రాజమండ్రి

వృద్ధాప్య వేదనకు నిలువుటద్దం... నాలుగో పాదం! (కొత్త పుస్తకం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వృద్ధాప్య వేదనకు నిలువుటద్దం... నాలుగో పాదం!
పేజీలు: 60; వెల : 40/-
ప్రతులకు:
దాట్ల దేవదానం రాజు
8-1-048
జక్రియా నగర్
యానాం - 533464
సెల్.నం.9440105987
**
బహు గ్రంథకర్త, ప్రముఖ కవి, కథకులు దాట్ల దేవదానం రాజు గారి కలం నుండి జాలువారిన ‘నాలుగో పాదం’ దీర్ఘకవిత ముదిమిలోని వైచిత్రిని, విషాదాన్ని ఆర్ద్రంగా మోసుకొచ్చింది. జీవన సంధ్యలో ఆవరించే ముదిమి కాలాన్ని భారంగా, దిగులుగా నడిపించేలా చేస్తుంది.. జీవన చరమాంకంలో వార్థక్యం గమనాన్ని తమ కవితా వస్తువుగా ఎంపిక చేసుకుని.. రాజు గారు వృద్ధాప్యంలోని బాధలను అక్షరబద్ధం చేశారు. దీర్ఘ కవితకు కావలసిన లక్షణాలన్నీ ఇందులో ఇట్టే ఒదిగిపోయాయి! ఎత్తుగడ, నడక, కొనసాగింపు, ముగింపులో రాజు గారు తీసుకున్న శ్రద్ధ అభినందనీయం! జీవన సంధ్యలో అలుముకునే దిగులు, చీకటి భీతావహస్థితిని ఈ కవితలో చక్కగా పొందుపరిచారు. పెద్దలను వృద్ధాప్యంలో నిరాదరణకు గురిచేసి..ఆశ్రమాల్లోకి నెట్టేసే సంస్కృతి మనది కాదని ఓ చక్కని సందేశంతో వెలువడిన ఈ కావ్యం ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. వార్థక్యంలో వున్నవారికి తోడుగా మాట్లాడే మనిషొకరుండాలనీ.. వార్థక్యం కూడా మరో బాల్యం వంటిదేనని తేల్చి చెప్పే ఈ కవితను ఏక బిగిన చదువడానికి యోగ్యంగా మలిచారు.
ఆఖరి మజిలిలో ప్రతీ ఒక్కరు పడే వేదనను ఈ కవితలో మనం చూస్తాం..
రెప్పలు మాయని ఎదురు చూపులు
ఆప్యాయతల పలకరింపుల కోసం
ఒక ఆత్మీయ కరచాలనం కోసం..
విమోచనానంతర జీవన శకలం
మూల గది మాధ్యమంగా
చిన్ని ప్రపంచంలో కూరుకుపోతూ
తడిలేని కళ తప్పిన
మడతల కడాఖరు మజిలీని
కవి చక్కగా చిత్రించారు.
కాల ప్రయాణంలో అలసిన
బాటసారులం..
హాయిగా సేద తీరనీయండి
రెండో బాల్యం వీధి చివర
నాలుగో పాదంలో
సణుక్కుంటూ విసిగిస్తున్న మమ్మల్ని
నిండార క్షమించేయండి
అన్న పంక్తులు మనల్ని కదిలిస్తాయి..
వృద్ధులు కన్నీళ్లను ఒంటరిగా మింగుతూ.. నిద్రలేమి సెగలో కాలుతూ.. కాటికి కాళ్లు చాపి..కాలం వెళ్లదీసే పెద్దల బాధల్ని ఆర్ద్రంగా కవి ఆవిష్కరించారు. ఈ దీర్ఘ కవిత తమిళం, మళయాలం, కన్నడం, ఆంగ్లంలోకి అనువదింపబడటం విశేషం! మందులు మాకులు కాదు.. రోజూ కాస్తంత మాట్లాడి సాంత్వన నివ్వండని కోరుతూ వృద్ధుల వ్యథలకు అద్దంపట్టే ఈ దీర్ఘ కవిత పెద్దలను నిరాదరణకు గురి చేసే ప్రబుద్ధులకు కనువిప్పు కలిగిస్తుందని ఆశిద్దాం.

**
ఈ శీర్షికకు కవితా, కథా సంపుటాలు ఏవైనా, ఇటీవల అచ్చయిన కొత్త పుస్తకాల సమీక్ష/ పరిచయం కోసం ఈ కింది చిరునామాకు పంపండి. కార్టూన్లు పంపించాలనుకుంటే, ఫొటో, చిరునామాతో ఈ -మెయిల్ అడ్రస్‌కు పంపించండి
మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, నేషనల్ హైవే, ధవళేశ్వరం, తూ.గో.జిల్లా. email: merupurjy@andhrabhoomi.net

- దాస్యం సేనాధిపతి కరీంనగర్, సెల్.నం.9440525544