దక్షిన తెలంగాణ

తెలుగు పద్యానికి దారిచూపిన తెలంగాణ (అంతరంగం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ సాహిత్య చరిత్రను రాగద్వేషాలకు అతీతంగా పునర్నిర్మించి సత్యావిష్కరణ తోడ్పడాలని భావించే ప్రముఖ కవి, రంగస్థల నటులు గన్నమరాజు గిరిజా మనోహర బాబు మహబూబ్‌నగర్ జిల్లా ఆలంపురంలో జన్మించినా ఆయన వృత్తిరీత్యా వరంగల్‌లో స్థిరపడి పోయారు. ప్రభుత్వ డిగ్రీ లెక్చరర్‌గా ఉద్యోగ విరమణ చేశారు. ఆయన సమర్థమైన కవి.. మంచి వక్త.. గొప్ప రంగస్థల నటులు.. అన్నింటికి మించి అనేక యుజిసి జాతీయ విద్యా సదస్సుల్లో పత్ర సమర్పణ చేశారు. పలు అంశాలపై ఆకాశవాణిలో ప్రసంగాలు చేశారు. దూరదర్శన్ ద్వారా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రముఖ దిన, వార, మాస పత్రికల్లో అనేక సాహితీ వ్యాసాలు రాశారు..పలు సాహిత్య, రంగస్థల ప్రత్యేక సంచికలకు సంపాదకత్వం వహించారు. వివిధ ప్రాంతాల్లో వివిధ అంశాలపై ప్రత్యేక ప్రసంగాలు చేసి మంచి వక్తగా గుర్తింపుపొందారు. సాహిత్య రూపకాలు, ప్రదర్శనలు నిర్వహించిన అనుభవం ఆయనకుంది. సిద్ధాంత గ్రంథాలు, వచన కవితా సంపుటాలు, సంస్కృత రచనలు, ఆయన ద్వారా పరిచయానికి నోచుకున్నాయి. పలు గ్రంథాలకు పీఠికలు రాశారు. వరంగల్ ‘సహృదయ’ సాహిత్య సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక కార్యదర్శిగా ఎన్నో కార్యక్రమాలను నిర్వహించారు. ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించడానికి ‘మెరుపు’ ఆయనతో ముచ్చటించింది.. ముఖాముఖి వివరాలు ఆయన మాటల్లోనే ‘మెరుపు’ పాఠకులకు అందిస్తున్నాం.
**
ఆ మీ దృష్టిలో కవిత్వం అంటే ఏమిటి?
నచ్చిన సన్నివేశాన్ని లేదా అంశాన్ని గానీ, కదిలించే సంఘటనలను గానీ, కలిగిన అనుభూతిని గానీ కవి పాఠకుని గుండెలోకి చేర్చే అక్షర సమూహాన్ని స్థూలంగా కవిత్వమని చెప్పవచ్చు.. కానీ ప్రతి అక్షరం కవిత్వం కాదు. దీనే్న తిలక్.. ‘కవిత్వం అంతరాంతర జ్యోతిస్సీమల్ని బహిర్గతం చెయ్యాలి’ అన్నాడు.

ఆ మీకు సాహిత్యంతో పాటు రంగస్థల నటునిగా అపార
అనుభవం ఉంది కదా! మీకు తృప్తినిచ్చింది
సాహిత్యమా? రంగస్థలమా?
మీ రెండు కళ్లలో ఏది ఇష్టమని అడిగితే ఏం సమాధానం చెపుతాము.. నాకు సాహిత్యం, రంగస్థలం రెండూ రెండు కళ్లలాంటివి. రెండూ ఇష్టమే!

ఆ తెలంగాణ సాహిత్యం వెలుగులోకి రావాలంటే
ఏం చేయాలి?
ప్రతి సాహిత్య ప్రేమికుడు ఇప్పుడు ఆలోచించాల్సిన అంశమిది! తెలుగు పద్యానికి, నన్నయ భారతానికి దారి చూపింది తెలంగాణమే! తొట్టతొలి పద్యం ఇక్కడే పుట్టింది. దానికి శాసనధారాలూ ఉన్నాయి. తొలి ద్విపద ఈ నేలపైనే పురుడు పోసుకుంది. తొలి ఉదాహరణ కావ్యం ఇక్కడే రూపుదిద్దుకుంది. కొన్ని కారణాల వల్ల మరుగున పడ్డ మన తెలంగాణ సాహిత్యాన్ని వెలుగులోకి తేవాల్సి ఉంది. సాహితీ సృజనకారులు, చరిత్ర పరిశోధకులు పాలకులు, కలిసికట్టుగా తెలంగాణ సాహిత్య చరిత్రను రాగద్వేషాలకు అతీతంగా పునర్నిర్మించి సత్యావిష్కరణకు తోడ్పడాలి.

