రాజమండ్రి

వశీకరణం (కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ట్రింగ్... ట్రింగ్... ట్రింగ్... ట్రింగ్
సెల్ మోగింది. కళ్లు నులుముకుంటూ...
ఎవరా అని పేరు చూసింది ఆమని. సెల్ నెంబరు మాత్రమే ఉంది. పేరు లేదు. ఎప్పటికీ రింగ్ ఆగకపోవటంతో ఆన్ చేసింది. యిలా చెవి దగ్గర పెట్టుకుందో లేదో అలా వాయిస్ విన్పించింది. ‘‘మేం మీకో శుభవార్త చెబుతాం. అంతే కాకుండా బోల్డు గిఫ్ట్‌లు యిస్తాం. మీరు మీ లైఫ్‌లో యింతటి అవకాశాన్ని పొంది ఉండరు. మీ అంత అదృష్టవంటతులు వేరొకరు లేరు యిప్పటివరకు... యింతకీ విషయం ఏమిటంటే మీరు గిఫ్ట్ కూపన్ ద్వారా ప్రైజు గెలుచుకున్నారు. యింకా వివరంగా చెప్పాలంటే... ఆగండి... కాసేపు’’ అన్‌లైనులో విరామం.
ఆమెకు ఆనందం కలిగింది. చెమట్లు కూడా పట్టాయి భయంతో. ‘ఎందుకీ విరామం. సస్సెన్సులో పెట్టక ఏదో ఏంటో ఎందుకో చెప్పేస్తే బాగుండును’ అనుకుంది. గాబరాగా, కంగారుగా... ఆత్రుతగా అనిపించింది. యిలా ఆందోళన తట్టుకోలేక కాల్ కట్ చేసింది. కుదుట పడడానికి అన్నట్లు బాత్‌రూమ్‌కి పరిగెత్తింది. యింతలో మరోసారి రింగ్ అయింది. ఆమె సెల్ ఎత్తుతూ నెంబరు చూసింది. అదే నెంబరు. చివర్న మూడసున్నాలు. కాల్ ఎత్తింది. అవతల నుంచి రుూసారి మగ వాయిస్.
‘‘మేడమ్ ఆమని గారా? మీరు త్వరగా రండి. ఎన్ని గంటల్లో రాగలరు ఒక గంట... కాకుంటే మరో గంట అనుకోండి. చక్కగా తయారై మా విందు అందుకోండి. అన్నట్టు ఒక ట్రీట్‌కు తయారైనట్టు రావాలి సెలబ్రైటీల్ని కలవ బోతున్నారు. తళుక్కుమనే తారలు, హీరోలు - వాళ్ల చేతుల మీదుగా బహుమతులు - కిచెన్‌వేర్లు, పట్టుచీరలు, గిఫ్ట్‌కూపన్లు, మంచి మంచి డిస్కౌంట్ ఆఫర్స్. అన్నట్లు మీరు ఏ దేవాలయానికో వెళ్లేలా కాకుండా మోస్ట్ మోడరన్‌గా రావాలి. ఓ మైగాడ్ అసలు విషయం బావగార్ని మరిచిపోకండి సుమా! మీరు ఉభయులు మా యిన్‌కి అదేనండి మీ భాషలో హోటల్‌కి రండి. సరిగ్గా ఆరు, ఆరున్నరకి ఉండాలి ఇక్కడ. మా ఎడ్రస్సు’’ అంటూ చెప్పాడు.
సుమకి సంతోషం వేసింది.
‘‘అంతులేని ఆనందం మీసొంతం చేసుకుందురు’’ అంటూ ఇంకా ఏదేదో చెప్పేస్తున్నాడు. ఆమెకు ఒకటే దడ...చేతుల్లో ఉన్న సెల్‌కి ఆ దడ తాలూకా వడ దెబ్బకు తడిసిపోతున్న చేతులు సమాధానం చెప్పకనే చెబుతున్నాయి. అనుకోకుండా మళ్లీ కాల్ కట్ చేసింది. ‘ఇప్పుడు సరిగ్గా సమయం మూడున్నర. ఇంకా మరో గంటన్నర సమయం ఉంది ఆయన వచ్చేసరికి. రుూలోగా తయారు కావాలి’ అనుకుంది. యిలా ఆలోచిస్తూ ఉన్న ఆమనికి ఓ సందేహం. ‘నా మొహం కాని... అయినా ఆ మహాతల్లి సూర్యకాంతంగారు వదిలిపెడితేగా. ఓ పట్టాన రుూయన్ని వదలదుగా... ఈయనో వర్క్ హాలిక్. ఆమె నోటి నుండి ఏదొచ్చిన నేను రెడీ... ఏదైనా, ఎంతైనా ఎక్కడికైనా అంటారు రుూయన. అక్కడికి నేనే వెర్రిదాన్ని ఏ ముచ్చట ఏ షికారు లేదు. అంతా హుళక్కే. ఆయన గార్కి యింట్లో కూడా ఆమె నామ జపమే. మేడమ్ యిదిచ్చారు. అదిచ్చారు. అది చేశారు. యిది చేశారు. అలా వెళదాం అన్నారు. యిలా రమ్మన్నారు. నాకు కంపరం. ఆయనకు కాలక్షేపం బాగానే ఉంటుంది. ఆవిడతో. ఓ మొగుడా. పిల్లలా... ఏకాకి... ఏకంగా యిప్పటికి ఏడేళ్లయింది. మొగుడికి విడాకులు మంజూరు చేయించుకుని. ఆమె సింగారానికి రుూ పురుషుడు బలి’ అనుకుంది.
