఎదురుచూస్తున్నా!

- టి.సుధాత్రి
నిజామాబాద్
సెల్.నం.8686961611
**
చిగురు మొక్కనై..!

అల్లిబిల్లి తారలతో
ఆకాశం అల్లుకుందేమోకాని
నా మనసు కాదు
బాహ్య ప్రపంచమంత
చీకటి అలుముకుందేమోకాని
నా ఆత్మకాదు
పచ్చదనమంతా నేడు మోడువారి
ఎండిపోయిందేమో కాని
నా హృదయం కాదు
బంధాలు, అనుబంధాలు
చచ్చిపోతున్నాయేమోకాని
మానవ సంబంధాలు కాదు
పూలు పుష్పించి ఎండిపోతుంటాయి
ఫలాలు కాచి పండిపోతుంటాయి
కాని నేను నేనుగా ఉండాలని
శాసించె శక్తిగా ఎదగాలని
పుడమి మీద
నా ఉనికి చిరకాలం నిలవాలని
ప్రకృతితో నా స్నేహం
కలకాలం వుండాలని
అనంతమైన ఆలోచన తెంపరలతో
నిరంతరం చిగురుమొక్కనై..

- రాజేశ్వరి బొమ్మిదేని
పెద్దపల్లి, పెద్దపల్లి జిల్లా
సెల్.నం.9160908045
***
అమ్మకానికి కీర్తి!

ఒకప్పుడు కీర్తి.. ఆత్మగౌరవానికి స్ఫూర్తి
ఇప్పుడు.. అమ్మకానికి ఆస్తి!
తధాస్తు దేవతలున్నంత కాలం
వరాలిచ్చేది పూజారులే!
ప్రతిభకు కొలమానాలు లేనప్పుడు
పురస్కారాలు ఏపాటి!
అడపా తడపా తెరుచుకునే
పురస్కార గవాక్షాలు
గుమిగూడే జన సందోహాలు
‘బ్లాకు మార్కెట్’ దెబ్బతో కుదేలు!
ఏలిన వారి దయాదాక్షిణ్యాలు
తోడేళ్ల ప్రజాస్వామ్యంలో
పారితోషికాల పరిహాసాలు
నేడు ప్రజ్వరిల్లుతున్న
రాజస ప్రహసనాలు!
తాకట్టుకు వ్యక్తిత్వాలు
ధడావత్తుకు బానిస బుద్ధులు
బ్రతికున్న శవాలకు అలంకరణలు!
చాపకింద నీరులా తీరుతెన్నులు
రాష్ట్రీయ, జాతీయ పురస్కారాలు
తెరవెనుక బాగోతాలు!

- ఆచార్య కడారు వీరారెడ్డి
హైదరాబాద్
సెల్.నం.7893366363
**
మాట!

మాట కోసమే కదా శ్రీరాముడు
సకల సౌక్యాలు కాదని అడవికెళ్లింది
మాట కోసమే కదా నిండు గర్భిణీ సీతను
అడవికంపి తను అలమటించింది
మాట కోసమే కదా పాండవులు
దృపద కుమారిని పంచుకున్నది
మాట కోసమే కదా బలి చక్రవర్తి
వామనునికి తలవంచి వాసిగాంచింది
మాట కోసమే కదా సత్కహరిశ్ఛంద్రుడు
భార్యాబిడ్డలనమ్మి అప్పు తీర్చింది
మాట కోసమే కదా రక్తబంధాన్ని కాదని
కర్ణుడు - కౌరవుల పంచన జేరింది
మాట కోసమే కదా ధర్మజుని వెంట
పాండవులు వనవాసమేగింది
మాటే నాటి మనుగడకు మంత్రమయ్యింది
పుడమిపై వరహాల సద్దన్నం మూటైంది
వర్ధిల్లింది వేన వేల సంవత్సరాలై
నాటి మాట నాడేపాయే గతం గతః
నోటి మాటకైన నోచుకోని స్థితి నేటి దుస్థితి
మాట ఆత్మీయ పలకరింపునకు
అనురాగాన్ని జోడించి అల్లుకుంటుంది
మాట మగువల మనోభావాలు
మల్లెపందిరై మనసుల్ని అల్లుకుంటుంది
మాట ప్రేమికుల కలయికకు బాటై
జీవితాన వసంతాలు పూయిస్తుంది
మాట జారితే మనుగడ శూన్యం
మనసు మారితే మనగలగలేం!
అందుకే.. గుండె గాయాల్ని చేయొద్దు
మాటతో జన్మజన్మల అనుబంధాల్ని తుంచొద్దు!

- బోనగిరి రాజారెడ్డి, మంచిర్యాల జిల్లా కేంద్రం, సెల్.నం.9701381944
**

న్యాయ దేవత

న్యాయదేవతను చూస్తుంటే..
నా హృదయం మయూరీలా
పురివిప్పి పులకిస్తోంది!
గుడిస్తంభంవోలే
న్యాయం ఎప్పుడూ
ఒకే తీరుగా వుండదు!
జూలు విదిల్చిన సింహంవలె
ధర్మం తప్పినప్పుడల్లా
మారుతూ వుంటుంది!
సమసమాజ సమన్యాయం కోసం
గాంధారిలా..
న్యాయదేవత తన కళ్లను
బంధించుకొని వుంటుంది!

- ఆవుల లక్ష్మీరాజం
సుల్తానాబాద్, పెద్దపల్లి జిల్లా
సెల్.నం.9849588453