రాజమండ్రి

వనె్న తగ్గని విప్లవ కిశోరం ‘్భగత్‌సింగ్’ (పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతులకు
యస్.బి.చౌదరి,
విజయా రెసిడెన్సీ-1,
54-4-7/6, శీలానగర్,
ఎ.వి.రోడ్,
రాజమహేంద్రవరం
**
సెప్టెంబరు అనగానే ఒక ప్రత్యేకత. అది పువ్వులకే కాదు, పుస్తకాలకు అని రుజువు అయ్యింది. ప్రకృతి పరిమళభరితం అవుతుంది పువ్వులతో. సాహితీ ప్రియుల హృదయాల్లో పుస్తకాల విడుదల ఒక నూతన ఉత్తేజాన్నితెస్తుంది. అలాంటి చైతన్యవంతమైన భారత దేశాన్ని ఉద్వేగభరితం చేసిన భగత్‌సింగ్‌పై రచయిత యస్.బి.చౌదరి చేసిన రచన ‘షహీద్ భగత్‌సింగ్’2 కొత్త ఆశల్ని రేపింది.
భగత్‌సింగ్‌పై ఎన్నో పుస్తకాలు, మరెన్నో కథనాలు, ఇంకా సినిమాలు నాటకాలు అవి ఇవీ మరెన్నో వచ్చాయి, వస్తాయి కూడా. రావాలి మరి ఎందుకంటే దేశభక్తి రాన్రాను కొరవడుతున్న పరిస్థితుల్లోకి వెళ్లిపోతుంది దేశం. దేశభక్తి క్రికెట్ ఆటలో ఒళ్లు విరుచుకుని పరుగెడుతుంది. నాలుగు బంతులు, ఆరు పరుగుల తేడాతో పాక్‌మీద గెలిస్తే చాలు జాతీయ జెండా బుగ్గల మీద, చెంపలమీద ముద్రలేసుకుని, బైక్‌లమీద ఊగిపోతూ కేరింతలు కొట్టే యువత అది దేశభక్తి అనుకుంటుంది. రహదారుల అంచుల చెంత హోరెత్తించే పాటల మధ్య దీనాతి దీనంగా దయామయపు చూపులకు చిక్కి సెల్యూట్ చేస్తుందని మాత్రం మన యువతకు తెలియజెప్పాలంటే... స్వాతంత్య్రం అంటే ఏమిటోనే కాదు, ఎలా సిద్ధించిందో, ఎంత రక్తం చిమ్మారో, ఎందరు ప్రాణాలు బలి అర్పణ చేశారో తెలియజెప్పాలి.
ఆ ప్రయత్నమే యువత దేశం వైపు మళ్లేలా అంతరంగాన్ని, ఆలోచనల్ని, ఉత్తేజకరం చెయ్యబూనటానికి భగత్‌సింగ్‌ను తెలియజెప్పడానికి జేసిన ప్రయత్నమే ‘షహీ ద్ భగత్‌సింగ్’. జరిగిన చరిత్రను మళ్లీ మన కళ్లముందు నిలిపిన అక్షరకావ్యం. స్వయంగా తాను చూచి, భగత్‌సింగ్ తల్లి, తమ్ముడుతో మాట్లాడి పొందిన అనిర్వచనీయ అనుభూతుల్ని అక్షరబద్ధంచేశారు. ప్రత్యక్షంగా ఆయా ప్రాంతాలు పర్యటించి, స్వీయానుభూతి విషయాలతో చెప్పిన చరిత్ర సంగతులు పుస్తకంలో ఉన్నాయి. అపరిపక్వ భావాలతో ఉద్రేక స్వభావంతో నిండిన నిర్ణయాలో, ఉద్రేక స్వభావంతో చేసిన చర్యలో చేసి ఉండలేదనే సత్యం బ్రిటిష్ పోలీసు అధికార్ల ఎదుట తానిచ్చిన రాత వాంగ్మూలం ఒక చారిత్రాత్మక సత్యాన్ని రుజువుచేస్తుంది. స్కాండల్‌ను చంపటం చిన్న సాంకేతిక లోపంతో జరిగినప్పటికీ, అసెంబ్లీలో బాంబు విసరడం వరకు పరిణతి కలిగిన విప్లవకార లక్ష్యాలను నిర్దేశించే క్రమాన్ని తెలుపుతుంది. తామెందుకు హింసామార్గాన్ని అవలంబించామో, తాము చేసే పోరాటం దేనిమీదో తెల్చిచెప్పడంలో అసలు సిసలు విప్లవ యోధుని లక్షణాలు భగత్‌సింగ్‌లో కనిపిస్తాయి.