ఆ పద్య కవిత్వంలో ఆశించినంత సృజన జరక్కపోవడానికి
కారణమేమిటి?
ఇది తప్పక వేయాల్సిన ప్రశే్న! పద్యం రాయడం కష్టమని, అర్థం చేసుకోవడం కష్టమని చాలామందికి భ్రమలున్నాయి.. అది తప్పని నిరూపించిన వాళ్లు ఎంతోమంది ఉన్నారు. సాధనతో పద్యం రాయడం సులభమని గ్రహించాలి.. పద్య కావ్యాలు అనుకున్నన్ని రాకపోయినా.. ఛందోబద్ధ శతకాలు వెలువడటం మాత్రం ఆగిపోలేదు. అనేకమంది కవులు ఆధ్యాత్మిక అంశాలే కాక సామాజిక అంశాలను వ్యవహార భాషలో సరళంగా పద్య కావ్యాలను ప్రకటిస్తూనే ఉన్నారు!

ఆ సాహితీ సాంస్కృతిక సంస్థలు క్రియాశీలకంగా
పనిచేయడానికి మీ సలహాలు, సూచనలు ఏమిటి?
ఉత్తమ సాహిత్య నిర్మాణం దిశగా, విలువలు ప్రధానంగా, చైతన్యం దిశగా సాహిత్య, సాంస్కృతిక సంస్థలు పనిచేయాలి. ప్రలోభాలకు లోనుకాకుండా, సాహిత్యం పట్ల పూర్తి నిబద్ధతతో కార్యక్రమాలు నిర్వహించాలి. ఆశలకు పోకుండా ఆశయాలే లక్ష్యంగా సంస్థలు పనిచేయాలి. గ్రంథావిష్కరణలు, పురస్కార ప్రదానాలే కాకుండా సాహిత్య సంబంధ కార్యశాలలు, గోష్టులు, సదస్సులు నిర్వహించాలి.

ఆ సాహితీ పురస్కార ప్రదానాలపై మీ అభిప్రాయం?
రచయితలు, కవులను ప్రోత్సహించి మరింత కార్యోన్ముఖులను చేయడానికి సాహితీ పురస్కారాలు దోహదపడతాయి.. దురదృష్టవశాత్తు కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థలు పురస్కారాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణి పెరగడం వల్ల.. పారదర్శకత లోపిస్తోంది. నిజాయితీ కొరవడి.. అనుమానాలకు తావిస్తోంది. అర్హులైన ప్రతిభావంతులను ఒకింత వేదనకు గురి చేస్తున్నాయి! సక్రమంగా ఎంపిక చేసి.. అర్హులకిస్తే ఏ సమస్యావుండదు.

ఆ మీరు వెలువరించిన రచనల్లో మీకు తృప్తినిచ్చినవి?
‘కథకు శతమానం’ కథానికను గురించిన ప్రముఖుల వ్యాస సంకలనానికి సంపాదకత్వం, శతకసమీరం ఆకాశవాణి ప్రసంగాల వ్యాస సంకలనం, నాలుగో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారిచే ప్రకటింపబడిన లఘు గ్రంథం మొదలగునవి నాకు తృప్తినిచ్చాయి. అయితే పలు పత్రికల్లో నేను రాసిన గ్రంథ సమీక్షలు, విమర్శలు, పరిచయాలు, సాహిత్య, సాంస్కృతిక వ్యాసాలు నాకు తృప్తినిచ్చాయి.

ఆ ‘సహృదయ’ ప్రధాన కార్యదర్శిగా మీ సంస్థ
కార్యక్రమాలను తెలుపుతారా?
గత పదహారేళ్లలో ‘సహృదయ’ సంస్థ ద్వారా అనేక ఆధ్యాత్మిక, సాహిత్య కార్యక్రమాలను నిర్వహించడంలో ప్రధాన భూమికను పోషించానన్న తృప్తి నాకు ఉంది. రాష్ట్రంలోని ప్రముఖ పండితులను ఆహ్వానించి ఆధ్యాత్మిక అంశాలపై ప్రసంగాలు ఏర్పాటు చేశాం. దాదాపు యాభైకి పైగా గ్రంథావిష్కరణలు జరిగాయి. జిల్లాలోని ప్రసిద్ధ ఆలయాల్లో కళాప్రదర్శనలు ఏర్పాటు చేశాము. గత ఎన్నో ఏళ్లుగా ప్రతి ఉగాదికి ‘సహృదయ ఉగాది ఉత్సవం’ పేర విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. అష్టావధానం, సంగీతావధానం, హరికథ, బుర్రకథ, ఒగ్గుకథ, మిమిక్రీ, ఈలపాట, పౌరాణిక నాటిక ప్రదర్శన, రామాయణ గేయగాన ప్రదర్శన, సాంస్కృతిక విభావరి, సంగీత గేయధార వంటి కార్యక్రమాలు నిర్వహించి అందరి మన్ననలు పొందాం. అంతేగాక గత కొన్ని సంవత్సరాలుగా రాష్టస్థ్రాయి ఆహ్వాన నాటికల పోటీలు నిర్వహిస్తున్నాం. ఒద్దిరాజు సోదర కవుల స్మృత్యకంగా ‘సహృదయ సాహితీ పురస్కారం’ ప్రతి ఏటా అందిస్తున్నాం.

చిరునామా :
గన్నమరాజు గిరిజా మనోహర బాబు
2-11-501/5
విజయనగర్ కాలనీ
హన్మకొండ - 506009
సెల్.నం.9949013448
**
ఇంటర్వ్యూ: దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544