విశాఖపట్నం

ఎవరు తీసిన గోతిలో...(కథానిక)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘రాజా! ఆ ఇన్స్‌పెక్టర్ ఓసారి కనిపించి వెళ్లమన్నాడు’’
‘‘వెళతానమ్మా’’ విసుక్కుంటూ అన్నాడు రాజు.
‘‘అలా కాదురా వాళ్లొచ్చారంటే మనం వెళ్లి మాట్లాడాల్సిందే. లేకపోతే రోజూ ఏదో ఒక గొడవ’’
‘‘అలాగేలే’’ అన్నాడు ఆటో బయటికి తీస్తూ.
ఆటో స్టార్ట్ అయింది. దాంతో పాటే సెల్‌ఫోనూ.
‘‘ ఒరే సింహాద్రీ ఎక్కడున్నావురా? ఆ కిష్టిగాడిని, సుబ్బిగాడిని తీసుకుని మనం ఎప్పుడూ కూర్చునే చోటుకు వచ్చేయండ్రా’’
‘‘అలాగే’’ అంది అవతలి గొంతు.
లైసెన్సు కాగితాలు మరిచిపోయానని మళ్లీ అరకిలోమీటరు వెనక్కి ఇంటి వైపు మళ్లాడు రాజు.
‘‘దొంగాముండా కొడుకులు. తెలబలిసి ఉన్నట్టున్నారు. అమ్మా, అయ్యా అన్నం పెట్టి పెంచారో, కామం పెట్టి పెంచారో ఊరపందుల్లా రోడ్డు మీద పడి ఆడది కనిపిస్తే చాలా పాడు చేసెయ్యడమే. వాళ్లకేం పోయేకాలం వచ్చిందో. కాళ్లూచేతులూ పడిపోతే బాగుండును. ఎయిడ్స్ రోగం ఎత్తుపోయినా బాగుండును. ఇలాంటి పశువుల్ని బతకనీయకూడదు. చర్మం ఒలిచెయ్యాలి. వాళ్ల బతుకులు తలెట్టా. ఎందుకు పుడతారో ఎదవ సచ్చినోళ్లు? ఆడి పెళ్లాన్నో, చెల్లెల్నో, తల్లినో ఇలా చేస్తూ ఎలా ఉంటుంది? వాడి కూతుర్నే వాడు చేసినట్లు చేస్తే ఎలా ఉంటుంది?’’ రాజు వెళ్లేసరికి అతని తల్లి ఇష్టానుసారం తిడుతోంది.
‘‘ ఏమైందే అమ్మా’’ అన్నాడు రాజు విషయం అర్ధం కాక.
‘‘రెండు రోజుల క్రితం గుడివీధి సుమని ఎవరో పాడు చేశారంట దొంగ సచ్చినోళ్లు. అది చాలదన్నట్లు ఫొటోలు, వీడియోలు తీశారట’’
ఉలిక్కిపడ్డాడు రాజు.
‘‘సర్లే ఊరి విషయాలన్నీ నీకెందుకు’’ అంటూ తల్లిని కసురుకున్నాడు.
‘‘అది కాదురా మనిషికే పుట్టారో, ఏ జంతువుకో పుట్టారో ఇలాంటి పనులేమిటి?’’
‘‘ ఊరుకోమన్నానా’’ మళ్లీ విసుక్కున్నాడు రాజు.
‘‘వాడొక్కడేనా? ఆ సచ్చినోడికి మరో ముగ్గురు తోడట. పాడు చేసింది చాలక మళ్లీ నిన్న తోటలోకి రమ్మన్నారట కూడా’’
‘‘సర్లే ఎవరి గొడవలో మనకెందుకు? అసలే కాగితాలు దొరక్క నేను పిచ్చెక్కిపోతుంటే’’ ఈసారి కొంచెం గట్టిగా కోప్పడ్డాడు రాజు.
