దక్షిన తెలంగాణ

పరిమళపు జల్లు కురిసింది..! (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గేటు తీయగానే కుడిపక్కన నాకు స్వాగతమిస్తూ, చిరుగాలికి తలలూపుతూ అందంగా నవ్వుతుంది మల్లెపొద. రోజు దాన్ని చూస్తూ ఎన్ని కొమ్మలు, రెమ్మలు మొలిచాయి. ఎన్ని పూమొగ్గలయ్యాయి. మరిన్ని రేపటికి విరియబోతున్నాయోనని మదినిండిన భావనతో లెక్కేసుకుంటూ లోనకు అడుగుపెడతాను. సంధ్యా చీకట్లు ముసురుకోగానే ధవళవర్ణపు వెండి మొగ్గలు, మరింతగా మిసమిసను సంతరించుకుంటాయి. తొలి చంద్రకిరణం మల్లెపొదపై పడి తళుక్కున వెనె్నల వర్షం కురిసింది. మా మల్లి ముగ్ధమనోహరమైన మల్లికగా అరవిచ్చింది. తెలియని గత స్మృతుల పరిమళాలను వెదజల్లింది. జంట మల్లెలు, చల్లని వెనె్నలలో ఒద్దికగా తలలూపుతూ స్వచ్ఛమైన, గమ్మతె్తైన పరిమళాలను వెదజల్లుతుంటే..ఆ దృశ్యాన్ని కన్నులలో నింపుకొని పులకిస్తూ ఉండిపోయాను నేను. అనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యాను. కాసిన్ని నీళ్లు పోసి, పాదులు చేసి పెడితే ఇవి ఎంత నిష్కల్మషంగా విచ్చుకుంటున్నాయి! ఆ వెనె్నల్లో మల్లెపొద పక్కన కుర్చీ వేసుకొని కూర్చొని విచ్చిన ప్రతి మల్లి మనస్సును చదవాలని, మరింత తాజా అనుభూతిని మదినిండా నింపుకోవాలని మనసు మరీ మరీ ఆరాటపడింది సుమా! అలా.. ఆకాశంలో కదిలిపోతున్న నిండు చంద్రుని వంక చూస్తూ, కాసేపు మా మల్లెపొద పక్కన ఆ పూల పరిమళాల తేరులో విహరించాను. గొప్ప రిలీఫ్! ఎంతో ఊరట. ఒత్తిడితో కరువైన మనశ్శాంతిని తిరిగి పొందాను. మనస్సంతా చలచల్లగా తనువంతా హాయిగా సుతిమెత్తగా గాల్లోకి తేలిపోతున్నట్లుగా విచ్చిన మల్లెపొద అద్వితీయ సౌందర్యానికి పరవశం పొందాను.
ఎండాకాలం ముగిసింది. మల్లెపొద చిగురించటం మానింది. పెద్ద పెద్ద ముదిరిన ఆకులతో అది పండు ముతె్తైదువులా, మొగ్గలు వేయక తీగలు ఎండుతూ నిర్జీవంగా తయారయింది. ఇక లాభం లేదనుకొని, ఎండిన ఆకులు తెంపేస్తూ, ముదిరిన తీగలను సరి చేస్తూ రోజూ నీళ్లు పోస్తూ..
పేపర్లో మరీ చదువుకొని కాస్త ఎరుపు కూడా కొని వేసానండోయ్! అయినా మొగ్గ తొడగటం లేదు. ఎంతైనా సీజన్ ముగిసింది కదా! ఓ ఆదివారం పొద్దుటే, తీరిగ్గా కాఫీ తాగి మల్లెపాదును ప్రక్షాళన చేద్దామనుకొని చిన్న కొడవలితో దాని మొద్దువారిని తీగెలను నరుకుతుంటే నా మనస్సంతా బాధగా మూల్గింది. ఇన్ని రోజులు మమ్మల్ని అలరించి, మదిలో ఎన్నో తీయనైన ఊసుల్ని నింపి తన తాజా పరిమళాలతో అటు దేవుని పటాల్ని, అప్పుడప్పుడు నా జడని అలరించి, అలంకరించిన మల్లెపాదును తుత్తునియలు చేస్తున్నానే అది!
ఓ వారం రోజులుగా నాకు గేటు తీయగానే అది మూగగా మూల్గిన ధ్వని వినిపించింది. బోసిపోయి శూన్యంగా వేలాడుతున్న పందిరి కన్పించింది. రోజూ నీళ్లు పోస్తూ, కొత్త మట్టిని తెచ్చివేస్తూ, ఎట్టకేలకు దానిలో జీవం నిండింది. మా మల్లెతీగ మళ్లీ చిగుర్లు వేయడం ప్రారంభించింది. నవనీతం లాంటి తేజస్సుతో చిరు ఆకులు నున్నగా మెరవసాగాయి. మరో వారం రోజులకు రెండు కొమ్మలు అటు ఇటుగా దట్టంగా పెరిగాయి. మళ్లీ మొగ్గలు లేస్తుందన్న ఆశతో దానికి క్రమం తప్పకుండా నీళ్లు పోయడం మాత్రం మరువడం లేదు. ఏదో ఒక రోజు మా మల్లి మళ్లీ మొగ్గ తొడుగుతుందనే ఆశ, మా యింటి పసిబిడ్డ అయి వట్టింట్లో విరబూస్తున్న నమ్మకం నాలో కల్గాయి. అమ్మ జన్మనిస్తే మొక్క పునర్జన్మనిస్తుంది అంటారు. నా ఆలోచనల్లో నిండిన మల్లిని తల్చుకున్నప్పుడల్లా..నాకెందుకో రవీంద్రుని గీతాంజలిలోని కొన్ని వాక్యాలు గుర్తొచ్చాయి. ‘నాకు బహుమానంగా ఓ చిన్ని పువ్వుని తెచ్చి, నవ్వు దిగివచ్చి, నా కుటీరం వాకిట నిలిచావు’. నా ఆలోచనల్లో నిండిన మల్లిని తల్చుకున్నప్పుడల్లా. ‘మల్లె తీగవంటిది మగువ జీవితం చల్లని పందిరి ఉంటే అల్లుకుపోయేనూ’ అంటూ రేడియోలో పాట ఏదో వీనులవిందుగా సోకింది. నిజమే కదూ! పూజలు చేయ మల్లియ తెచ్చాను అంటూ సున్నితమైన మా మల్లియ మళ్లీ వికసించాలనీ, పరిమళపు జల్లు కురియాలనీ.. నేను నిరీక్షించసాగాను!

- బి.కళాగోపాల్, నిజామాబాద్, సెల్.నం.9441631029