విజయవాడ

స్వేచ్ఛ (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నాయనమ్మా! నాయనమ్మా! ఎక్కడున్నావూ?’ అంటూ పరుగెత్తుకుంటూ వచ్చింది మృదుల.
‘ఏమ్మా! ఏమిటీ?’ అడిగింది నాయనమ్మ.
‘నాయనమ్మా! మరే ఈరోజు మా స్నేహితురాలు సుజన పుట్టిన రోజుకదా!’ అన్నది మృదుల.
‘అవును! నిన్న చెప్పావుగా. పొద్దున మీ స్నేహితురాలికి ఇస్తానని గులాబీ పువ్వు కూడా తీసుకెళ్లావుగదా!’ అన్నది నాయనమ్మ.
‘అవును కదా! దానికి పుట్టినరోజు కానుకగా వాళ్ల నాన్న రెండు చిలకలు తెచ్చాడు. అవి మనం ఏమంటే తిరిగి అలాగే అంటాయి’ చెప్పింది మృదుల.
‘ఓహో.. అలాగా! ఈమధ్యన అలా మాట్లాడే బ్యాటరీ చిలకలు ఏవో వచ్చాయట కదా’ అన్నది నాయనమ్మ.
‘అఁహా! కాదు.. కాదు, అవి నిజం చిలకలే! చూడటానికి రమ్మంటే నేను ఇందాక వాళ్ల ఇంటికి వెళ్లి వచ్చాను. ఆ చిలకలు సుజనను చూస్తూనే ‘సుజనా, సుజనా..’ అని పేరుపెట్టి పిలుస్తున్నాయి తెలుసా? బలే బావున్నాయి’ చెప్పింది మృదుల. ‘ఈసారి నా పుట్టిన రోజుకి నాన్నను కూడా అలాంటి చిలకలు తెమ్మని అడుగుతా’! అన్నది.
‘వద్దమ్మా! హాయిగా ఎగిరే చిలకలను తెచ్చి పంజరంలో పెట్టి ఇంట్లో ఉంచుకోకూడదు’ అన్నది నాయనమ్మ
‘ఏం! ఎందుకు ఉంచకూడదు?’ ప్రశ్నించింది మృదుల.
‘అవి చెట్ల మీద స్వేచ్ఛగా ఎగిరే పక్షులు కదా! అలా ఎగిరేవాటిని బంధిస్తే ఆ పాపం మనకు తగులుతుంది’ చెప్పింది నాయనమ్మ.
‘నువ్వెప్పుడూ ఇలాగే ఏదోఒకటి చెబుతావు’ అంటూ బుంగమూతి పెట్టింది మృదుల. ‘సరే! అయితే, నిన్ను ఒక విషయం అడుగుతాను. దానికి నాకు సమాధానం చెప్పి, తర్వాత నువ్వే ఆలోచించు’ అన్నది నాయనమ్మ.
‘సరే! అడుగు’ అన్నది మృదుల.
‘నీ పాఠంలో దాశరథీ శతకంలోని పద్యాలు ఉన్నాయి గదూ!’ అన్నది నాయనమ్మ. ‘ఆఁ ఉన్నాయి. అయితే?’ అన్నది మృదుల. ‘దాశరథీ శతకం రాసింది ఎవరో చెప్పు’? అడిగింది నాయనమ్మ.
‘కంచర్ల గోపన్న’ చెప్పింది మృదుల.
‘ఆయన మరో పేరేమిటో చెప్పుమరి’ అన్నది నాయనమ్మ.
‘రామదాసు కదా! మొన్న టీవీలో ఆ సినిమా కూడా మనం చూశాముగదా!’ అన్నది మృదుల.
‘సరే మరి! ఆయన ఒకసారి రామచిలకలను పట్టుకొని ఇంట్లో పెట్టినందుకు ఆయన చివరకు కారాగార వాసం పాలయినాడు. అదీ చూశావుగా!’ అన్నది నాయనమ్మ.
‘పోమ్మా..! నువ్వెప్పుడు ఇలా ఏదోఒకటి చెబుతుంటావు’ అన్నది మృదుల.
‘సరేలే! నీ పుట్టిన రోజుకింకా చాలా టైము ఉందిగా’ అన్నది నాయనమ్మ.
