దక్షిన తెలంగాణ

కన్నీళ్లు లేని మనిషై..! (మనోగీతికలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తూనీగల గుంపులాంటి
మిత్ర బృందంలో
పెబ్బ తూనీగ వాడు
స్కూలు మైదానంలో
అన్ని ఆటలూ వానియే అన్నట్టు
ఆడినవాడు
ఊరంతా జింకపిల్లలా తిరిగినవాడు
ఇంట్లో
క్షణం కూడా కాలునిలుపని వాడు
కదలలేని కష్టం మీదపడి
మంచానికి అతుక్కుపోయి
ఎలా ఉంటున్నాడో..
వాడికెంత ఆశగా వున్నదో
అప్పటిలా పరుగెత్తాలని
ఆ వీధి పొడవంతా నడువాలని
చిన్నప్పుడు నడిపించిన నానే్న
మళ్లీ నడిపిస్తున్నట్టు
చక్రాల కుర్చీ తోస్తూవుంటే
కళ్లు కన్నీళ్లెత్తుకున్నవి
చాలారోజుల తరువాత చౌరస్తాలో
కొత్తగాలి పీలుస్తూ
పూలబండి దగ్గర పూలబుట్టలా
వీల్ చైర్‌లో పద్మంలా
వాడిని చూడగానే
ఆగలేనంటూ
కన్నీటి చినుకొకటి రాలిపడ్డది
నాతో తిరిగినవాడు
నా పక్కన నడిచినవాడు
నా కళ్లముందే
పించను డబ్బులు తీసుకుంటుంటే
నోటిలో నాలుకే లేనట్టు
చుట్టూ వౌనం ముసురుకున్నది

- జి.రామకృష్ణ
భూదాన్ నల్లగొండ జిల్లా
సెల్.నం.8977412795
**
మదుపు

కాగితం పొదుపు చెయ్యి
చెట్లకు మేలు
ధనం పొదుపు చెయ్యి
నీ పిల్లలకు మేలు
మాటను పొదుపు చెయ్యి
నీకు మేలు
ఆహారం పొదుపు చెయ్యి
ఆరోగ్యానికి మేలు
జలాన్ని పొదుపు చెయ్యి
జగతికి మేలు

- గుండు రమణయ్య
కరీంనగర్ - 505415
సెల్.నం.9440642809
**
పూదోట!

ఏ బడిలో నేర్వనిది
కవితా సుమాల పూదోట
నా బ్రతుకమ్మ పాట!
పల్లె పల్లెల్లో..
సమైక్య భావాన్ని పెంచే పాట
అందంగా..
ఆడపడుచులు ఆడుతూ పాడే పాట!
ప్రకృతిని ఆరాధిస్తూ..
అందరినీ ఆలరించేలా పాడే పాట!
విశ్వంలోనే లేదు..
ఇంత చక్కని ఆటా..పాట!
జానపదులకు నిలయం నా పాట!
గ్రామీణ భారతాన్ని ఆవిష్కరించే..
పూలమూట.. నా బ్రతుకమ్మ పాట!

- కందుకూరి కృష్ణవేణి
కరీంనగర్, సెల్. 9700222892
**
కాగితం!

ఎన్ని కన్నీళ్లను
నింపుకుందో కాగితం!
మరెన్ని ప్రేమ కావ్యాలను
ఒంపుకుందో కాగితం!
అది ఎంతమంది చిత్రకారుల కుంచెలతో
ముస్తాబైందో!
మరెంతమంది అమరుల ఊపిర్లను
దాచుకుందో!
కాగితం ఎన్ని నిద్రలేని
రాత్రులను అద్దుకుందో!
ఎన్ని గాయాల గుండెలను హత్తుకుందో!
ఎన్ని నిజాలను
భళ్లున పగులగొట్టిందో!
ఎంతమంది ఇజాలను అణిచివేసిందో!
ఎన్నో మానవతా విలువలను..
చాటి చెప్పిన కాగితం
చెట్టు ఆఖరి శ్వాసకు ప్రతీక!
మనిషి భావజాల ఉఛ్వాసకు జ్ఞాపిక!

