విశాఖపట్నం

నిలబడదామా (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీరు అక్షరాలను కవితగా కూర్చేవేళ
నేను దీనుల కన్నీటిని తుడవ చూస్తాను
మీరు మనసును మధించి కవిత రాసేవేళ
నేను రోగుల కన్నులలో ఆనందమై నిలుస్తాను
మీరు వేదికలపై కవితాగానం చేసే వేళ
నాలోకి నేను తొంగి చూస్తూ
నన్ను నేనే వెతుక్కుంటాను
మీరు కవులుగా భుజకీర్తులు తగిలించుకున్న వేళ
నేను మనిషిని అని దృఢంగా చెప్పుకుంటాను
సందేహం లేదు మీరు గొప్పవారు
మీరు మర్యాదస్తులు మహానుభావులు
అయ్యా! ప్రాణినైన కారణాన ఒక సందేహం
మీరు ఎప్పుడూ చెబుతూనే ఉంటారా
మీ భుజాలను మీరే చరచుకుంటారా
కాగితంపై రాసేదే కవిత కాదు
అన్నలారా, మనసు అనే కాగితంపై
సాయం చెయ్యడం కవిత కావాలి
కవిత చెప్పడం కాదు
కవితలమే మనమైపోవాలి
అన్నలారా అయ్యలారా
అందమైన పది మాటలు పొందిగ్గా అమర్చి
ఎదుటి వారి చప్పట్ల కోసమే ఎదురు చూద్దామా
పేదల ఆకలి దప్పికలను తీర్చే దుప్పట్లమై నిలుద్దామా...

- శివలెంక ప్రసాదరావు,
సాలూరు.
సెల్ : 9949252558.
**
ప్రణయ తుణీరాలు

ఇక్కడే చూస్తున్నాను ఎన్నాళ్ల నుండో
కనిపెడుతున్నాను కనుచూపులతో
నీ నడక, నీ నడవడిక, అందుకేనేమో
ప్రణయ కావ్యాలు రాస్తున్నారు
పడతుల మీద కవులు
నన్ను కదిలించాయి మనసు మెదిలించాయి
నీ పలుకులు, వలపుల స్వరాలు నీ రూపం
నీ మందహాసం నా గుండె తాకే
ప్రణయ తుణీరాలు, మేను తాకే స్పర్శలు
అదిగో ఆ నవ్వే నన్ను కవ్వించింది
పెనవేయాలని, హృదయానికి అద్దాలని
ఆగలేక నేను అది గమనించనా?
అన్నీ వదలి, ఆఖరు మెట్టెక్కి దూకనా?
ఇది పిరికితనం, ఆలోచన లేని,
అనాగరికం, తన్ను తాను,
తమాయించని, తామసతనం
కౌగలించబోయాను తెల్లారింది!

- పోతనపల్లి పాపయ్య (పాపరాజు),
విజయనగరం-535002.
సెల్ : 9392289409.
**

తెలుగుభాష ఔన్నత్యం

ఏబదియారు అక్షరాల తెలుగు భాష
బహు తియ్యనైనది
అమ్మ పాలలా మధురమైనది
మల్లెలు, గులాబీల అందాల కన్నా
అపురూపమైనది మన తెలుగు భాష
అజంతా, ఎల్లోరా శిల్పాల కన్నా
అందమైనది మన మాతృభాష
గలగల పారే సెలయేరులాంటిది
హృదిని పులకింపజేయునది
మన తెలుగు భాష
రాళ్లలో రాగాలు పలికించగలిగే
రమ్యమైనది మన తెలుగు భాష
పద్య రచన ఒక్క తెలుగు భాషకే సొంతం
ఆటవెలది, తేటగీతి, సీస పద్యముల
రమణీయమైన తెలుగు భాష
పండిత పామరులు ఆస్వాదించు భాష
నన్నయ్య, అన్నమయ్యలకు పేరు తెచ్చిన భాష
శతాబ్దాల చరిత్ర గలది మన తెలుగు భాష
దేశభాషలందు తెలుగులెస్స
అని కొనియాడబడిన గొప్పదైన భాష
మన తెలుగు భాష
తెలుగు భాష ప్రాశస్థ్యం అన్ని భాషలకన్నా
బహు మిన్నయైనది
తెలుగు తేనెలూరు భాష
అందరూ మెచ్చు భాష!

- చెన్నా లక్ష్మణరావు, పాచిపెంట, విజయనగరం జిల్లా. సెల్ : 8985914107.
**

ఏవి?

అమ్మా అమ్మా చందమామ ఏది?
అపార్ట్‌మెంట్లు మింగేసాయే తల్లీ
అమ్మా అమ్మా తరులు గిరులు ఏవీ?
నరుని స్వార్ధమునకు తరగిపోయెనే
అమ్మా అమ్మా ఏవి వరి అన్నములు
కరవు కాటకాలకు కనుమరుగాయెనే
అమ్మా అమ్మా ఏవి గుమ్మసాలు, కుండపెంకులు
గో సంరక్షణ లేక గగనమాయెనే
అమ్మా ఏవి రామచిలుకలు, కోకిలమ్మలు
వనములు లేక కనుమరుగాయెనే
అమ్మా ఏవీ పిల్ల పిచ్చుకలు
సెల్ టవర్లొచ్చి సమసిపోయెనే
అమ్మా ఏవి ఆట మైదానములు
భూబకాసురులు మింగివేసిరే
అమ్మా ఏవి ఆటపాటలు
టివిలొచ్చి తరిగిపోయెనే
ఇంటర్నెట్‌తో వీగిపోయెనే!

- బండారు చిన్న రామారావు (లోగిస),
విజయనగరం జిల్లా.
సెల్ : 9553330545.