****
రోజూ మృదుల స్కూలుకు వెళ్లి వస్తున్నది. సుజన తన చిలుకల కబుర్లు చెబుతున్నది. అలా నాలుగు రోజులు గడిచిపోయాయి.
అలావుండగా ఒకరోజు ఉదయం నుండి కుండపోతగా వర్షం కురవసాగింది. మృదులకు వానంటే చాలా ఇష్టం. కానీ వానలో తడిసిందంటే వెంటనే జలుబు చేసి జ్వరం వస్తుంది. అందుకుని వాళ్ల అమ్మ మృదుల బయటకు వెళ్లకుండా తలుపుకి తాళం పెట్టింది. సాయంత్రానికి వాన తగ్గింది. వాళ్ల అమ్మ తాళం తియ్యగానే ‘ఆహాఁ’! అనుకుంటూ బయటకు పరుగెత్తింది మృదుల. స్నేహితులతో ఆడుకుని గంట తరువాత ఇంటికి వచ్చింది. వస్తూనే ‘నాయనమ్మా! బయట ఆడుకుంటే ఎంత హాయిగా ఉందో కదా! పొద్దుటి నుంచీ ఇంట్లోనే కూర్చుని ఎంత బోర్‌కొట్టిందో తెలుసా! జైల్లో ఉన్నట్లుగా అనిపించింది’ అన్నది.
‘అవునా? అలాగా! నీకు ఒక్కరోజుకే అలా అనిపిస్తే పాపం అడవిలో స్వేచ్ఛగా తిరిగే పక్షులను పంజరంలో బంధిస్తే వాటికి ఎలా ఉంటుందో ఆలోచించు మరి!’ అన్నది నాయనమ్మ.
‘అవునా? నిజమేకదా! పాపం అవి ఎంత బాధపడతాయో కదా! సరేలే.. నువు చెప్పినట్లే నిజం చిలకలు వద్దులే! బ్యాటరీవి కొనుక్కొంటాను, సరేనా!’ అన్నది మృదుల.
‘మా మృదుల తల్లి బంగారు తల్లి’ మెచ్చుకుంది నాయనమ్మ.
నాలుగు రోజుల తరువాత ఒకరోజు స్కూలు నుంచి ఇంటికి వస్తూనే ‘నాయనమ్మా! మరే, ఈరోజు ఉదయం సుజనా వాళ్ల తాతయ్య వచ్చారట. పంజరంలోని చిలుకలను చూస్తూనే ఆయన - వాటిని అలా బంధించ కూడదు - అంటూ నువు చెప్పిన కథే చెప్పాడట. మనం వాటిని బంధిస్తే మనకూ అలాగే జరగవచ్చు అన్నాడుట’ చెప్పింది మృదుల.
‘మరయితే అప్పుడేం చేశారు?’ అడిగింది నాయనమ్మ
‘ఏం చేస్తారు? సుజన వెంటనే వాళ్ల నాన దగ్గరకు వెళ్లి ‘నాన్నా! చిలుకలను పంజరంలో పెట్టకూడదట. తాతయ్య చెప్పాడు. అలా పెట్టినందువల్ల రామదాసు జైల్లో పడ్డాడని చెప్పారు. అందుకని వాటిని స్వేచ్ఛగా వదిలేద్దాం’ అన్నదట.
‘సుజన మాట ప్రకారం వాళ్ల నాన్న పంజరం తలుపు తెరిచేటప్పటికీ అవి కువకువలాడుతూ హాయిగా, స్వేచ్ఛగా ఆకాశంలోకి ఎగిరిపోయాయట’ చెప్పింది మృదుల.
‘చూశావా మరి! ఈ నాలుగురోజులే అయినా అవి ఎంత బాధపడ్డాయో గదా!’ అన్నది నాయనమ్మ.
‘నిజమే పాపం!’ అన్నది మృదుల.
‘సరే! ఇందువల్ల నీకు తెలిసిన నీతి ఏమిటి?’ ప్రశ్నించింది నాయనమ్మ.
‘స్వేచ్ఛగా తిరిగే మూగజీవులను బంధించకూడదు’ బదులిచ్చింది మృదుల.
‘మా మృదుల తల్లి బంగారు తల్లి’ అంటూ నాయనమ్మ మనసారా ముద్దాడింది.

