ఉత్తర తెలంగాణ

పాఠ్యాంశాల్లో ప్రాంతీయతకు చోటుండాలి (అంతరంగం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డాక్టర్ బండ సరోజన
విజేత లక్ష్మినివాస్
ఫ్లాట్ నం. 404
సలీంనగర్ కాలనీ
మలక్‌పేట, హైదరాబాద్-36
సెల్.నం.040-24548440
**
పాఠ్యాంశాల్లో ప్రాంతీయతకు పెద్దపీట వేయాలని భావించే ప్రముఖ రచయిత్రి, పాఠ్యపుస్తక రూపశిల్పి డాక్టర్ సరోజన బండ పాత వరంగల్ జిల్లా మద్దూర్ మండలం లద్నూర్ గ్రామానికి చెందిన వారు. ఆమె పాఠశాల స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాల్లో స్ర్తి హోదా చిత్రణ గురించి అధ్యయనం చేసి.. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పిహెచ్‌డి పట్టా పొందారు. హైదరాబాద్ రాష్ట్ర పరిశోధన శిక్షణా సంస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక విద్యాపథకం, ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల్లో వివిధ హోదాల్లో పని చేసి ఉద్యోగ విరమణ పొందారు. అనేక పాఠ్యపుస్తకాల రూపకల్పన కమిటీల్లో ఆమె సంపాదకులుగా వ్యవహరించారు.
తెలుగు విశ్వ విద్యాలయం వారు రూపొందించిన నవోదయ పాఠ్యపుస్తకాలు, సిబిఎస్‌ఇ సిలబస్ తెలుగు పాఠ్య పుస్తకాలకు భాషా నిపుణులుగా వ్యవహరించారు. పదో తరగతి ఉపవాచకం ‘విశ్వమాన్ థెరీసా’కు సంపాదకత్వం వహించారు. 1994లో రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇంగ్లాండులోని వీడ్స్ విశ్వవిద్యాలయంలో ప్రాథమిక విద్యా పాఠ్య ప్రణాళిక నిర్మాణం మరియు పాఠ్యపుస్తక రచనలో ఆమె శిక్షణ పొందారు. రేడియో ఆర్టిస్టు, వివిధ అంశాలకు సంబంధించి వీరు రచించిన పాటలు, ప్రసంగాలు, రూపకాలు ఆకాశవాణి హైదరాబాద్ నుండి ప్రసారమైనాయి. అవి గ్రంథ రూపంలో కూడా వెలువడినాయి. బహుముఖ ప్రజ్ఞలను సొంతం చేసుకున్న ఆమె ‘సప్తస్వరాలు’, ‘ఒక పూవు పూసింది’, ‘ఎర్రమందారం’, కవితా సంపుటాలను వెలువరించారు. ‘ప్రకృతికే ఆభరణాలు’, ‘అక్షరమే ఆయుధం’, ‘లచ్చుమమ్మ ముచ్చట్లు’ పేర్లతో మూడు గ్రంథాలను ప్రకటించి.. తనకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ.. తమ అనుభవాలను, తమ రచనల్లోని ముఖ్యాంశాలను పాఠకులతో పంచుకున్నారు. ‘మెరుపు’ ఆమె అంతరంగాన్ని ఆవిష్కరింప యత్నించింది. ముఖాముఖీ వివరాలు ఆమె మాటల్లోనే...

మీ దృష్టిలో కవిత్వం అంటే ఏమిటి?
కవిత్వం పాఠకులను కదిలించగలగాలి. సామాన్యుడికి సైతం అర్థమయ్యేలా అలతి అలతి పదాలతో కవిత్వాన్ని పండించాలి. పాఠకుల హృదయాలను తాకేలా ఉండాలి.

మీరు ఎన్నో ఏట రచనా వ్యాసాంగాన్ని ప్రారంభించారు!
1960లో సిద్ధిపేటలో ప్రాథమిక ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్న సమయంలో గురువర్యులు కె.వెంకటాచారి, వేముగంటి నర్సింహాచార్యులు గార్ల ప్రోత్సాహంతో మొట్టమొదట ‘ఉపాధ్యాయుడు’పై కవిత రాశాను.

మీరు ఎన్ని గ్రంథాలను వెలువరించారు?
ఆరు గ్రంథాలు.. మూడు కవితా సంపుటాలు, మరియు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో రేడియో ఆర్టిస్టుగా సృజన చేసిన రచనలను మూడు గ్రంథాలను వెలువరించారు.

ప్రభుత్వ పరంగా ఎన్నో విద్యా పరిశోధనా సంస్థల్లో
పనిచేశారు కదా! మీరు అప్పుడు ఎక్కువ ఏ అంశంపై దృష్టి సారించారు?
నేను పాఠ్యపుస్తకాల రచనపై ఇంగ్లండులో శిక్షణ పొంది వచ్చాక.. బాలికలు మరియు మహిళల విద్యపై దృష్టి సారించాను. అప్పటి ఒకటి, రెండో తరగతి విద్యార్థుల తెలుగు పాఠ్య పుస్తకాలను, పదో తరగతి తెలుగు ఉపవాచకం తీసుకరావడంతో ప్రముఖ పాత్ర పోషించాను.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక వెలువడిన పాఠ్య పుస్తకాలపై
మీ అభిప్రాయం?
సంబంధిత తరగతులకు బోధించిన అనుభవజ్ఞులతో పాఠ్య పుస్తకాలు రాయిస్తే బాగుండేది. లక్ష్యాలు, అంశాల ఎంపిక, ప్రదర్శన, అభ్యసన అనుభవ వ్యవస్థీకరణ, మూల్యాంకనం వంటి విషయాలకు సముచిత ప్రాధాన్యత ఇస్తే బాగుండేది.

ఇప్పుడొస్తున్న కవిత్వంపై మీ అభిప్రాయం?
ఇప్పుడు విస్తృతంగా వచన కవిత్వం వెలువడుతోంది. సంతోషమే.. కానీ వస్తు ఎంపిక, అభివ్యక్తి శిల్పం విషయంలో శ్రద్ధ చూపాల్సి ఉంది.

సాహితీ పురస్కారాలపై మీ అభిప్రాయం?
ప్రతిభ గలవారిని అర్హులను పారదర్శకంగా ఎంపిక చేసి ఇస్తే పురస్కారాలు మంచివే.. పురస్కారాలు కవులు, రచయితల బాధ్యతను పెంచుతాయి.
**
ఇంటర్వ్యూ: దాస్యం సేనాధిపతి, సెల్.నం.9440525544