‘నిజానికి ఆయనకి మోహనంగా ఉండడం రాదు సుమండి పాపం. ఆమెకే రుూయనంటే సమ్మోహనం. రుూ మాట అనేస్తుంటారు నాతోనే అమాయకంగా. అది విన్నప్పుడు చిర్రెత్తుకొస్తుంది. ఎప్పుడో ఎందులోనో యిరికించేస్తుంది. అప్పుడు సదరు శ్రీవారు పీక్కులేరు. మహా అయితే ఆమె ట్రాన్సఫర్ చేయించుకుంటుంది. ఈ విషయం విన్నవించినా ఉపయోగం లేకపోయింది. ఆమె ట్రాప్‌లో పడకండి. ట్రాక్ మళ్లిస్తుంది సుమా అని. అయితే ఆయనకి నా మాటలు ఎప్పుడూ వేళాకోళమే. ఏమాత్రం పట్టించుకోరు. ఆయన్ని మార్చుకోవడం కష్టంగా ఉంది’ యింతలో ఆమె ఆలోచనల్ని కట్ చేస్తూ మళ్లీ సెల్‌మోగింది. ఆమని కనెక్టయింది.... సరిగ్గా యిందాక మాట్లాడిన వ్యక్తి వాయిసే.
‘‘మాడమ్ వుయార్ వెయిటింగ్ ఫర్ యూ. ట్రీట్ మిస్ కాకూడదు సుమా!’’ అని కాల్ కట్ చేశాడు. ఆమని మనసులో ఉత్సుకత ఉబలాటం. మోహనరావుకి రింగ్ చేసింది. ఏ కళనున్నాడో వెంటనే సమాధానంగా ‘‘యస్ డియర్ చెప్పు’’ అన్నాడు ఉషారుగా.
‘‘మీరు వెంటనే యింటికి రావాలి. సస్పెన్సు, సర్‌ప్రైజ్ - నేను రెడీగా ఉంటా మనం కలసి ఓ పార్టీకి వెళ్లాలి. ప్లీజ్ త్వరగా రండి రుూ రోజు. ఓకేనా’’ గోముగా అంది.
‘‘ఓకే! ఇవాళ మా కాంతంగారు హాఫ్ డే లీవు. వెంటనే వస్తున్నా. యూ బీరెడీ’’ ఫోన్ కట్ అయింది. యిలా అనేకన్నా కట్ చేసింది ఆమని. తనకి కాలింది యిక్కడే ఎంతసేపూ ఆవిడసోదే..
***
ఓ గంట తర్వాత...
మోటారు సైకిల్‌పై హోటల్‌కి చేరుకున్నారు మోహనరావు ఆమని. అతను పార్కింగ్‌కి వెళ్లాడు. రుూలోగా ఆమని ఆ యిన్ వాతావరణం పరికించింది. రిచ్‌గా ఫీలయింది. తన బాడీ లాంగ్వేజ్‌లో మార్పు తెచ్చుకుంది. కాస్త దర్పం, దర్జా దట్టించి కొంచెం గర్వం తొణికించింది. ఆపై హొయలు వొలికించింది. యివన్నీ కల్పించుకున్నవే - ఆతృతని లోలోనే అదిమి పెట్టుకుని అడుగులో అడుగు వేసుకుంటూ మోహనరావు భుజాన్ని తాకుతూ ఆయన చేతిని తన చేతిలోకి తీసుకొని ఎంట్రన్స్ డోర్‌లోకి వెళ్లబోయి ఎక్సిట్ డోర్ తెరిచింది. రెండూ పక్కప్కనే వుండడంతో.
అక్కడే వున్న వాచ్‌మెన్ ‘‘సారీ మేడమ్ యిది బయటికి వెళ్లే ద్వారం. ఎంట్రన్స్ డోర్ అది’’ అన్నాడు.