- డా. మైలవరపు లలితకుమారి,
గుంటూరు.
చరవాణి : 9959510422
**

చిన్న కథ

ఒంటరిగా పంపితే..

‘అమరావతి వచ్చేస్తున్నారా?’
‘పిల్లల చదువులు ఇక్కడే పూర్తిచేద్దామన్నారు, పైగా సొంత ఇల్లు వదులుకుని! అక్కడ మళ్లీ పది వేలు అద్దె కట్టాలి’
‘ఆయన వాళ్ల తమ్ముడింట్లో పేయింగ్ గెస్ట్‌గా వుంటారన్నారులే. నెలకి రెండుసార్లు వస్తానన్నారు.’
‘పిచ్చిదానా! పిల్లల కోసం భర్తను వదిలి వుంటావా? నాలుగు రోజుల క్రితం మీ ఆయన్ని ఆ రంగవల్లితో చూశా’
‘అది అక్కడ ఏం చేస్తోంది?’
‘గన్నవరంలో టీచర్‌గా చేస్తోంది. డిగ్రీలో మీ ఆయన దాని వెనక పడ్డాడట. అంతా గుర్తుందా? మళ్లీ నువ్వు దూరంగా హైద్రాబాద్, అది ఇక్కడ! దగ్గరగా వుండేలా ఆలోచించు’
‘పిల్లల్ని విజయవాడలోనే ఉంచుతాను. చదువు విషయంలో సీట్లు ఇప్పించే బాధ్యత కూడా ప్రభుత్వమే తీసుకుంటుందిటగా!’
‘ఎవరు చెప్పారు? నిన్నటిదాకా నన్కొక్కడినే వెళ్లమని ఇప్పుడిలా అంటావేమిటి? రాత్రికి రాత్రి నీటు జ్ఞానోదయం ఎలా అయింది?
‘ఏం? నేను విజయవాడ వస్తే మీకేమన్నా అసౌకర్యమా?’
‘చాలా ఆనందంగా వుందే! నువ్వు రమ్మంటే రావడం లేదని, పిల్లల చదువులు అంటూ ఇక్కడే వుంటానన్నావని మీ ఫ్రెండ్ నీలాంబరి కనిపిస్తే చెప్పాను. అది మీవెంటపడి వచ్చేలా నేను చేస్తాన’ని అంది. ఏం మంత్రం వేసింది నీ ఫ్రెండ్? నేనెంత బతిమాలినా రానన్నదానివి ఇలా మనసుమార్చుకున్నావే. ఏమైనా నాకు చాలా ఆనందంగా వుంది శారదా’ అన్నాడు రామశర్మ.
ఉలిక్కిపడింది శారద. అంటే రంగవల్లితో షికార్లంటూ కథ అల్లిందా నీలాంబరి. లేక నిజంగానే రంగవల్లి గన్నవరంలో వుందా?.. ఆలోచనలో పడింది. ఏమైనా ఈ మగాళ్లని నమ్మకూడదు. రంగవల్లి కాకుంటే మరో శ్రీవల్లి! ఏమైనా ఒంటరిగా వదిలితే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లే’.. మనసులోనే అనుకుంది శారద.

- కొత్తపల్లి భరద్వాజ్, నేలకొండపల్లి, ఖమ్మం జిల్లా.