- యడవల్లి శైలజ
పాండురంగాపురం, ఖమ్మం జిల్లా
సెల్.నం.9394171299
**
తాత

మా ఇంటిముందరన్న పరుపుబండ
ఆత్మీయ పలుకరింపులకు వేదిక తాత
పొద్దువొడువంగ బండమీద కూసున్న తాతతో
బతుకు ముచ్చట్లు గడిచిన జ్ఞాపకాలు
స్మృతులన్నీ తవ్వుడే ఏకరువు పెట్టుడే
ఎదుర్కొన్న అనుభవాలు నెమరువేసుకునుడే
బారెడు పొద్దెక్కిన బతుకు కథ ఒడవదు
విచారంతోనున్న మనిషిని చూస్తే
ఓదార్పు మాటలతో భరోసానిస్తాడు
బతుకు భాష్యాన్ని తెలిపి
జీవనంపై ఆశలు చిగురింపజేస్తాడు
కొత్తగా జంటైన సోరోళ్లు కనబడితే
కడుపు పండే దెప్పుడంటూ ఆటపట్టించి
చల్లని దీవెనలు ఇస్తడు
సమాజపు పోకడలను ఏకరువుపెడతాడు
మనషుల మనసుల అంతరంగాలను అంచనావేస్తాడు
నాటి నేటి కాలానికి అతనొక వారధి
తన పరివారానికి తానొక సారధి

- బాలసాని కొమురయ్య
భోజన్నపేట, పెద్దపల్లి జిల్లా, సెల్.నం.9912657877
**
విలక్షణ తీర్పు

ఎన్నికలొచ్చినప్పుడు
ఎదిరించే అవకాశాలొస్తాయి!
ఓపిక పట్టిన
ఓటరు మహాశయులకు
ఓటనే ఆయుధం తోడవుతుంది!
అర్థబలం, అంగబలంతో
గుండాయిజం,
పెత్తందారి పోకడలతో
ఎన్నికలలో గెలిచి
ప్రజాసంక్షేమం మరచి
స్వార్థం కోసం, స్వలాభం కోసం
తమ కుటుంబ శ్రేయస్సు కోసం
వారసత్వ రాజకీయాలతో
పదవులు పొందాలనుకునే
నాయకులను ఓడించాలి!
నీతి, నిజాయితి,
విజ్ఞానం, విశ్వసనీయత గల
అభివృద్ధి కోసం పరితపించే
అభ్యుదయ భావాలు గల
విజ్ఞులను ఎన్నుకోవాలి!
ఎన్నికల మహా సంగ్రామంలో ఎప్పుడూ మీరే విజేతలు కావాలి
అందుకే ఆలోచించండి
వివేకంతో విలక్షణ తీర్పునివ్వాలి!

- సంకెపల్లి శ్రీనివాస రెడ్డి, మహబూబాబాద్, సెల్.నం.9705803618
**
చిగురుమొక్కనై..!

అల్లిబిల్లి తారలతో
ఆకాశం అల్లుకుందేమోకాని
నా మనసు కాదు
బాహ్య ప్రపంచమంత
చీకటి అలుముకుందేమోకాని
నా ఆత్మకాదు
పచ్చదనమంతా నేడు మోడువారి
ఎండిపోయిందేమో కాని
నా హృదయం కాదు
బంధాలు, అనుబంధాలు
చచ్చిపోతున్నాయేమోకాని
మానవ సంబంధాలు కాదు
పూలు పుష్పించి ఎండిపోతుంటాయి
ఫలాలు కాచి పండిపోతుంటాయి
కాని నేను నేనుగా ఉండాలని
శాసించె శక్తిగా ఎదగాలని
పుడమి మీద నా ఉనికి చిరకాలం నిలవాలని
ప్రకృతితో నా స్నేహం
కలకాలం వుండాలని
అనంతమైన ఆలోచన తెంపరలతో
నిరంతరం చిగురుమొక్కనై..

- రాజేశ్వరి బొమ్మిదేని
పెద్దపల్లి, సెల్. 9160908045
**
విజయ పతాకం

ఎంత చేసినా
ఇంతేనా? అనుకుంటే
ఇంతే సంగతులు..
ఎక్కడ వేసిన గొంగళి
అక్కడే వుంటుంది!
అందుకే మిత్రమా!
కార్యక్షేత్రంలో అదనుజూసి
చేజిక్కించుకోవాలి
విజ్ఞతతో
విజయ పతాకాన్ని ఎగురవేయాలి
వచ్చిన అవకాశాన్ని
సద్వినియోగం చేసుకుంటూ
అడుగులు ముందుకేయాలి

- కూర్మాచలం వేంకటేశ్వర్లు, కరీంనగర్, సెల్.నం.7702261031