‘‘ఓ... సారీ’’ అంది ఆమని.
మోహనరావుతో కలసి లోపలికి వెళ్లింది.
***
మైక్‌లోంచి సుతారంగా అమ్మాయి గొంతు వినిపించింది.
‘‘మిస్ ఆమని అండ్ ఫ్యామలి ప్లీజ్ వెల్‌కమ్ టు డయాస్. గివ్‌దెమ్ ఎ బిగ్ హ్యాండ్’’
అంతే చప్పట్లతో ఆ ప్రాంతం మోగిపోయింది.
‘‘వాటే బ్యూటీఫుల్ కపుల్’’ ఎటు వైపు నుండో వినిపించాయి. అవి వింటుంటే ఆమనికి హాయిగా అనిపించింది. మోహనరావు కూడా సంతోషించాడు. ఇద్దరూ డయాస్ ఎక్కారు. ఆ హాల్ అంతా దీపకాంతులతో మెరిసిపోతోంది. యిద్దరికి ఏదో కొత్త లోకంలో ఉన్నట్లు ఉంది. ఆడియన్సు వైపు తిరిగి నమస్కారం పెట్టారు. డయాస్ పైనున్న హోస్టుకి షేక్ హేండ్ యిచ్చారు. ఎందరివో నవ్వులు.. అలానే ఒకళ్లకి ఒకళ్లు విసురుకున్నారు. విసుగనిపించలేదు యింతవరకు. హాలంతా ఉత్సాహం ఉల్లాసం ఉరకలు ఊపందుకుంది. ఉరుముల దరువుల్లా డమరుక నాదంలా దబదబ డ్రమ్సు. రుూ రణగొణ ధ్వనిలో ఎనౌన్స్‌మెంటు స్పష్టంగా అర్థం కాలేదు. అలా అలా మళ్లీ నిశ్శబ్దానికి చోటు దొరికింది.
హాయి అన్పించింది. ఆమని, మోహన్లకి.
అక్కడ చాలా జంటలు కనిపించాయి.
‘మాలాగే వచ్చారు కాబోలు. చాలా మంది ఉన్నారే. ఫేషన్ పెరేడ్‌కి వచ్చారా అన్పించింది. అసలు యింత మందిని ఎందుకు పిలిచారు. అందరు ఒక్కసారే యిక్కడ కలుసుకున్నాం. ఒకేసారి వచ్చి చేరామా?’ అంతా అయోమయం. ఒక్కో జంటను ఒక్కో కేబిన్‌లోకి పంపిస్తున్నారు.
ఎందుకో ఆమనికి అర్ధం కాలేదు. తినబోతూ రుచి అడగటమెందుకు. అందరికి ఏం జరిగితే అదీ మనకీని. ఎవరికి కేటాయించిన కేబిన్‌లోకి వారు జంటగా వెళ్లిపోతున్నారు ఏదో మిస్ అయిపోతామేమో అన్నట్లు. ఆమని, మోహనరావుల పేర్లు పిలిచారు. అందరిలాగే వాళ్లు జొరబడ్డారు. వాళ్ల కేబిన్‌లోకి... ఐదు.. పది... పదిహేను నిమిషాలు మొత్తంగా ఓ యిరవై ఐదు నిమిషాల్లో ఆ కేబిన్ నుండి బయటపడ్డారు. పార్కింగ్ దగ్గరికి వచ్చి బండి స్టార్ట్‌చేసి యింటికి చేరారు.
** ** **
త్రూ మెయిల్ ద్వారా సెలవుకి అప్లయ్ చేశాడు మోహనరావు. సెలవు దొరగ్గానే భార్యతో కలసి క్యాంపుకి బయలుదేరారు. విశాఖపట్నం రైల్వే స్టేషను నుండి చెన్నై ట్రైన్ ఎక్కడం జరిగిపోయింది. అలా ప్రయాణం చేయడం... మర్నాడు చెన్నై చేరడం... ఎగ్‌మోర్ స్టేషన్ నుండి సౌత్ యిండియన్ ఆటోలో వెళ్లడం-ఎంక్వైయిరీలో వాళ్ల రూమ్ గురించి వాకబు చేశారు.