రచయిత చౌదరి యవ్వనం నాటి ఉద్రేకాలు, వనస్థనిగా ఆనాటి ఉద్విగ్నతలు పొంది స్వాతంత్య్ర సమరంలో తాను పాల్గొనలేకపోయాననే కోరికను సఫలీకృతంచేసిన షహీత్ భగత్‌సింగ్‌ను, నలభై ఏళ్ల తర్వాత కూడా బయటపెట్టలేకుండా ఉండటమే ఈ రచన. దానినే ఈ నాటి యువతకు తానిచ్చిన సందేశం. మొన్న జరిగిన పాక్ సైన్యం మన సరిహద్దుల్లో మోహరింపుకాని, చొరబాటుతో యుద్ధవాతావరణాన్ని తలపించినపుడు సైన్యం నుంచి వచ్చేసిన సిపాయిలు తాము తుపాకీ పట్టి యుద్ధరంగంలో శత్రుసైన్యాన్ని అణచడానికి ఉవ్విళ్లూరడం దేశభక్తయుత ఆవేశం. అదే చేతనత్వం కనదరంగంలో కదలాడి శత్రువు దేశ పొగరుదించాలనే వీరత్వం ఉప్పొంగిన సమయం.
ఐదు దశాబ్దాలు దాచుకున్న సంగతులు, ఆనాడు లిఖించిన విషయాలు అప్పుడే చెప్పివుంటే తన తోటి యువతను కర్తవ్యోన్ముఖులను చేసుండేవారు. మరికొందరు దేశభక్తుల్ని అధ్యయనంచేసి వారి వివరాలు మనకు మరింత సమగ్రపరిచేవారు. చరిత్ర గ్రంథ రచయితగా ప్రముఖమయ్యేవారు. పేపరుమిల్లులో సోషల్ వెల్ఫేరు ఆఫీసరు ఉద్యోగ బాధ్యతలు అసలు కర్తవ్యాన్ని కూరుకుపోయేలా చేసుంటాయి. అయినప్పటికీ నేటి యువతలో సందేశాత్మకతను నింపడమే కర్తవ్యంగా యెంచడం పుస్తక ముఖ్య ఉద్దేశ్యం అయింది.
తాను చదువుకుంటానికి ఉత్తర దేశం వెళ్లినపుడు, తాను చదువుకున్న భగత్‌సింగ్ స్వస్థలాన్ని, ఆ కుటుంబీకుల్ని దర్శించుకొని ఎంత భావోద్వేగానికి గురయ్యారో పుస్తకాన్ని ఆసాంతం చదివితే తెలుస్తుంది. రచయితకు పరిశీలనా దృష్టి కాదు పరిశోధనా దక్షత ముఖ్యం కావాలి. అదీ కనిపిస్తుంది ఈ పుస్తకంలో.
భారతదేశ సంపూర్ణ స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం బలిదానం చేసిన త్యాగమూర్తులు, సదా మన మననంలో ఉండేలా వారి జీవితగాథలు, స్మరణ కథలు విరివిగా యువతకు అందించగలిగితేనే వారు స్ఫూర్తిదాయకమై నిలుస్తారు. అటువంటి బృహత్తర పనికి శ్రీకారం చుట్టిన రచయిత అభినందనీయులు. సమాజ అభ్యున్నతికి, దేశ ప్రగతికి సామాజిక చైతన్యం తెచ్చే రచనలు, అభ్యున్నతికి దేశప్రగతికి సామాజిక చైతన్యం తెచ్చే రచనలు బుచ్చయ్య చౌదరిగారి కలం నుంచి జాలువారాలని కోరుకుందాం.
**

ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net

- రవికాంత్, 9642489244