నెల్లూరు

నల్లధనంపై కవితలు భేష్ (స్పందన)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గతవారం మెరుపులో ప్రచురించిన నల్లధనంపై కవితలు చాలా బాగున్నాయి. అర్ధరాత్రి నిర్ణయం శీర్షికతో చాకలికొండ శారదగారు రాసిన కవిత సామాన్యుల కష్టాలను వర్ణించింది. అలాగే యుద్ధం పేరుతో కుర్రాప్రసాద్ గారు రాసిన కవిత ఇంకా బాగుంది. నల్లధనాన్ని స్వాగతిస్తూ చిన్న చిన్న ఇబ్బందులు సహజమే.. భరిద్దాం అంటూ ఉత్తేజభరితంగా రాసిన ప్రసాద్‌గారికి ధన్యవాదములు. కొడవలూరు ప్రసాదరావు గారి కవిత నల్లధనమా పారిపో కూడా బాగుంది. కుబేరుల ఇళ్లల్లో కులుకుతూ, దేశ సౌభాగ్యం కోసం ప్రతి ఒక్కరికి సహకరిద్దాం అంటూ మంచి వాక్యాలతో కవితను మలిచిన విధం బాగుంది.
- రేఖారాణి, ఒంగోలు
- ఇల్లెందు సాయిరాజా, కోట
- మల్లెళ్ల రాంబాబు, తిరుచానూరు
- అయితా శ్రావణి, రేబాల
**
మొక్కుబడి కథ బాగుంది

అమరావతి రాజధాని నేపధ్యంలో సాగిన మొక్కుబడి కథ బాగుంది. ఆంధ్రుల రాజధాని అమరావతి కావాలని కల కనడం, ఆ కలను నేరవేర్చుకునే నేపధ్యంలో అమరావతి యాత్ర చేయడం వంటి నేపధ్యంలో సాగిన సంభాషణలు బాగున్నాయి. కథ మొత్తం ఎక్కడా బోరింగ్ లేకుండా సాగింది. చివరిలో ఒక ఆయుర్వేద వైద్యుడు కనిపించి మళ్లీ మాయమవడం కొసమెరుపు. రైలు సంభాషణలు బాగున్నాయి.
- అశ్వని, సింగరాయకొండ
- తాటికొండ చంద్రశేఖర్, రాపూరు
- అవిలాల రేవతి, తిరుపతి
***

రచనలకు
ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ
ఈ పేజీ మీది...
మీ ఆలోచనలకు అక్షర రూపం...
సమాజానికి కావాలి మణిదీపం!
మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా,
మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి,
ఆవిష్కరించే అద్భుత అవకాశమే
ఈ ‘మెరుపు’.
మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.
ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, సర్వే నెం.527, బురాన్‌పూర్ గ్రామం, చెముడుగుంట (పోస్టు), వెంకటాచలం (మం) నెల్లూరు జిల్లా. ఫోన్ : 0861-2383882 merupunlr@andhrabhoomi.net