‘‘అబ్బే ఎవరూ మీ పేర్లను రిజర్వ్ చేయలేదండి. వాళ్లకి ఫోన్ చెయ్యండి’’ అన్నారు ఎంక్లయిరీలో. మోహనరావు ఫోన్ చేశాడు. కానీ ఎవరూ ఎత్తలేదు. ఎన్నిసార్లు చేసినా అదే తంతు. చివరాకరికి ఎంతో రిక్వస్టుమీద ఒక రోజుకి ఓ రూమ్ బుక్ చేసుకుని అంతే కష్టం మీద తిరుగుప్రయాణం అయ్యారు విశాఖకి. యిద్దరికి చేదు అనుభవం ఎదురైంది. ఎలాగైనా వాళ్ల మీద కంప్లైంట్ చెయ్యాలి అనే సంకల్పంతో ఆమని, మోహనరావు మళ్లీ ఆ హోటల్‌వాళ్లని కలిసారు.
‘‘సారీ సార్ మీ ప్లేస్‌లో వేరే వాళ్లకి బుక్ చేశాం. చాలా మెసేజ్‌లు కూడా పెట్టామే అందలేదా సమాచారం. ఎక్స్‌ట్రీలీ సారీ సార్. నెక్ట్స్‌వీక్ ప్లాన్ చేసుకోండి సార్ ష్యూర్లీ మీకు హెల్ప్ చేస్తా ’’ రిసెప్షన్‌లో ఉన్న యువకుడు అన్నాడు.
‘‘అసలు ఎందుకు మాకు ఫోన్ ద్వారాగాని, మెయిల్ ద్వారా గాని ఇంటిమేట్ చెయ్యలేదు. ఆ రోజు ఏమని బుక్ చేశారు. అందరికీ రుూ విషయం చెబుతా చూడండి’’ కోపంగా అంది ఆమని.
మోహనరావు మాత్రం ఏమీ మాట్లాడలేదు. వాళ్లని నోటికొచ్చినట్లు తిట్టేసి భర్తతో పాటు బయటికి వచ్చేసింది ఆమని. ఇద్దరూ ఇంటికి చేరుకున్నారు. తాళం తీసి, సోఫాలో విసురుగా కూలబడింది ఆమని. అది గమనించిన మోహనరావు ‘‘పోనీ లేవే... అదేదో ముందే తెలిసిపోయింది. వాళ్లు చెప్పినట్లు కొంత ప్రయాణం సాగిన తర్వాత యిదేదో జరిగిందంటే - వాడిచ్చిన కమిషన్, డిస్కౌంట్ వంటివి ఒకటికి మూడింతల ఖర్చు. వాళ్లది ట్రావలింగ్ ట్రాపింగ్ బిజినెస్. అవకాశం, అదును, బలహీనతను సొమ్ము చేసుకుంటారు. లాట్రీలో పేరు, నంబరు తగలడం కూడా ఓ ప్లానే. చింతగింజ యిచ్చి గుమ్మడికాయ లాక్కోవటమే యిందులో వున్న లాజిక్కు. యిదీ వశీకరణం. యివన్నీ రెండవ యిన్‌కమ్. బ్లాక్‌మనీ ఉన్నవాళ్లకి యిలాంటి టూర్స్, ప్యాకేజీలు, రిసార్ట్సు. మనలాంటి మిడిల్ క్లాస్ వాల్లకి కాదు. యిక యిలాంటి ఫోన్ కాల్స్‌కి వశమై పరవశమై వశీకరణం కాకూడదు. యిలా అంటుండగా సెల్ మోయింది.
‘ట్రింగ్... ట్రింగ్... ట్రింగ్’
అది మోహనరావు సెల్ ధ్వని. ‘ఎవరు?’ అనుకుంటూ చూసాడు.
మేడమ్ కాంతం.
‘‘చెప్పండి మేడమ్’’ అటెన్షన్‌గా అన్నాడు.
‘‘హలో మోహన్! యిప్పుడే విన్నా. మీరు ఆ యిన్ వారి ట్రాప్‌లో పడ్డారట కదా. వాళ్లది ట్రావలింగ్ ట్రాపింగ్ బిజినెస్. వాళ్ల వ్యవహారం అంతా మీకు తిరుక్షవరానికే. ఏం మాట వరసకైనా నాతో చెప్పలేదేం?’ అనుకోకుండా మోహనరావు స్పీకర్ ఆన్ చేయడంతో ఇదంతా ఆమని చెవిన పడింది.
కోపంతో టివిఆన్ చేసింది. అందులో ఏదో కార్యక్రమం సాగిపోతోంది.
యాంకర్ జోరుగా ఏదో చెప్పుకుపోతోంది.
‘‘అసలే కోతి, నిప్పు తొక్కింది. కల్లు తాగింది. ఆపై ముల్లు గుచ్చుకుంది యింకా ఏవో వాక్యాలు...’’
మోహనరావు అది చూసి ఆమె సత్యభామ అవతారంలో ఉందని గ్రహించి మిన్నకుండిపోయాడు.

- వి.వి. భరద్వాజ