విశాఖపట్నం

చైతన్య కవిత్వం.. మళ్లీ చిగురించనీ ( పుస్తక సమీక్ష)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కవితా శీర్షికలోనే అభ్యుదయ కాంక్ష, ఆశావాదం, చైతన్యాన్ని, నవతను ఆహ్వానించడం వంటి అర్థాలున్నాయి. నిరాశ, నిస్పృహ, నిర్వీర్యతలను నిరసించడం అంతర్లీనంగా కనిపిస్తుంది. చేయి తిరిగిన రచయిత్రి బి. కళాగోపాల్ రచన ఇది. 74 కవితలు ఆద్యంతం ఆకట్టుకుంటాయి. చదివిస్తాయి, అలరిస్తాయి. వైవిధ్యభరిత కవితల్లో భావాలు వెల్లివిరుస్తాయి. కొన్ని ఆకాంక్షల్ని కొన్ని ఆక్రోశాల్ని కొన్ని అన్యాయాల్ని, అఘాయిత్యాల్ని అంతమొందించే ఆక్రందనల్ని, కొన్ని నినాదాల్ని నిరసనల్ని చూపిస్తాయి. కొన్ని మంజుల మనోహర ముగ్ధ్భావాల దొంతరలు మనసును దొలుస్తాయి. కొన్ని యువతకి సందేశాలు, మనసుని దోస్తాయి. కొన్ని యువతకి సందేశాలు, స్ఫూర్తినిస్తాయి. కదిలిస్తాయి. అశ్రుభాషలో కన్నీటి సంద్రంలో తడిసి మెరవని జీవితం లేదు. మనీషీ లేడు. అశ్రుధారలు మనిషి ఏకైక మాతృభాష అంటారు రచయిత్రి భావగర్భితంగా. కొన్ని మాటలు తేనెచుక్కలు అయితే మరికొన్ని హృదయాలతో మాట్లాడే మనిషికే తెలుస్తుంది అంటున్న మాట కవిత కదం తొక్కింది. పిడికెడు స్వాభిమానం, చిటికెడు చైతన్యం, గుండెల నిండా పొదువుకుని ఎదుగుతున్న కొత్త ఊపిరిని నేను, ఒక ఝాన్సీగా, ఒక మలాలాగా, ఒక ఇంద్రా నూయిలా మజిలీ చేసే అమ్మతనాన్ని నేను అనడంలో కవియత్రి స్వేచ్ఛావాణి, బాణి, వాడివేడి, నాదం, వాదం ప్రతిబింబిస్తూ తోటి యువతులకు స్ఫూర్తిని, కదలికని ఇస్తాయి. మాయామోహాల మారీచుల వల నయవంచనకు గురియైన నారీమణి, కాటేసే కాలం నదిలో ఒంటరి నావికురాలిలా పోరు సలుపుతుంది. భవిష్యత్తు కడలిలో మునకలేస్తూందిలో నేటి మహిళ దుస్థితిని కళ్ల ముందుంచడం గమనార్హం. ఏనాటికైనా నీకంటూ ఓ స్థానం ఇవ్వని సమాజాన్ని అగ్నిబీజమై ఎగసి ప్రశ్నించంటూ స్ర్తిని హెచ్చరిస్తూ మద్దతునీయడం స్వాగతించదగింది. బడికి వెళ్లే ఆ చిట్టి చేతుల్లో మట్టితట్ట, గెంతులేసే ఆ బాల్యం రైలుబండిలో తుడుస్తుంది. అంటగినె్నలతో దోస్తీ, చీపురుకట్టతో కుస్తీ, అగచాట్లతో జీవనభృతి అంటూ చిత్రకారుని చిత్రపటంలా కవితా చిత్రిణ రచయిత్రికే చెల్లింది. కవితాశైలి కదిలింపజేస్తుంది. అభినవ అమ్మగా నాన్న ఎన్నటికీ నానే్న, కడుపుతీపిలో అమ్మకన్నా మిన్న, కుటుంబ గోవర్ధనగిరిధారి, వీపు తట్టి ప్రోత్సహించే చిరునామా! కవిత కమనీయంగా ఉంది. కవిత్వం ఒక తీరని దాహం, నా ఆలంబన భావాక్షరాల ఉద్దీపన, కవితా శిఖరాలపై విహరించాలన్న తపన. ఉప్పెనలాంటి సాధన, శోధన, ఓ రమణీయ భావాన్ని ఆవిష్కరిస్తే అప్పుడే పుట్టిన బిడ్డలా ‘కేర్’ మంటుంది. కవిత తనదైన మానసపుత్రికలా అంటున్న కవయిత్రి కౌశలాన్ని అభినందిద్దాం. ఆమె లేఖిని నుండి మరిన్ని కవితలను ఆకాంక్షిద్దాం. ప్రతులకు 9441631028లో సంప్రదించండి.

