ఉత్తర తెలంగాణ

బతకనివ్వండి (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మల్లెల మకరంద జంట మంజుల, ప్రవీణ్‌ది. కష్టపడి చదువుకుని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. క్యాష్ కౌంటర్ తెరిచి బంగారు, వెండి నగలు తాకట్టు మీద రుణ సదుపాయం కల్పిస్తూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు. క్యాష్ కౌంటర్ రోజు రోజుకు విస్తరించి ఒక విత్త సంస్థగా మారింది.
ఇద్దరు పిల్లల బాగోగులు, ఇంటి పనులు చూస్తూ, విత్త సంస్థను నడపడం కత్తిమీద సాములా తయారయ్యింది. ఇంటి పనులు చూడడం మరియు కాపలాగా ఒక పని మనిషిని నియమించారు.
తాకట్టుపై తెచ్చిన నగలు ఇంట్లో భద్రంగా భద్రపరిచారు. పని మనిషి నమ్మించి నమ్మించి ప్రవీణ్, మంజుల లేని రోజు చూసి బంగారు వెండి నగల్ని సంచిలో సర్దుకొని పారిపోయాడు.
ఎంత వెతికినా పని మనిషి జాడ తెలియలేదు. ఏం చేసేది! ఎన్ని రోజులు దాగి ఉంటుంది! విషయం తెలిసిన ఖాతాదారులు పరుగు పరుగున ఇంటికి వచ్చి మా నగలు మాకిమ్మని రోజు వాదించగా, ఎక్కడి నుండి తెచ్చి ఇచ్చేది! చెలిమె కాదు గదా! తోడిన కొద్ది నీళ్లు వచ్చినట్లు ఏం చేసేది! కోడిపిల్లను గద్ద తన్నుకపోయిన చందం!
‘పోయిన నగలు వస్తామా! తలకు మించిన భారం. రోజుకు మించి కుమిలి రోధిస్తుండెను ప్రవీణ్ అంటె తిన్నట్టు లేకపోతే పంటేనన్నట్టు ఆరోగ్యం గతంలో వున్నట్లు లేదు.
ఏమయ్య రందితో అన్నము సక్కగా తినకున్నట్లయితే పోయిన సొమ్ము వస్తుందా! ఈ పిల్లల్ని చూసైనా కొంచెం తినవయ్యా! నాకు ఏమిటి తినబుద్ధి కావడం లేదు. మంజుల రోజు ఒకరిద్దరు వస్తూ మా నగలు మా కమ్మని ప్రాణం పీక్కతింటున్నారు. ఏం చేయాలో తోచడం లేదు.
ఈ రోజు పాయసం చేశారు. ముందుగా పాయసం తీసుకొమ్మని బలవంతపెట్టింది మంజుల. పిల్లల్ని దగ్గరకు తీసుకొని, పిల్లలకు తాగించి పాయసం మంజులను తాగుమంటూ ప్రవీణ్ కడుపునిండ తాగి పడుకున్నాడు.
ఉదయం ఆరు గంటలైనా ప్రవీణ్ లేవలేదు. మంజుల చేయి తట్టి లేపిన ఎంతకు లేవలేదు. మంజుల, పిల్లలు ఒకే ఏడ్పు!
లోకులు కాకులు ఎవరుకాదంటారు. ఒకరి కష్టం ఇంకొకరికి ముద్దు! వారం పది రోజులు వౌనంగా వున్నారు. తర్వాత ఎప్పటిలాగా ఇంటి చుట్టు తిరుగుతూ అడుగుతున్నారు. ఒక వైపు భర్త చనిపోయాడనే బాధ. ఇంకోవైపు ఖాతాదారులకు ముట్టజెప్పాల్సిన రొక్కము బాధ భరించలేక, ఉన్న ఇల్లు, భూమి జాగల్ని అమ్మి ఎవరి నగల విలువ మొత్తం వారికి ముట్టచెప్పింది మంజుల.
‘ఏం చేసేది భగవంతుడా! పెయ్యి మీద ఒక గురిజ ఎత్తు బంగారం లేకోపాయె! ఖాళీ చేతుల్తో మా కడుపు లెట్ల నింపుకొనుడు. ఎక్కడ లేని కష్టమొచ్చెనని, గుండె ధైర్యం చేసుకొని ఊరిలోని ఓ పూరి గుడిసెలో ఇద్దరు పిల్లలతో తల దాచుకుంటూ, ఉన్న ఊరు కన్న తల్లిలా, కూలి నాలి పనులు చేస్తు, నియంత్రణ రేఖ వద్ద జవాన్ డ్యూటీల మంజుల జీవితాన్ని కొనసాగిస్తుంది.