‘‘అది కాదురా ఆడదానికి ముఖ్యమైన శీలం పోయాక దాని పెళ్లెలా అవుతుంది? తెలిసినోడు ఎవడైనా చేసుకుంటాడా? అలా చేసినోడి పెళ్లామో, కూతురో, తల్లో, అక్కో, చెల్లెలో బయటికి వెళ్లకుండా ఉండదుగా. ఇలాగే వాళ్లకీ జరిగితే ఏం చేస్తారు?’’ అంది వరాలమ్మ.
రాజు వౌనంగా బయటికి వెళ్లిపోయాడు. తాను కలగజేసుకునేసరికి అది మరింత ఎక్కువగా మారి అసహనానికి గురి చేస్తుందని.
స్నేహితులకి చెప్పిన సమయం కావస్తుండడంతో అతను ఆటోని అటువైపు తిప్పాడు.
చెరువు గట్టు మీద కూర్చున్నారు మిత్రులందరూ. రాజు చేరాడు అక్కడికి.
‘‘సుమ బాగుంది కదరా’’ సింహాద్రి అన్నాడు.
‘‘లేత కొబ్బరిముక్క’’ కిష్టిగాడు అన్నాడు.
‘‘తలచుకుంటే చాలు ఒళ్లు ఝల్లుమంటుంది’’ అన్నాడు సుబ్బిగాడు.
‘‘మా అమ్మ తిట్టిన తిట్లకి అక్కడికక్కడే ఉరి పోసుకుని చావాలని అనిపించింది’’ అన్నాడు రాజు.
ఇదేం వినిపించుకోకుండా ‘‘ ఏదిరా ఆ వీడియో మరోసారి చూద్దాం’’ అని చొరవగా సెల్ లాక్కుని చూస్తున్నారు అంతా.
‘‘ ఇన్‌స్పెక్టర్ మా ఇంటికి వచ్చాడటరా’’ అన్నాడు రాజు బాంబు పేలుస్తూ.
‘‘సుమ ఏమైనా చెప్పిందంటావా?’’ కిష్టిగాడు అన్నాడు భయంగా.
‘‘దానికంత ధైర్యం ఎక్కడిది? అలాంటి పని చేస్తే ఇంటర్నెట్‌లో పెట్టెయ్యమా?’’ అన్నాడు సింహాద్రి.
‘‘మరోసారి రమ్మందాం’’ సుబ్బారావు అన్నాడు ఆశగా.
‘‘వద్దొద్దు’’ గాబరాగా అన్నాడు రాజు.
‘‘్భయమెందుకురా? అది ఎవరికీ చెప్పుకోలేదు. మనం ఎవరికీ చెప్పం. బెదిరించినట్టు ఉంటుంది’’ అన్నాడు సింహాద్రి.
మనసు కన్నా వయసే బలంగా పని చేసి సుమను రప్పించింది ఫోన్ ద్వారా రాజు బృందం.
గంటలో సుమ వచ్చింది.
‘‘ ఏమే ఎలా ఉంది?’’ వెకిలిగా అన్నాడు సింహాద్రి.
‘‘మననెక్కడ మరిచిపోగలదురా?’’ కిష్టిగాడు నవ్వుతూ అన్నాడు.
‘‘పెళ్లిచూపులట కదా’’ రాజు అన్నాడు వెటకారంగా.
సుమ ఏం మాట్లాడలేదు.
‘‘పెళ్లయినా మేం పిలిస్తే రావాలి’’
‘‘మీ వాళ్లని మా ఆటోనే ఎక్కించాలి’’
‘అవసరం అయితే నీలాగే మరొకరిని ఇప్పించాలి. అలా చేయలోదే నీ వీడియో ఇంటర్నెట్‌కు ఎక్కుతుంది’’
సుమ ఏడ్చింది. ప్రాధేయపడింది. అయినా వాళ్ల మనసు కరగలేదు.
వారం గడిచింది.
