దక్షిన తెలంగాణ

అమ్మకు ప్రేమతో.. ‘దాసోజు’ భావకుసుమాలు! (పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతులకు:
డాక్టర్ డి.పద్మావతి
ఫ్లాట్ నం.301
సప్తగిరి హైట్స్
సాయినగర్ కాలనీ
ఇసిఐల్ (పోస్టు)
కుషాయిగూడ
మేడ్చల్ జిల్లా
సెల్.నం.944128679
**
కొన్ని నెలల క్రితమే కవయిత్రి డాక్టర్ దాసోజు పద్మావతి ‘కవితా సుమాలు’ గ్రంథాన్ని వెలువరించి సాహితీ లోకానికి పరిచయమయ్యారు. వృత్తిరీత్యా గురుకుల కళాశాలలో అధ్యాపకురాలుగా పని చేస్తున్న ఆమె.. రచనా వ్యాసాంగాన్ని ప్రవృత్తిగా మలచుకొని.. తమ సృజనను చాటుకుంటూ.. ఆమె రెండో గ్రంథంగా ‘అమ్మకు ప్రేమతో’ వచన కవితా సంపుటిని ఇప్పుడు పాఠకులకు అందిస్తున్నారు. జాతీయభావాలు.. రమణీయ భావ కుసుమాలు..అమాయకపు వ్యక్తిత్వం వంటి అంశాలు ముప్పేట అల్లుకు పోయిన ఈ గ్రంథంలో 25 కవితలున్నాయి.. చివరన కొన్ని నానీలు దర్శనమిస్తాయి..అక్షరాల నిండా అమ్మ ప్రేమను, ఔన్నత్యాన్ని చాటేందుకు ఆమె చేసిన ప్రయత్నం అభినందనీయం. ఈ కవితల్లో కవయిత్రి యొక్క లోక పరిశీలన కానవస్తుంది. అంతేగాక.. సామాజిక చైతన్యం కోసం ఆమె పడే ఆరాటాన్ని గమనిస్తాం.. కవయిత్రి పద్మావతి తమ అమ్మ కీ.శే.దాసోజు వజ్రమ్మ గారికి ప్రేమతో అంకితమిచ్చారు. జీవన సంధ్యా సమయంలో కన్నవాళ్లను కంటి పాపల్లా చూసుకోవాలని మొదటి కవితలోనే కాంక్షించారు. సృష్టిలో ప్రతీది త్యాగమయమేనంటూ.. ప్రాణమిచ్చిన అమ్మతో పాటు.. స్వేచ్ఛావాయువులు అందించిన స్వాతంత్య్ర సమరయోధులు, దేశంకోసం అమరులయ్యే సైనికులు..ఇలా అంద రూ త్యాగధనులేనంటూ రాసిన కవిత అందరినీ ఆకట్టుకుంటుంది.
స్వేచ్ఛ్ఫాలాలు ప్రతి ఒక్కరికే అందిననాడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లు భావించాలని మరో కవితలో పేర్కొన్నారు. మనసు మలినాన్ని కడిగే అమృత బిందువులు కన్నీళ్లనీ, కన్నీళ్లు ఆర్ద్ర హృదయ సంకేతాలుగా ‘బాష్పాలు’ కవితను తీర్చిదిద్దారు. వివాహబంధం గురించి ‘పరిణయం’ కవితలో చక్కగా ఆవిష్కరించారు. పరిణయమంటే.. స్వర్గంలో పడిన బంధమనీ.. ఇలలో మూడుముళ్లతో ఒక్కటయ్యే అనుబంధమని పరిణయం.. ఓ ప్రబంధమని తేల్చి చెప్పారు. ‘వాలుజడ’ కవితలో అతివల కురుల గురించి ప్రస్తావిస్తూ.. నవ్య నాగరికత ముసుగులో ఆడవాళ్ల కురులు కురచ పడిపోతున్న తీరు పట్ల కవయిత్రి తమ ఆవేదనను వ్యక్తపరిచారు. మహిళలు స్వావలంబన దిశగా అడుగు లేస్తూ..ఆత్మగౌరవంతో తమకోసం తాము మనుగడ సాగించాలని సూచించారు. దీపం ఉంటే ధైర్యమనీ.. దీపం అంటే తేజోమయమనీ.. ‘దీపేన సాధ్యతే స్వరం’ కవితను మలిచిన తీరు బాగుంది. ‘దుప్పటి’ పేరుతో రాసిన కవితలో దుప్పటితో ఉన్న అనుబంధాన్ని అక్షరాల్లో బంధించారు. ‘శే్వతపత్రం’ కవితలో కవయిత్రి ప్రకటించిన భావాలు సృజనాత్మకంగా వున్నాయి! ‘నేలకు ఒరిగిన మ్రాను’ కవితలో చెట్టును ఉన్నతంగా చిత్రించారు. అలాగే.. ‘నా పల్లె’ కవితలో.. పల్లెను మమతానురాగాల ముల్లెగా, అమ్మ ఒడిని తలపించే కల్పవల్లిగా అభివర్ణించారు. పక్వమునకు రాని ఫలమైనా.. పరిణతి లేని మనిషైనా నిష్ఫలమేనని మరో కవితలో చక్కగా తెలియజెప్పారు. ఈ గ్రంథంలో ‘స్నేహబంధం’, ‘ఎవరు బిచ్చగాళ్లు?’, ‘యాది’ కవితలు కొలువుదీరాయి..చివరన ‘నానీలు’ వున్నాయి. నానీలకు సంబంధించిన నియమ నిబంధనలను, నిర్మాణ క్రమాన్ని కొన్ని నానీల్లో పాటించకపోయినప్పటికీ.. కవయిత్రి ఉత్తమ సంస్కారాన్ని అభినందించకుండా ఉండలేము! కవయిత్రి యొక్క రెండో కవితా సంపుటి కనుక..సహజంగానే పాఠకుల ఎక్స్‌పెక్టేషన్స్ కొంచెం ఎక్కువగా వుంటాయి.. పాఠకుల అంచనాలకు అనుగుణంగా కవిత్వంలో పరిణతి కనపడక పోయినప్పటికీ..సామాజిక చైతన్యం కోసం ఆమె పడే తపనను మెచ్చుకోకుండా ఉండలేము.

- సాన్వి, కరీంనగర్