- చెళ్లపిళ్ల సన్యాసిరావు,
సెల్ : 7032606821.

**
మనోగీతికలు

పులకింత
రాగాలు తీస్తూనే మైమరచి పోయేవు
చిరుగాలి తరగలకే చిందు లేసేవు
ఏటికే నాఎంకి వినలేని హొయలు
వయసు ఊహలు నీలో వొగలు రేపేను
ఏటిగట్టున నువ్వు ఎగిసి పడకే ఎంకి
గిలిగింతలతో ఒళ్లు త్రుళ్లింతలయ్యేను
నీటిలో నా నావ నీవంక చూసేను
కనుకొట్టి చిలిపిగా చెంగులాగేను
మందారం నినుచూసి మకరందమొలికించ
చిగురాకు నీ చెంప చిలిపిగా తడిమేను
కనె్నపిల్లను చూడ ఉరకలేసును నది
నిను చూచి ముచ్చటగ పరుగులెత్తును మది
గోదారి వలె నువ్వు గలగలా నవ్వకే
నీ ధ్యాసతో నా పేణాలు తీయకే
అందీ అందకుండా నను ఊరించకే
ఏటికే నా ఎంకి ఎనలేని హొయలు?

- శివాని
శృంగవరపుకోట
**

అందం

ఫెయిర్ అండ్ లౌలీ రాసి
చర్మానికి అద్దావు అందం
మనసుకు ఏం పూస్తావు?
చాలా నల్లగా ఉంది
సర్కారు బడి
చదవడానికా?
ప్రైవేట్ స్కూలుకి వెళ్తా
చదువు చెప్పడానికా?
సర్కారు బడైతేనే వెళ్తా
గర్వం
మనం అనే భావన
ఆనంద పర్వం
నేనే అని విర్రవీగితే
కోల్పోవడమే సర్వం

- చావలి శేషాద్రి సోమయాజులు
9032496575
**

ప్రశ్న

గమనం గాలిని ప్రశ్నిస్తుంది
గాయం గుండెని నిలదీస్తుంది
యుగాలు... స్వప్నాలుగా...
చిరకాలం ఉంటే...
చెదిరిపోతున్న శరీరాలు..
జీర్ణమవుతున్న జీవితాలు
ఏ నదిలో ప్రవహించాలి...
ఏ శతాబ్దాన్ని ప్రశ్నించాలి
మనిషి నిర్యాణం మట్టిగా....
పాతర అవుతుంటే...
ప్రశ్నలు బందిఖానాల్లో
మూలుగుతున్నాయి

- కోనే సతీష్
సెల్ : 7675924944.
***

మినీ నానీలు

ఎముకల యిటుకల
దేహ గోరీలో
మనసు లైలా!
***
టైమెంతయింది?
అడిగింది కాలాన్ని
ఆగిపోయిన వాచీ
* * *
ఇంట్లోని చెత్తను ఊడ్చేసారు
కన్ను మూసాక
నేనూ చెత్తనే
* * *
ఆకాశంలో
వెనె్నలంత అందంగా
చందమామ
* * *
నిద్రలో రాని సందేహం
లేచాక వచ్చింది
ఇది కలా! అని

- మాధవీ సనారా, అనకాపల్లి
సెల్ : 9440103134.
***
సూటిగా ప్రశ్నించు!

సుందర విశాఖ
కాలుష్యంతో బాధపడుతోంది
ప్రశ్నించాలి ప్రజాప్రతినిధులను ఈ విషయమై
పరిశ్రమల స్థాపన
అభివృద్ధికి ప్రతిబంధకం కారాదు
అవినీతి జడలు విప్పి నాట్యం చేయరాదు
ఎంతటి వారినైనా నిలదీసే సత్తా
మనకు రావాలి
సూటిగా ప్రశ్నించే దమ్ము ఒనగూడాలి
అప్పుడే మనం అభివృద్ధిపథాన పయనిస్తాం!

- నాగాస్త్రం నాగు, వడ్లపూడి
సెల్ : 9966023970.