కొన్ని సంవత్సరముల తర్వాత మంజుల పేరు మీద ఉత్తరం వచ్చింది. పోస్ట్ మ్యాన్ ఉత్తరం మంజుల చేతికందివ్వగానే ఎక్కడ లేని ఆశ్ఛర్యంతో నాకు ఉత్తరమేంటి? ఎక్కడి నుండి వచ్చింది! కవరు తెరిచి చదువగా..‘నమస్తే మేడమ్, నేను ఒకప్పుడు మీ ఇంట్లో పని మనిషిగా చేరి నమ్మించి ఓ రోజు మీ ఇంట్లో నుండి విలువైన నగలన్ని ఎత్తుకపోయినవాన్ని ఒకటవ తారీఖున మమ్మల్ని కలవడానికి వస్తున్నాడు.
విషయం తెలిసి చుట్టు పక్కల గుమిగూడిన జనంకు ఎక్కడ లేని కోపం వచ్చి ‘మొదలు వాడైతే రాని చూద్దాం’ వీపుకు సున్నం పూయాలని ఆడోల్లు, మగోల్లు ఐసోల్లు, ముసలోల్లు అందరిదీ అదే మాట.
అందరికో కావలసిన వాళ్లు. ప్రవీణ్ ఎవరికో హాని తలపెట్టని చెట్టులాంటి మనిషి. ప్రవీణ్ భార్య మంజుల మానవత్వాన్ని నమ్ముతూ బ్రతుకుతున్న ఓ గొప్ప స్ర్తి. చేతనైన పనులు చేసుకుంటూ ఎవరితో ఎక్కువగా మాట్లాడని బంగారంలాంటి చక్కని గుణవంతురాలు.
ఒకటవ తారీఖు ఎప్పుడు వస్తుందోనని ఊరంత జనం కావాలి గాసినట్టు ఎదురు చూడనట్టం.
ఒకటవ తారీఖున ఉదయం తెల్లకారు రానేవచ్చింది. భార్య, బిడ్డతో కారు దిగగానే, వాని గల్లపట్టి వాయించుదామని ఆగమాగంగా వట్టిరి? వౌనంగా మంజుల మాత్రం ఆగుమంది. అందరు మొద్దోలె ఎక్కడి వాళ్లు అక్కడే నిశ్శబ్దంగా నిల్చొని వున్నారు. ముందేం జరుగుతుందోనని కొందరు ముసలోల్లు గుసగుస ముచ్చట పెట్టవట్టిరి!
మంజుల వచ్చిన వాల్లను మాత్రం మర్యాదగా కూర్చోమంది. మేము ఇక్కడికెందుకొచ్చామంటుండగానే, ఆయన భార్య రెండు చేతులు జోడించి, ‘మిమ్మల్ని మోసం చేయడం చాలా పెద్ద తప్పేనమ్మా..క్షమించరానిది. ఘోరమైన నేరము. మమ్మల్ని మన్నించమ్మా..మా ఆయన చేసిన పాపకార్యం వల్ల మీ ఆయనను పోగొట్టుక్నువు. ఈ పూరి గుడిసెలో ఇద్దరు పిల్లలతో జీవితం గడుపుతున్నావు.
మాకు బంగ్లాలు, కార్లు ఆర్భాటాలు అన్నీ వున్నవి. ఐనా ఏమి లాభమమ్మా! అందుకేనమ్మ మీక్కావలసిన ఆస్తుల్ని కాదనకమ్మ చూడమ్మ చూడు నా కూతుర్ని చూడు. పదహారేళ్ల వయసు ఇంకో నాలుగేండ్లు వస్తే పెళ్లి చేయాల్సింది.
ఏం చేసేదమ్మ, ఏం చేసేది చెప్పు! పుట్టుకతోనే మానసిక రుగ్మత. తిరగని చోట్లన్ని తిరిగినం. వెల్లని దవాఖానంటులేదు. ఎక్కడికెళ్లిన ఏమి కాలేదు. మాకు పాపం చుట్టుకుంది. ఆ పాపమెట్ల పోవాలెనమ్మా! తీసుకో మీ ఆస్తులమ్మా..అన్నాడు.
‘కోర్టులో కేసు చేసిన మీరే గెలుస్తారమ్మా! అని కొనసాగించాడు.
‘ఎక్కువ డబ్బులు ఎవరిస్తే న్యాయవాదులు ఆవైపే వాదిస్తారు. ఆ కేసే గెలుస్తుంది. మీ దగ్గర డబ్బుంది. మీకే గెలుస్తారు. ఐనా నేను కేసు వేయదల్చుకోలేదు. వేసేదుంటే ఆస్తుల్ని ఎత్తుకు పోయాకా, నా భర్త చనిపోయాడు. అప్పుడే వేసేదాన్ని మమ్మల్ని బ్రతుకనివ్వండి! అంది మంజుల.
కాదనకమ్మా..మోసపు సొమ్ము తాత్కాలిక సంబరాలు కల్గించినా భవిష్యత్తులో దాని ఉసురు తప్పకా తగులుతుంది. దాన్ని ఎవరు తప్పించుకోలేరు. క్షమించుమంటూ మంజుల కాళ్లను పట్టుకున్నారు.

- పెరుక రాజు వెల్లింగ్టన్, నీలగిరి, తమిళనాడు సెల్.నం.9443091384