నెల్లూరు

గాత్ర గంధర్వునికి నీరాజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ సంగీత సౌరభం నేలరాలింది
ఓ సుస్వర, సుమధుర గానామృతం
సుదూర తీరాలకేగింది
ఓ అపర త్యాగరాజు ఆహుతులను వీడి
అమరులయ్యారు
ఓ వెండితెర స్వరధ్రువతార అదృశ్యమైంది
ఓ రాగాల సృష్టికర్త అంతర్ధానమయ్యారు
ఓ వాగ్గేయకారుడు స్వర్గానికేతెంచారు
ఓ సంగీత దిగ్గజం తనువు చాలించింది
ఓ స్వరకర్త (మహాభి) నిష్క్రమించారు
ఓ గాత్రమాంత్రికుడు అవని అక్కున చేరారు
ఓ గాన గంధర్వుడు గగనానికేగారు
ఓ సుప్రసిద్ధ విద్వాంసుడు కీర్తిశేషులయ్యారు
గాన వైదుష్యంలో ఓ మేరు పర్వతం
కుప్పకూలింది
శాస్ర్తియ సంగీత జగత్తులో
ఓ మహాదిగ్గజం అస్తమించింది
సప్తస్వరాలు దుఃఖ సాగరంలో మునిగిపోయాయ
రసజ్ఞుల హృదయాలు మూగవోయాయి
వాయిద్యాలన్నీ అశృనయనాలయ్యాయి
సరిగమలు నివ్వెరపోయాయి
రాగాలాపనే ఆయన శ్వాస
శ్రోతలను పులకరింప (పరవశింప)జేయడంపైనే ఆయన ధ్యాస
ఆకాశమే ఆయన ప్రతిభకు హద్దు
అంకితభావం, నిబద్ధతలే ఆయనకు ఆభరణాలు
400 పాటలకు స్వరకల్పనే
ఆయన ప్రావీణ్యానికి తార్కాణం
స్వరంపై మమకారం ఆయన
వినమ్రతకు నిదర్శనం
త్యాగయ్య, అన్నమయ్య, రామదాసుల ఆత్మలను అందిపుచ్చుకున్న అందెవేసిన చేయి ఆయన
పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ, సంగీత కళానిధి, సంగీత కళాశిఖామణి వంటి
అవార్డుల రివార్డులకే వనె్న తెచ్చిన తెలుగు
కళామతల్లి ముద్దుబిడ్డ ఆయన
ఎనిమిదిన్నర దశాబ్దాల ప్రాయంలోనూ
నిత్యనూతన గానామృతాన్ని తొణికిసలాడించిన ధన్యజీవి ఆయన
ఆయన స్వరజీవితం అపూరూపం.. అద్భుతం.. అనిర్వచనీయం..
ఆదర్శనీయం.. ఆచరణీయం..
ఆ మహామనీషి మంగళంపల్లి బాలమురళీకృష్ణ రసజ్ఞుల హృదయాల్లో ఎప్పటికీ శాశ్వతం ఆయన స్మృతి
ఆ అమరునికి అక్షర నీరాజనంతో
అశ్రునివాళి.. స్మృత్యంజలి.. బాష్పాంజలి..

- ప్రసాద్ ఎస్.వి.కె
చరవాణి : 9949843105, నెల్లూరు
**

కళాహృదయుని
కన్నీటి నివాళి

భారతావనిలో ఆవిర్భవించిన
కరుణామృత కడలీ! బాలమురళీ!
అజరామరం - అనితర సాధ్యం
స్వరార్చనలో నీదు సరళి!
రసరమ్యం - రాగభరితం
రోగనివారణ నీదు రచన
సరిగమలతో మలచబడిన
స్వర్గలోక ‘సరి’నిచ్చెన
దేదీప్యమానంగా వెలుగుతూనే
దివికేగగా నీదు తేజం
దిగులుతో పొగులుతోంది
దిక్కుతోచక కళాసమాజం
‘విధి’ని మెప్పించుటకై
విషాదరాగాన్ని ఆలపించిన ఓ మురళీ!
విలాపాగ్ని జ్వాలలలో విలవిలలాడుతూ
విశ్వమంతా అర్పిస్తుండగా అశ్రునివాళి..
పరలోకమునకేగి పరమాత్ముని సన్నిధి చేరి
ప్రారంభించితివా అపుడే
పరమానందభరిత తొలి కచేరి..!

- అల్లాడి వేణుగోపాల్
చరవాణి : 9441895147
**

స్వరఝరికి శ్రద్ధాంజలి

ఆ స్వరం అమ్మ ఒడి ఊయలకు అందం నేర్పింది
ఆ స్వరం పొత్తిళ్ల పసిహృదయాలకు పాలు పట్టింది
ఆ స్వరం ప్రకృతిలోని పంచభూతాలకు
పదములు నేర్పింది
ఆ స్వరం సూర్యచంద్రుల కిరణాలతో
వెలుగువీణలు మ్రోగించింది
ఆ స్వరం కడలి కెరటాలతో రాగధ్వనుల
సరాగాలు పలికించింది
ఆ స్వరం సకల జీవరాశులకు ఆకలి అలసట మరిపించింది
ఆ స్వరం రాతి శిల్పాలచే రాగాలు పలికించింది
ఆ స్వరం చిరుసోయగాలులకు సుస్వరాలు నేర్పించింది
ఆ స్వరం వౌన మూగభాషలచే సరిగమలు
పలికించింది
ఆ స్వరం సంగీత ప్రపంచానికే శ్రుతిలయలు నేర్పించింది
అలసట ఎరుగని ఆ సుస్వర కంఠం
భువి నుండి దివికి పయనించింది
అష్టపదుల వయస్సు ధ్రువతారగా నింగికేగింది
ఓ గమకాల గానగంధర్వా
ఓ సకల కళా విద్వాంస విధాతా
ఓ మహాశయా మీరులేని ఈ క్షణం
నాట్యమయూరీలు సుస్వరాలు
సకలకళా వాయిద్యాలు
సకలకళా కోవిదుల హృదయాలు
మరువని మీ జ్ఞాపకాలతో అవనియందు
ఆ అమృతమూర్తికి
మరణం లేదంటూ విశ్వ జనజీవకోటి
శోకసముద్ర శ్రద్ధాంజలి

- హస్తిమోహన్‌రాజు
చరవాణి : 8008511316