ఉత్తర తెలంగాణ

తెల్ల గులాబి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘విశ్వా ఒక గులాబి మొక్క కొనివ్వవా’ అని అడిగింది స్నేహితురాలు వాసంతి. సరేనంటూ ‘ఏ గులాబి మొక్క? తెల్లదా, ఎర్రదా?’ అని అడిగాడు. ‘నాకు తెల్ల గులాబి చెట్టు కావాలంది. ఆ తరువాత కొన్ని రోజులకు విశ్వ ఒక ఎర్ర గులాబి మొక్కను తీసుకువచ్చి ప్రేమగా పెంచాడు. అభిమానాన్ని వర్షంగా కురిపించి అందమైన గులాబి పువ్వును పూయించాడు. ఎర్ర గులాబీ తీసుకువచ్చి వాసంతికి ఇవ్వబోయాడు. వాసంతి వద్దని అంది. ‘నేనడిగింది ఎర్రది కాదు, నాకు తెల్ల గులాబి కావాలి’ జీవితాన్ని ప్రశాంతంగా గడుపాలని, శాంతంగా ఉండాలని, తెల్ల గులాబీ కావాలని విశ్వాన్ని కోరింది. సరేనని ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఇంత ఆప్యాయతను, అభిమానాన్ని కలిపి ప్రేమగా పూయించిన గులాబి దీన్ని నిరాకరిస్తావెందుకని ముఖాముఖిగా అడిగాడు వాసంతిని. ఎందుకు ‘మీ మగాళ్లకున్న బుద్ధి అదేనా?’ అంది. ఆగలేక ఆవేశంగానే ఒక మాటను వదిలింది. ‘అసలు ననే్నమనుకుంటున్నావు? నాకు ఆత్మాభిమానం ఉంది, నేను మనిషినే, నావల్ల నీవు సంతోషాన్ని పొందుతున్నావు. ‘ఒక స్నేహితుడిగా నీకు నేనందిస్తున్నానుగా’ అని బాధగా అన్నాడు. ‘అవును కాదు అని అనను. అయినా మాట్లాడితే చాలు మీ మగాళ్లు ఎక్కడికో వెళ్లిపోతారు పో.. వేస్ట్‌ఫెలో’ అంది. ఆ మాటలు విన్న విశ్వ ‘గులాబీకి ఏ రంగుంటే ఏంటి? మనసు మంచిదైతే ఆలోచన ధోరణి బాగుంటుంది’ అని తెచ్చిన ఎర్ర గులాబీని తీసుకుని తిరిగి కోపంగా విశ్వ వెళ్లిపోయాడు.
ఇంటికి వెళ్లడం వరకు వెళ్లాడు కానీ.. ఆ ఆలోచనల షాక్ నుండి తేరుకోలేకపోయాడు. ఏదో గిల్ట్ఫీలింగ్ ఏం చేశానో, నావల్ల ఏం తప్పు జరిగింది. ఎందుకిలా ఆలోచిస్తున్నారు. ఒక ఆడ, మగ కలిసి మాట్లాడితే ఏదో ఒక మరక పెడుతుంది సమాజం అందుకే వాసంతి ఇంత మూర్ఖంగా ప్రవర్తిస్తుందేమోనని పరి పరి విధాలుగా ఆలోచించాడు. తినాలని అనిపించలేదు. అమ్మ బలవంతంమీద తిన్నాననిపించి నిద్రలోకి జారుకున్నాడు. వాసంతి బయట కనపడినప్పుడల్లా ముఖం తిప్పుకోవడం మొదలెట్టింది. సామాజిక కార్యక్రమాల్లో కనిపించినా సరే ముఖం తిప్పుకోవడం మొదలెట్టింది. కొంత కాలం తనూ వౌనంగానే ఉన్నాడు. రెండవ విడత హరితహారంలో వాసంతి పాల్గొంది. విశ్వ కూడా వచ్చాడు. తన ప్రొఫెషన్ పనిమీద అక్కడే ఉన్నాడు. వాసంతికి సమాజ కార్యక్రమాలంటే మహా ఇష్టం. మొక్కల గురించి మాట్లాడింది. మొక్కలు లేని జీవితం లేదు. మనిషికి సంజీవనిలా ప్రాణాన్ని పోసేది మొక్కలేనని ఆక్సిజన్ తగ్గితే అనర్థదాయకం. భవిష్యత్ ప్రశ్నార్థకమవుతుందని, మొక్క తోటే ఆక్సిజన్ ఆవాసం, ఔషధం, ఆహారం అన్నీ ఒకటికొకటి ముడిపడి ఉన్నా గొలుసుకట్టు జీవావరణ వ్యవస్థని, అలాంటి కార్యక్రమం కోసం స్వచ్ఛందంగా అందరూ చెట్లు నాటడానికి ముందుకు రావాలని అనర్గళంగా మాట్లాడి అందరి మన్ననలు పొంది లైఫ్ సెన్స్‌తో పాటు సైన్స్‌ను బోధించింది.
వాసంతి గురించి అప్పటికే తెలిసిన విశ్వ వాసంతి దగ్గరికి వెళ్లి ‘నీ ఉపన్యాసము భేష్’ అని మెచ్చుకున్నాడు. తాను తెచ్చిన తెల్ల గులాబీనీ వాసంతి చేతికిచ్చాడు. ‘నీ స్నేహం లేకపోతే నాకు ఆక్సిజన్ లేని ప్రాణమవుతుంది ఇదిగో’ అన్నాడు... వౌనంగా తదేకంగా చూస్తున్న వాసంతితో..
‘్థ్యంక్యూ’ అంటూ తీసుకొని గులాబీని ముద్దాడింది. విశ్వకు ఏం అర్థం కాలేదు. కానీ, స్నేహంలో మాత్రం నిజాయితీ ఉన్నదని ఇద్దరు రుజువు చేసుకున్నారు.

- హనుమాండ్ల రమాదేవి బెల్లంపల్లి, మంచిర్యాల జిల్లా సెల్.నం.9959835745