విశాఖపట్నం

అనసూయ (మినీకథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆఫీసుకు వెళ్లి వస్తానని మోహన్ భార్య సుజాతకి చెప్పి తన మోటారు బైక్‌పై బయలుదేరాడు.
‘‘ఏమండీ సాయంకాలం ఆఫీసు అయ్యాక మా ఫ్రెండ్ అనసూయ వాళ్లింటికి రండి. నేను వాళ్లింట్లో ఫంక్షన్‌కి వెళతాను’’ అంది సుజాత.
‘‘అలాగేలే’’ అని చెప్పి మోహన్ ఆఫీసుకి వెళ్లిపోయాడు.
మధ్యాహ్నం పర్మిషన్ అడిగి స్నేహితురాలింటికి వెళ్లాలని అనుకుంది. అనసూయ సుజాతకి చిన్నప్పటి నుండి స్నేహితురాలు. పెద్దయ్యాక కూడా ఆ స్నేహం అలాగే కొనసాగుతోంది. ఒకే పాఠశాలలో టీచర్లుగా పనిచేస్తున్నారు.
సుజాతకి ఇద్దరూ మగపిల్లలే. ఎనిమిది, ఆరు చదువుతున్నారు. అనసూయకి ఇద్దరూ ఆడపిల్లలే. వాళ్లు కూడా ఎనిమిది, ఆరు చదువుతున్నారు.
సాయంత్రం పర్మిషన్ తీసుకుని ఇంటికి వెళ్లిన సుజాత ఫ్రెష్ అయింది. స్కూలు నుండి వచ్చే పిల్లల కోసం టేబుల్ మీద అన్నీ సర్దిపెట్టింది. తర్వాత ఇంటికి తాళం వేసి పక్కవారికి ఇచ్చింది. అనసూయ పెద్ద కూతురు మెచ్యూర్ అయింది. అందుకే ఫంక్షన్ వాళ్లింటో. సుజాత వెళ్లేసరికి వాళ్ల ఇల్లు బంధువులు, చుట్టాలతో సందడిగా ఉంది. అనసూయ ఆడపడుచులిద్దరూ ఊళ్లోనే ఉండడం వల్ల ముందుగానే వచ్చారు. అనసూయ భర్త పనులన్నీ ముగించుకుని రిలాక్స్‌డ్‌గా కూర్చుని కాఫీ తాగుతున్నాడు. పక్కనున్న పేపర్ తీసి వార్తలు చదవసాగాడు. అంతలోనే ‘‘అనూ ఇలారా’’ అని కేకేసాడు.
‘‘ఏమయిందండీ?’’ అంటూ అక్కడికి వచ్చింది అనసూయ.
‘‘పేపర్ చూడలేదా?’’ అనడిగాడు.
‘‘ఇంత సందడిలో పేపర్ చూడడం ఎక్కడవుతుంది చెప్పండి?’’ అంది.
‘‘నువ్వు రాసిన ఆర్టికల్ పేపర్‌లో పడిందోయ్’’ అన్నాడు సంతోషంగా.
‘‘అలాగా’’ అని వచ్చిన వారిని మర్యాద చేయడానికి బయటికి నడిచింది.
అనసూయ రాసే కథలు, కవితలు, వ్యాసాలను ఆమె భర్త విశ్వమే పత్రికలకి పంపుతుంటాడు. అప్పుడప్పుడు అవి అచ్చు కావడం జరుగుతుంటుంది.
విషయం తెలిసిన అనసూయ ఆడపడుచు మాట్లాడుతూ ‘‘ఏముంది ఇందులో గొప్ప. ఎవరు పంపినా వేస్తారు’’ అంది.
ఇంకో ఆవిడ మాట్లాడుతూ ‘‘కొబ్బరిపచ్చడి, పెసరపచ్చడి ఎలా చేయాలో అన్నట్లు ఏదో తోచింది ఎవరికీ తెలియని విషయాలన్నట్లు రాయడం, ఒకవేళ అచ్చయితే గొప్పగా ఫీలైపోవడం మామూలే’’ అంది.
ఇదంతా విన్న అనసూయ ఏమీ మాట్లాడలేదు.
ఆమె భర్త ఏదో అనబోయాడు.
అనసూయ అడ్డుకుంది.
‘‘ఇప్పుడీ విషయాలన్నీ ఎందుకు లెండి. అతిథులకి ఏం కావాలో చూద్దాం’’ అంటూ భర్తని అక్కడి నుండి లాక్కెళ్లిపోయింది.
‘పాపం అనసూయ... అసూయే తెలియదు’ అనుకుంది సుజాత.

**
కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి. email: merupuvsp@andhrabhoomi.net ఇ-మెయల్‌కు పిడిఎఫ్‌లో పంపించవచ్చు.

- జి. కృష్ణకుమారి, బాబామెట్ట, విజయనగరం. సెల్ : 9441567395.