దక్షిన తెలంగాణ

విద్యతోనే వ్యక్తిత్వ వికాసం! (పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పేజీలు: 80, వెల : 59/-
ప్రతులకు: ఎ.సుకన్య
శాస్ర్తీనగర్, నిర్మల్
ఆదిలాబాద్ జిల్లా - 504106
సెల్.నం.9849326801
**
మనిషి ఆశయాలకు పూదోట విద్యావికాసమనీ.. ఓడిపోయిన జీవితానికి, వాడిపోయిన జీవనానికి ఓదార్పునిచ్చేది విద్య అనీ.. కృంగిపోయిన మనస్సుకు, కూరుకుపోయిన బతుకుకు సాంత్వననిచ్చి దారి చూపేది విద్య అనీ.. విద్యతోనే వ్యక్తిత్వ వికాసమని కవి అంబటి నారాయణ గారు తమ ‘విద్యా-వికాసం’ గ్రంథం ద్వారా తెలియజెప్పారు. ‘బరువెక్కిన బతుకు’, ‘నెత్తుటి మరకలు’, ‘ఊరి చివర. .ఒంటరి బడిని’, ‘తడి’, ‘మోత’, ‘యువనేస్తం’ గ్రంథాలతో కవిగా, రచయితగా సాహితీ లోకంలో తనకంటూ ఓ స్థానాన్ని పదిలపరుచుకున్న అంబటి నారాయణ గారు విద్యకోసం ఆయన అనుభవించిన వేదన మరొక్కరికి రాకూడదనే సంకల్పంతో, అందరూ విద్యావంతులై వికాసం చెందాలన్న తపనతో ఈ గ్రంథాన్ని రూపకల్పన చేశారు. లఘు వచన రూపంలో ఉన్న ఇందలి రచన సామాజిక చైతన్యాన్ని కలిగించేలా కొనసాగించారు.
విద్య అంటే మంచి, మానవత్వం, ప్రేమ, అనురాగం, ఆప్యాయత బోధించే నిధి అనీ, అన్ని రంగాల్లో నైపుణ్యాన్ని నింపేది విద్యేనని తేల్చి చెప్పారు.
విద్య సమాజంలోని దుర్మార్గాన్ని ధ్వంసం చేయడానికి ఓ ఆయుధమనీ.. అనాగరికతను రూపుమాపి, నాగరికత పథాన నడిపించేది విద్య అని కవి తమ రచన ద్వారా నొక్కి వక్కాణించారు.
మానవత్వాన్ని నింపేది విద్య అనీ.. మనిషిని మనిషి ప్రేమించే ఓ గొప్ప లక్షణం విద్య ద్వారానే అలవడుతుందని చెప్పారు. మానవునిలో అంతర్నిహితంగా ఉండే అనంత శక్తుల్ని మేల్కొలిపి, విద్య ద్వారా వికసింపజేయాలని సూచించారు.
ఆశల ఊపిరి, శ్వాసయై నిలిచేది విద్య అనీ.. విద్య ద్వారా వినయం నింపుకోగలుగుతామని వివరించారు.
ఆత్మవిశ్వాసం, ఆత్మజ్ఞానం విద్య ద్వారా సాధ్యమని కవి అభిప్రాయపడ్డారు.
మన ఆలోచనలకు పదును పెట్టాలంటే విద్యను ఆశ్రయించక తప్పదని తెలిపారు. మనిషికి ఆత్మసౌందర్యాన్నిచ్చేది విద్య అనీ.. విద్య ద్వారానే నైతికత అలవడుతుందని వివరించారు. విద్య అంటే జీవితం తయారవడం కాదనీ.. విద్య అంటేనే జీవితమని నొక్కి చెప్పారు. విద్య విజ్ఞానానికి వారధి అనీ.. జీవితాలకు పునాది వంటిదనీ.. నిత్య అనుగ్రహిణి అని విద్య యొక్క ప్రాశస్త్యాన్ని కవి వివరించారీ గ్రంథంలో..!
ఇలా.. సమగ్ర వికాసానికి.. సామాజిక చైతన్యానికి.. విద్య అవసరమని విద్య యొక్క గొప్పతనాన్ని వివరించారు. నిత్య జీవితంలో మనిషి.. సమాజానికి ముడిపడి ఉన్న వైయక్తిత, సామాజికాంశాలకు విద్య యొక్క అవసరం ఎలా వుండాలో చెప్పారు. మనం దినం చూసేవి, అనుభవించేవి, అనుభూతి పొందే అంశాల మాటున గల విద్య యొక్క పాత్రను ఆవిష్కరించే యత్నం చేశారు. విద్యను విశే్లషించే క్రమంలో సాగదీసే ప్రయత్నం చేసినప్పటికీ, కవి నారాయణ గారు విద్య యొక్క పరమార్థాన్ని కొంతవరకైనా ఓ కొత్త కోణంలో ఆవిష్కరించారన్న తృప్తి పాఠకుల్లో మిగులుతుంది. అంతేగాక కొన్ని పంక్తులు మేధావులు, విద్యావేత్తలు, ప్రముఖులు, సంస్కర్తలు ఇచ్చిన సూక్తులను తలపించినప్పటికీ.. కవి యొక్క సామాజిక చింతనను మెచ్చుకోకుండా ఉండలేము! విద్య గురించి కావలసినన్ని నిర్వచనాలు ఇందులో లభ్యమవుతాయి.. ఓ వైవిధ్యమైన అంశంపై గ్రంథాన్ని వెలువరించిన నారాయణ గారికి అభినందనలు.

- సాన్వి, కరీంనగర్
సెల్.నం.9440525544

****

రచనలకు ఆహ్వానం
నవ, యువ, ఔత్సాహిక రచయితలూ ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం! మీరు కథలు, కవితలు,
కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక
సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి, ఆవిష్కరించే అద్భుత అవకాశమే ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి... నిస్తేజంగా ఉన్న భావుకతను
మేల్కొలపండి. ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net