విశాఖపట్నం

నిజాయితీ కవిత్వం నల్లమల నందివర్ధనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన తల్లి కీర్తిశేషులు భారతమ్మకి భక్తిశ్రద్ధలతో అంకితమిచ్చిన డాక్టర్ కురుమేటి కిశోర్‌కుమార్ కవితా సంపుటి ఈ నంది వర్ధనాలు. నంధ్యాలలో ప్రముఖ దంత వైద్యుడిగా ఉంటూ మరో వంక సాహితీప్రియత్వం, రచనా పటిమ గల సవ్యసాచి. ఇది వీరి ప్రథమ రచన. చేయి తిరిగిన అనుభవం ఉన్నట్లు రాశారు ఆయన. ఇందులో మొత్తం 56 కవితలున్నాయి. అన్నీ వైవిధ్యంగా సాగాయి. కొన్ని భారతీయ సంస్కృతికి అద్దం పడతాయి. కొన్ని భౌగోళిక, ప్రాకృతిక సౌందర్యాన్ని సందర్శింపజేస్తాయి. కొన్ని సామాజిక స్పృహను కలిగిస్తాయి. మరికొన్ని జీవకారుణ్యాన్ని, శాంతిని బోధిస్తాయి. అన్నింటిలో మానవతావాదం తొణికిసలాడుతుంది. ఈ కావ్యానికి లబ్దప్రతిష్టులైన పలువురు కవులు పరిమళాన్ని వెదజల్లారు. స్వామి వివేకానంద, నెహ్రూ, బాపూజీ, కలాం, విపి, సచిన్ వంటి మహనీయుల వ్యక్తిత్వాలు కవితావనంలో కమనీయంగా భాసిస్తాయి. యువతకి, నవతను, స్ఫూర్తిని చేకూరుస్తాయి. చెట్టు, చీమ, చినుకు, పల్లె, పిచ్చుక, కాకి వంటి కవితలు కవి హృదయపు లోతుల్పి చూపించి పాఠకుల యెదలను స్పృశిస్తాయి. ఓటు, పొగాకు, కాలగమనం, కౌముది వంటి కవితల్లో కవిత్వం కదం తొక్కింది. జాతిని జాగృతపరిచి కర్తవ్యాన్ని గుర్తు చేస్తాయి. చాలా కవితల్లో మానవతావాదానికి పెద్దపీట వేశారు కవి. తెలుగు మాతృభాష కాదని, అమృతభాష అని, అమ్మభాష అంటాడు కవి. దొరికిన దాంతో తృప్తి పడి ఉన్నంతలో సంతృప్తిగా జీవించు, అల్పసంతోషులం, ఎంత పనైనా ఓర్పుగా చేయు నేర్పరులం, దినదిన గండం నూరేళ్లాయుష్షులా జీవించు చిరుప్రాణిలా అన్న పంక్తుల్లో సమాజానికి మంచి సందేశం ఉంది. ఊరపిచ్చుకలు కృషీవలుల నేస్తాలని, సస్యరక్షకులని, పిట్ట కొంచెమైనా కూత ఘనమన్న ఆర్యోక్తికి వారుసులమని వర్ణించడంలో కవి ప్రతిభ కనిపిస్తుంది. అలాగే కాకిది కృష్ణవర్ణమని, పితృదేవతల ప్రతినిధియని, శనేశ్వరుని వాహనమని, అల్పసంతుష్టియని, కాకాసురుడ వారసులని, కాకిస్నానం, కాకి ఎంగిలి, కాకిలెక్కలు, కాకిగోల, కాకమ్మ కథలు వంటి అనేక సామెతలు, నానుడులు నాలుకలపై నర్తిస్తాయన్నది వాస్తవం. తొలకరి చినుకు కవితలో పాఠకుల్ని తడిపి సేదదీర్చారు. ఇలా వీరి కవితలన్నీ వాస్తవానికి దగ్గరై వికసిస్తాయి.

- చెళ్లపిళ్ల సన్యాసిరావు, సెల్ : 9293327394.