సుధాకర్ వచ్చి రాజును పిలిచాడు. ఇంట్లోనే ఉన్న రాజు బయటికి రాక తప్పలేదు.
‘‘ ఏరా రమ్మంటే రానన్నావట’’
‘‘ ఎవరు మీరు? నాతో ఏం పని?’’ దురుసుగా అన్నాడు రాజు.
‘‘స్టేషన్‌కి రారా చెబుతాను’’ అంటూ ఈడ్చుకెళ్లాడు రాజుని.
అప్పుడు అర్ధం అయింది అతనికి వచ్చింది ఎస్సై అని, అతను మఫ్టీలో ఉన్నాడని.
స్టేషన్‌లోనే పెళ్లి జరిగింది రాజుకి-సుమకి స్నేహితుల సాక్షిగా.
వీడియో సెల్ నుండి డిలిట్ అయింది.
‘‘వీడేదైనా తోక జాడిస్తే నాకు చెప్పు. రకరకాల కేసులున్నాయి వెదికి వెదికి మరీ పెడతాను. దెబ్బకి చచ్చి ఊరుకుంటాడు. ఎక్కడైనా ఏ నేరం జరిగినా మీ ముగ్గురే దానికి బాధ్యులు. అర్ధం అయిందా’’ పోలీసు భాషలో చెప్పాడు ఎస్సై.
సుమ భక్తితో, రాజు భయంతో సుధాకర్‌కి నమస్కరించారు.
ఇప్పుడు రాజుకి రోజూ భయమే. సుమని తన స్నేహితులు ఎలా చూశారో, ఎలా చూస్తారోనని.
చావు కన్నా మానసిక వేదనే మరపురానిది. ఎవరికీ చెప్పుకోలేనిది.
ఈ దెబ్బతో రాజు మారాడు. రాజు చెల్లెలికి మరెక్కడో ఇలాగే జరిగితే సింహాద్రికి ఇచ్చి పెళ్లి జరిపించాడు సుధాకర్.
ఈ సంఘటన జరిగిన నాటి కిష్టిగాడు పరార్. ఎక్కడున్నాడో ఎవరికీ తెలియదు.
రాజు తమ్ముడు గోపాల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు.
ఆరోజు అతని కాలేజీలో డిటేబ్ జరిగింది.
అందులో అతను మాట్లాడాడు.
‘‘ ఇదేం దరిద్రమో! ఒకచోటెక్కడో ఎవడో ఒక అమ్మాయిని పాడు చేస్తాడు. ఆ అమ్మాయి మరొకడిని పెళ్లాడుతుందనుకో. ఇలా జరిగితే లోకంలో ఏ ఆడపిల్లా కనె్నపిల్లలా దొరకదు. ఆడపిల్లలని బెదిరించి పాడు చేసే వాల్లకి ఆడపిల్లలే పుట్టాలి. అలాంటి దుర్మార్గులకు ముస్లిం దేశాల్లో విధించినట్లు శిక్షలు విధించాలి. ఆడవాళ్లని హింసించేవాళ్లని, పాడు చేసే వాళ్లని అందరూ వెలివెయ్యాలి’’ గోపాల్ ప్రసంగానికి అంతా చప్పట్లు కొట్టారు.
డిబేట్‌లో మొదటి బహుమతి దక్కించుకుని ఇంటికి వెళ్లాడు గోపాల్.
పోటీలో గెలిచిన కప్పుని ఇంట్లో పెట్టాడు.
రాజు రోజూ సుమని, ఆ కప్పుని చూస్తూ వెర్రి నవ్వొకటి నవ్వుతూ కాలం గడిపేస్తున్నాడు ఇప్పుడు.
ఇలాంటి కథలకు ముగింపు ఇంతే!

***
కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

- శ్రీనివాసభారతి, ఎన్‌సి ఎస్ హాస్టల్ దగ్గర, శ్రీకాకుళం-532005.